ఫోటాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లేజర్ కాంతి పుంజాన నుండి ఫోటాన్లు వెలువడుట

ఫోటాన్ అనేది ఒక ప్రాథమిక కణం. కాంతితో సహా అన్ని రకాల విద్యుదయస్కాంత తరంగాలకు ఒక ప్రమాణం. ఇది విద్యుదయస్కాంత శక్తిని మోసుకెళ్ళే ఒక శక్తి వాహకం కూడా. అన్ని ప్రాథమిక కణాలలానే ఫోటాన్లను కూడా క్వాంటం యాంత్రిక శాస్త్రం సహాయంతో వివరించ వచ్చు. ఈ ఫోటాన్లు కణం, తరంగాల లక్షణాలు కలిగి ఉంటాయి.

ఫోటాన్ అనే అధునాతన భావనను ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఇరవయ్యో శతాబ్దం మొదట్లో ప్రతిపాదించాడు. కాంతి మీద ఆయన చేసిన ప్రయోగాల ఫలితాలను వివరించడం కోసం కాంతిని తరంగాలుగా కాకుండా ఫోటాన్లుగా భావించాడు.

భౌతిక శాస్త్రంలో ఫోటాన్ ను గ్రీకు అక్షరం గామా (γ) తో సూచిస్తారు. బహుశ ఈ చిహ్నం 1900 లో కనుగొనబడిన గామా కిరణాల పేరుమీదుగా ఉత్పన్నం అయి ఉండవచ్చు.[1][2] రసాయన శాస్త్రం, ఆప్టికల్ ఇంజనీరింగ్ లో ఫోటాన్ ను , (ఫోటాన్ శక్తి) తో సూచిస్తారు. ఇక్కడ h అనేది ప్లాంక్స్ కాన్స్టంట్, గ్రీకు అక్షరం న్యూ (ν) ఆ ఫోటాను యొక్క ఫ్రీక్వెన్సీ.

పుట్టుక[మార్చు]

1900 లో మాక్స్ ప్లాంక్ కృష్ణ వస్తువుల వికిరణాన్ని గురించి అధ్యయనం చేస్తున్నపుడు వాటినుండి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు ఒక నిర్ణీత పరిమాణం కలిగిన శక్తిలాగా విడుదల అవుతుంటాయని భావించాడు. అంతకు మునుపు ఈ శక్తిని క్వాంటమ్ (అంటే ఒక యూనిట్ అని అర్థం వస్తుంది) అనే పేరుతో కొలిచేవారు. 1905 ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వాటిని లైట్ క్వాంటమ్ అన్నాడు. 1928లో ఆర్థర్ కామ్టన్ అనే శాస్త్రవేత్త దానికి ఫోటాన్ అనే పేరు వాడాడు.

భౌతిక ధర్మాలు[మార్చు]

ఫోటానుకు ఎటువంటి ద్రవ్యరాశి, విద్యుదావేశం ఉండవు. అది ఒక స్థిరమైన కణం.

మూలాలు[మార్చు]

  1. Villard, P. (1900). "Sur la réflexion et la réfraction des rayons cathodiques et des rayons déviables du radium". Comptes Rendus des Séances de l'Académie des Sciences (in ఫ్రెంచ్). 130: 1010–1012.
  2. Villard, P. (1900). "Sur le rayonnement du radium". Comptes Rendus des Séances de l'Académie des Sciences (in ఫ్రెంచ్). 130: 1178–1179.
"https://te.wikipedia.org/w/index.php?title=ఫోటాన్&oldid=3273999" నుండి వెలికితీశారు