స్ప్రాకెట్ హోల్ ఛాయాచిత్రకళ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్ప్రాకెట్ హోల్ ఛాయాచిత్రకళ (ఆంగ్లం: Sprocket Hole Photography) ఒక రకమైన అనలాగ్ ఫోటోగ్రఫీ, ప్రత్యామ్నాయ ఛాయాచిత్రకళ. సాధారణంగా 135 ఫిల్మ్ యొక్క స్ప్రాకెట్ రంధ్రాలపై ఛాయాచిత్రం నమోదు అవ్వదు. అయితే, కొన్ని కెమెరాలను, వాటిలో అమర్చబడే మాస్కులను వినియోగించి, స్ప్రాకెట్ రంధ్రాలపై కూడా ఛాయాచిత్రం నమోదు చేయవచ్చును. ప్రత్యామ్నాయంగా 120 ఫిల్మ్ వాడబడే కెమెరాలలో 135 ఫిల్ం ను ఉపయోగించి కూడా స్ప్రాకెట్ రంధ్రాలపై ఛాయాచిత్రం నమోదు చేయవచ్చు. దీనినే స్ప్రాకెట్ హోల్ ఛాయాచిత్రకళ అంటారు.