Jump to content

మీడియం ఫార్మాట్ ఫిల్మ్

వికీపీడియా నుండి
ఒక మీడియం ఫార్మాట్ ఫిల్ం (ఎడమ), ఒక 135 ఫిల్ం (కుడి) ల పోలిక.

మీడియం ఫార్మాట్ (ఆంగ్లం: Medium format) 135 ఫిల్మ్ కంటే కొద్దిగా పెద్దదిగా ఉండే ఫిలిం (కానీ లార్జ్ ఫార్మాట్ కంటే చిన్నదిగ ఉండే ఫిలిం) ను ఉపయోగించే ఒక రకమైన ఛాయాచిత్రకళ [1].

చరిత్ర

[మార్చు]

117 ఫిలిం

[మార్చు]

అంతకు మునుపు ఫోటోగ్రఫీ ఒక కళగా, శాస్త్రంగా పరిగణించబడి కేవలం నిపుణులకు మాత్రమే సాధ్యపడేది. ఫోటోగ్రఫీకి కావలసిన పరికరాలు పెద్దవిగా ఉండటం, దాని వలన వాటి ధర కూడా ఎక్కువగా ఉండటం, ఫోటోగ్రఫీలో ఔత్సుకుత పెరగటం, సాధారణ ప్రజానీకం కూడా ఫోటోగ్రఫీని అభిరుచిగా అలవరచుకోవటం గమనించిన కొడాక్ ఫోటోగ్రఫీని జనబాహుళ్యంలోకి తీసుకెళ్ళే ప్రయత్నంలో 1901 లో కొడాక్ బ్రౌనీని తయారు చేసింది [2] . రెండుంపాఫు (2.25) ఇంచిల పొడవు, అంతే వెడల్పు గల ఫోటోలను 117 ఫిలిం పై నమోదయ్యే ఈ కెమెరా మీడియం ఫార్మాట్ ఫిలింకు బీజాలు వేసింది. తర్వాతి కాలంలో 117 ఫిలిం వాడే కెమెరాల తయారీ ఆగిపోవటం, మీడియం ఫార్మాట్ లో 120, 620, 220 ఫిల్ంలు రావటంతో కొడాక్ 117 ఫిలిం తయారీని ఆపివేసింది.

1970లో 135 ఫిల్మ్ రాకతో మీడియం ఫార్మాట్ లు కనుమరుగయ్యాయి.[3]

మీడియం ఫార్మాట్ ఫిలిం లో రకాలు

[మార్చు]

మీడియం ఫార్మాట్ ఫిలింలు మూడు రకాలు. అవి:

కొడాక్ సంస్థవారు, తమచే రూపొందించిన బ్రౌనీ నెం. 2 అనబడే కెమెరా కోసం 1901 లో తయారు చేసిన ఫిలిం. 135 ఫిల్మ్ వచ్చే వరకూ ఔత్సాహిక ఛాయాచిత్రకళలో (Amateur Photography) 120 ఫిల్ం మాత్రమే వినియోగించబడేది. ఈ ఫిలిం పై 12 నుండి 16 షాట్లు వస్తాయి.

1931 లో కొడాక్ 620 ఫిలింను విడుదల చేసింది. 620 ఫిలిం యొక్క ఊచ సన్నగా లోహంతో చేయబడి ఉండేది. 1995 లో ఈ ఫార్మాట్ లో ఫిలిం తయారీని కొడాక్ ఆపివేసింది.

1965లో 120 ఫిలిం పొడవును (, ఫ్రేం లను) రెట్టింపు చేస్తూ 220 ఫిలిం విడుదల చేయబడింది. అయితే 120 ఫిలిం వలె దీనికి బ్యాకింగ్ కాగితం ఉండదు. బ్యాకింగ్ కాగితం లేకపోవటం వలన, తగ్గిన మందం వలన ఎక్కువ ఫిలిం చుట్టేందుకు వీలవుతుంది. పాత 120 ఫిలిం కెమెరాలలో దీనిని వాడలేము (వెనుక అంకెలు ఉండవు కాబట్టి).

పరిమాణం

[మార్చు]

మీడియం ఫార్మాట్ ఫిలిం పై ఈ క్రింది పరిమాణాలతో ఫోటోలు తీయవచ్చును [4]

  • 6 X 4.5 – దీనినే 645 అని కూడా అంటారు. అత్యధిక షాట్లను తీయటానికి వీలయ్యే పరిమాణం. వాడకం సులభం.
  • 6 X 6 – హాసల్ బ్ల్యాడ్ చే జనబాహుళ్యంలోకి వచ్చిన పరిమాణం. రూపచిత్రాలను (portraits) తీయటానికి అనువుగా ఉంటుంది
  • 6 X 7 – ముద్రణకు అత్యంత అనువైన పరిమాణం
  • 6 X 9 – 35mm ఫిలిం యొక్క నిష్పత్తి
  • 6 X 12 - ప్రకృతి దృశ్యాలను పనోరమాలో తీయటానికి అనువైన ఫిలిం
  • 6 X 17 – ప్రకృతి దృశ్యాలను పనోరమాలో తీయటానికి అనువైన ఫిలిం

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. మీడియం ఫార్మాట్ ను నిర్వచించిన హాసల్బ్ల్యాడ్
  2. 117 ఫిలిం ను వాడిన మొట్టమొదటి మీడియం ఫార్మాట్ కెమెరా: కొడాక్ బ్రౌనీ
  3. "135 ఫిల్మ్ వచ్చే వరకు సాధారణ జనం మీడియం ఫార్మాట్ నే వాడేవారు". Archived from the original on 2018-08-12. Retrieved 2018-10-07.
  4. మీడియం ఫార్మాట్ ఫిలిం పై వివిధ పరిమాణాలను తెలిపిన అడోరమా [permanent dead link]