రాబర్ట్ హుక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాబర్ట్ హుక్
సుమారు 1680 Portrait of a Mathematician by Mary Beale, conjectured to be of Hooke[1] but also conjectured to be of Isaac Barrow.[2]
జననం(1635-07-18)1635 జూలై 18
ఫ్రెష్‌వాటర్, ఐల్ ఆఫ్ వైట్, ఇంగ్లండ్
మరణం1703 మార్చి 3(1703-03-03) (వయసు 67)
లండన్, ఇంగ్లండ్
జాతీయతఆంగ్లేయుడు
రంగములుభౌతిక శాస్త్రం, జీవశాస్త్రం
వృత్తిసంస్థలుఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం
చదువుకున్న సంస్థలువాధాం కాలేజ్, ఆక్స్‌ఫర్డ్
విద్యా సలహాదారులురాబర్ట్ బాయిల్
ప్రసిద్ధిహూక్స్ లా
మైక్రోస్కోపీ (సూక్ష్మదర్శనం)
కణ జీవశాస్త్రానికి ఆద్యుడు
ప్రభావితం చేసినవారురిచర్డ్ బస్బీ
సంతకం

రాబర్ట్ హుక్ (1635 జులై 18 - 1703 మార్చి 3)[3] ఒక ఆంగ్లేయ శాస్త్రజ్ఞుడు, ఆర్కిటెక్ట్, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈయన సూక్ష్మదర్శినిని (Microscope) ఉపయోగించి సూక్ష్మక్రిములను (micro-organism) మొదటిసారిగా దర్శించగలిగాడు.[4] ఈయన యవ్వనంలో పేదవాడిగా ఉన్నా 1666 లో లండన్ లో సంభవించిన పెద్ద అగ్ని ప్రమాదం తర్వాత చేపట్టిన ఆర్కిటెక్చరల్ సర్వేలో సుమారు సగభాగానికి పైగా పాల్గొని ధనవంతుడయ్యాడు. రాయల్ సొసైటీలో కూడా సభ్యుడయ్యాడు. 1662 నుంచి అక్కడ జరిగే పరిశోధనలను పర్యవేక్షించేవాడు. గ్రేషాం కాలేజీలో క్షేత్ర గణిత విభాగంలో ఆచార్యుడిగా పనిచేశాడు.

భౌతిక శాస్త్రవేత్త అయిన రాబర్ట్ బాయిల్ కి సహాయకుడిగా ఉంటూ ఆయన వాయువు ధర్మాలను కనిపెట్టడానికి చేసిన పరిశోధనల కోసం వాక్యూం పంప్ తయారు చేశాడు. ఆయన కూడా స్వయంగా ప్రయోగాలు చేశాడు. 1673 లో తొలిసారిగా గ్రెగొరియన్ టెలిస్కోపు తయారు చేసి అంగారక గ్రహం, గురు గ్రహం పరిభ్రమణాల్ని గమనించాడు. 1665 లో ఈయన రాసిన మైక్రోగ్రాఫియా అనే పుస్తకం సూక్ష్మపరిశీలనకు నాంది పలికింది.[4]

మూలాలు

[మార్చు]
  1. Griffing, Lawrence R. (2020). "The lost portrait of Robert Hooke?". Journal of Microscopy. 278 (3): 114–122. doi:10.1111/jmi.12828. PMID 31497878. S2CID 202003003.
  2. Whittaker, Christopher A. (2021). "Unconvincing evidence that Beale's Mathematician is Robert Hooke". Journal of Microscopy. 282 (2): 189–190. doi:10.1111/jmi.12987. ISSN 0022-2720. PMID 33231292. S2CID 227159587.
  3. Singer, B. R. (July 1976). "Robert Hooke on Memory, Association and Time Perception (1)". Notes and Records of the Royal Society of London. 31 (1): 115–131. doi:10.1098/rsnr.1976.0003. JSTOR 531553. PMID 11609928. S2CID 21409461. Hooke died on 3 March 1702/3
  4. 4.0 4.1 Howard Gest, "The discovery of microorganisms by Robert Hooke and Antoni van Leeuwenhoek, Fellows of The Royal Society", Notes Rec R Soc Lond, 2004 May;58(2):187–201. Howard Gest, "Homage to Robert Hooke (1635–1703): New insights from the recently discovered Hooke folio", Perspect Biol Med, Summer 2009;52(3):392–399.