టాయ్ కెమెరా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

టాయ్ కెమెరా (ఆంగ్లం: Toy Camera) అనగా ఛాయాచిత్రకళారంగంలో ఒక చవకైన, ప్రాథమిక ఫిలిం ఆధారిత కెమెరా.

పేరుకి బొమ్మ కెమెరాలు అయినా ఇవి పూర్తి స్థాయిలో పనిచేసి చక్కని ఛాయాచిత్రాలని తీయగలవు. వీటితో తీసే ఛాయాచిత్రాలు పలు అసాధరణ ప్రభావాలకి లోను కావటం ఆసక్తిదాయకం.

టాయ్ కెమెరాల యొక్క ఆసక్తికర అసాధారణ ప్రభావాలు[మార్చు]

ప్లాస్టిక్ కటకాల వలన[మార్చు]

ప్లాస్టిక్ తో నిర్మించబడిన వీటి కటకాల వలన ఛాయాచిత్రాలు పలు ఆసక్తికరమైన ప్రభావాలకి లోనవుతాయి. అవి

నిర్మాణ శైలి వలన[మార్చు]

టాయ్ కెమెరాల నిర్మాణం కూడా తక్కువ బరువుగల ప్లాస్టిక్ తోనే, అది కూడా పురాతన నిర్మాణ పద్ధతుల ద్వారా జరుగుతుంది. లోపభూయిష్టమైన ఈ నిర్మాణం వలన కటకం గుండానే కాక వేరే దిశ నుండి కెమెరాలోకి కాంతి ప్రవేశించటం వలన ఛాయాచిత్రాలు లైట్ లీక్స్ (కాంతి తప్పటం) కి గురి కావటం జరుగుతుంది.

ఆధునిక కాలంలో టాయ్ కెమెరాల పై ఆసక్తి[మార్చు]

తర్వాతి కాలంలో నిర్మించబడిన అధునాతన కెమెరాలలో గాజుతో చేసిన కటకాలని వాడటం, లోపరహిత నిర్మాణ పద్ధతులని అవలంబించటంతో ఈ దుష్ప్రభావాలని అధిగమించారు. అయితే 1990వ సంవత్సరం నుండి ఇటువంటి ప్రభావాలు/కెమెరాలపై ఛాయాగ్రహకులలో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. అదే పనిగా ఇటువంటి ప్రభావాలని ఛాయాచిత్రాలతో తీసుకురావటం అరుదైన నైపుణ్యతగా గుర్తింపబడి, ఆ నైపుణ్యత కనబరచిన ఛాయాచిత్రకారులకి/ఛాయాచిత్రాలకి పలు పురస్కారాలని తెచ్చిపెట్టినది. ప్రపంచవ్యాప్తంగా టాయ్ కెమెరాల పనితనం ప్రదర్శింపబడటమే కాక, కొనియాడబడింది. ఛాయాచిత్రకళకి సంబంధించిన వివిధ పత్రికలు ఈ కెమెరాల లోపాలని వాటి ధర్మాలుగా పరిగణించి వీటి ఫోటోగ్రఫిని ఒక కళగా అభివర్ణించాయి. ఇటువంటి ఛాయాచిత్రాలపై పలు పుస్తకాలు అచ్చు అయ్యాయి.

ఇప్పటి అధునాతన డిజిటల్ కెమెరాలు కూడా టాయ్ కెమెరా ఎఫెక్ట్ అని ఒక ఆప్షన్ ని ప్రతి కెమెరాలో ఉంచటం, ఆ ప్రభావాలని తేవటానికి అత్యంత ఖరీదైన కటకాలని, ఇతర సామాగ్రిని ప్రత్యేకించి తయారు చేయటం టాయ్ కెమెరాల పనితనానికి, వాటిపై ఉన్న జనాదరణలకి నిదర్శనం.

టాయ్ కెమెరాలు[మార్చు]

పలు టాయ్ కెమెరాలు విరివిగా లభ్యమైననూ ఈ రకం ఫోటోగ్రఫీని ఇష్టపడేవాళ్ళు ఎక్కువగా వినియోగించే మోడళ్ళు.

  • డయానా ఎఫ్+ : ఇది ఒక 120 ఫిలిం ఆధారిత కెమెరా. అయితే దీనికి 35 ఎం ఎం ఫిలిం బ్యాక్ ని జతచేసి 35 ఎం ఎం ఫిలింని కూడా వాడవచ్చును. 120 ఫిలింతో పోలిస్తే వైశాల్యం తక్కువ ఉండటం మూలాన 35 ఎం ఎం ఫిలిం పై కటకాల ప్రభావం కొద్దిగా తగ్గుతుంది. ప్యారలాక్స్ ఎర్రర్ కి అవకాశం కూడా పెరుగుతుంది. తీయాలనుకొన్న వస్తువు ఒక్కో మారు 35 ఎం ఎం ఫిలిం పరిధి దాటి పోతుంది. దృష్టి కోణం ఎక్కువగా ఉన్న కటకాలు, ఫిలిం వైశాల్యాన్ని దృష్టిలో పెట్టుకొనటం, వ్యూ ఫైండర్ కి, కటకానికి మధ్య ఉన్న దూరాన్ని అంచనా వేసి దానికి తగ్గట్టుగా చిత్రీకరించటంతో ఇటువంటి దుష్ప్రభావాలాని నివారించవచ్చును.
  • హోల్గా: సూక్ష్మ రంధ్రాలు, కటకాలు డయానాతో పోలిస్తే తక్కువే. అందుకే డయానా సృష్టించే దుష్ప్రభావాలతో హోల్గా కూడా బాగా పోటీపడుతుంది.
  • లోమో ఎల్ సి-ఏ: రంగుల తీవ్రతని పెంచి చూపటంతో ఛాయాచిత్రాలకి పురాతనమైన ఒక ప్రభావం కలుగుతుంది. ప్రాథమికంగా 35 ఎం ఎం ఫిలిం కెమెరా అయిననూ, ఇటీవలె 120 ఎం ఎం కెమెరా కూడా విడుదలైనది.
  • లూబిటెల్: నైపుణ్యత కలవారు ఉపయోగించే కెమెరా వలె కనబడే ఒక 120 ఎం ఎం ట్విన్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరా.

మూలాలు[మార్చు]

  1. న్యూ యార్క్ టైంస్ లో టాయ్ కెమెరాల గురించి
  2. ఎన్ పీ ఆర్ లో టాయ్ కెమెరాల గురించి
  3. అధునాతన కెమెరాలలో కూడా టాయ్ కెమెరాల వలె ఛాయాచిత్రాలని సృష్టించటానికి లోమోగ్రఫీ రూపొందించిన కటకాలు, సూక్ష్మరంధ్రాలు మరియు రంగు ఫిల్టర్లు