Jump to content

120 ఫిల్మ్

వికీపీడియా నుండి
ఒక 120 ఫిల్ం (ఎడమ), ఒక 135 ఫిల్ం (కుడి) ల పోలిక.

120 ఫిల్ం (ఆంగ్లం: 120 film) అనేది నిశ్చలన ఛాయాచిత్రకళ (Still Photography) కొరకు కొడాక్ సంస్థవారు, తమచే రూపొందించిన బ్రౌనీ నెం. 2 అనబడే కెమెరా కోసం 1901 లో తయారు చేసిన ఫిలిం. 135 ఫిల్మ్ వచ్చే వరకూ ఔత్సాహిక ఛాయాచిత్రకళలో (Amateur Photography) 120 ఫిల్ం మాత్రమే వినియోగించబడేది. మీడియం ఫార్మాట్ ఫిలింలు మూడు రకాలు. అవి 120, 220, 620 ఫిలిం లు.

లక్షణాలు

[మార్చు]
బ్యాకింగ్ పేపర్ పై ఫ్రేం సంఖ్యలు
120 ఫిలిం లోడ్ చేసిన డయానా ఎఫ్+ కెమెరా. 12 షాట్ల అమరికకు కనబడుతోన్న 5వ ఫ్రేం సంఖ్య.

60 మిల్లీ మీటర్ల వెడల్పు ఉండే ఫిలిం చుట్ట ఒక స్పూల్ కు చుట్టబడి ఉంటుంది. ఈ స్పూల్ తొలుత చెక్కతో చేబడి, ఫ్లాంజీలు (ఫిలింను పట్టి ఉంచే వృత్తాకార చివరలు) మాత్రం లోహంతో చేయబడి ఉండేది. తర్వాతి కాలంలో స్పూల్ కూడా లోహంతో తయారు చేయబడింది. ప్రస్తుత కాలంలో స్పూల్, ఫ్లాంజీలు ప్లాస్టిక్ తోనే చేయబడుతోన్నాయి. 760 మిల్లీ మీటర్ల పొడవు ఉండే 120 ఫిలింలో సాధారణంగా 12 షాట్ లు వస్తాయి. అయితే కొన్ని ఫ్రేంలు వాడటం వలన 16 షాట్ లు కూడా వస్తాయి. ఫిలిం ఆసాంతం వెనుకవైపు భాగాన ఒక్ కాగితం అంటించబడి ఉంటుంది. దీనినే బ్యాకింగ్ పేపరు అంటారు. ఫిలింకు మొదట, చివర లోడింగ్, అన్ లోడింగ్ కొరకై అదనపు పేపరు కలిగి ఉంటుంది. ఈ పేపరు ఫిలింకు రక్షణగా నే కాకుండా, దానిపై ఫ్రేం నెంబరులు కూడా ముద్రించబడి ఉంటుంది. కెమెరా వెనుకవైపు ఉండే ఒక కిటికీ గుండా ఈ ఫ్రేం నెంబరు ఫోటోగ్రఫర్ కు కనబడుతుంది.

120 ఫిలిం యొక్క ఫ్రేం సైజుల పట్టిక

120 frame sizes
Name Aspect ratio Nominal size
(mm)
Exposures
120 220
6 × 4.5 1.35:1 56 × 41.5[1] 15 or 16 30–32
6 × 6 1:1 56 × 56 12 or 13 24–27
6 × 7 1.20:1 56 × 67 10 21
6 × 8 1.37:1 56 × 77 9 19
6 × 9 1.50:1 56 × 84 8 18
6 × 12 2.1:1 56 × 118 6 12
6 × 17 3:1 56 × 168 4 9
6 × 24 4:1 56 × 224 3 6

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 645NII specifications Archived 2010-03-18 at the Wayback Machine, Pentax.
"https://te.wikipedia.org/w/index.php?title=120_ఫిల్మ్&oldid=3847504" నుండి వెలికితీశారు