టి ఎల్ ఆర్ కెమెరా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మొదటి తరం ట్విన్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరా యొక్క స్కెచ్. తొలుత విడుదల అయిన టి ఎల్ ఆర్ కెమెరాల కటకాలు ఒకదానికి మరొకటి అనుసంధానించబడి ఉండేవి కావు. కావున ఒక్ ఫోటో తీయటానికి, రెండు కటకాలను సరియైన దూరాలకు అనుగుణంగా అమరిక చేయవలసి వచ్చేది.

ట్విన్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరా (ఆంగ్లం: Twin-lens reflex camera) అనగా ఒకే నాభ్యంతరం గల రెండు కటకాలను ఉపయోగించే ఒక రకమైన కెమెరా. ఈ రెండు కటకాలలో పైన ఉండే కటకం (viewfinder) వీక్షించటానికి క్రింద ఉండే కటకం ఫిలిం పై ఛాయాచిత్రాన్ని నమోదు చేయటానికి (Taking Lens) ఉపయోగించబడతాయి. పైన ఉండే కటకం 45 డిగ్రీల కోణంలో అమర్చబడిన దర్పణానికి, కెమెరా పై భాగాన ఉండే ఫోకసింగ్ స్క్రీన్ కు అనుసంధానించబడి ఉంటుంది. ఈ స్క్రీన్ కు రక్షణగా ఒక కవచం ఉంటుంది. పాతతరం టి ఎల్ ఆర్ లలో దృశ్యానికి అనుగుణంగా రెండు కటకాలను వేర్వేరుగా కూర్చవలసిన అవసరం ఉన్ననూ, క్రొత్త తరం టి ఎల్ ఆర్ లలో ఇవి రెండూ ఒకదానికి ఒకటి అనుసంధానించబడి ఉండటంతో రెంటినీ ఒకే మారు కూర్చుకోగలిగే సౌలభ్యం కలదు.

సాధారణంగా టి ఎల్ ఆర్ లలో వివిధ రకాల మీడియం ఫార్మాట్ ఫిల్మ్ లు వాడబడతాయి.

చరిత్ర[మార్చు]

మొదట స్క్రీన్ పై చూచి, దాని స్థానంలో ఫోటోగ్రఫిక్ ప్లేటును అమర్చటం అనే క్లిష్టతరమైన ప్రక్రియను సులభతరం చేస్తూ 1870 లో మరొక కటకం గుండా ఫోటోతీయవలసిన వస్తువును చూస్తూ దృశ్యాన్ని కూర్చగలిగే కెమెరాను రూపొందించటం జరిగింది. పై నుండి ఫోటో తీయబడే వస్తువు ఫోటోలో ఎలా వస్తుందో ముందే చూపటం కెమెరాను ఇలా చేత్తో పట్టుకోవటం వలన ఫోటోగ్రఫర్ కు కెమెరా పై పట్టు రావటంతో టి ఎల్ ఆర్ కెమెరాలు మన్ననలు పొందాయి. లండన్ స్టీరియోస్కోపిక్ కంపెనీ కార్ల్ టన్ పేరుతో మొట్టమొదటి టి ఎల్ ఆర్ కెమెరాను 1885లో రూపొందించింది. అయితే జర్మనీకి చెందిన ఫ్రాంకె అండ్ హైడెకెలు 1929 లో రోల్లేకార్డ్ సంస్థ ద్వారా రూపొందించిన రోల్లేఫ్లెక్స్ కెమెరా మొట్టమొదటి జనబాహుళ్యం పొందిన కెమెరా.

ఇవి కూడా చూడండి[మార్చు]