విగ్నెటింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టాయ్ కెమెరాలతో తీసే ఛాయాచిత్రాలలో విగ్నెటింగ్ సర్వసాధారణం. ఈ ఫోటో హోల్గా అనే టాయ్ కెమెరాతో తీయబడింది.

విగ్నెటింగ్ ఒక ఛాయాచిత్రం యొక్క మూలలు చీకటిమయం అవ్వటం లేదా చేయటం. మూలలు చీకటిమయం అవ్వటం/చేయటం వలన ఛాయచిత్రం మధ్యభాగం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సాధారణంగా విగ్నెటింగ్ కెమెరా అమరికల వలన కటకం పరిమితుల వలన కలిగిననూ, సృజనాత్మక ప్రభావం కోసం కృత్రిమంగా కూడా దీనిని సాధించవచ్చును.