అడాక్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అడాక్స్
తరహా
స్థాపన
ప్రధానకేంద్రముబెర్లిన్, జర్మనీ
పరిశ్రమఫోటోగ్రఫిక్ రసాయనాలు, తయారీ
ఉత్పత్తులుఫిలిం
వెబ్ సైటుhttp://www.adox.de

అడాక్స్ (ఆంగ్లం:ADOX) జర్మనీ లోని బెర్లిన్ కు చెందిన ఒక ఫిలిం తయారీదారు. ఫిలిం తో బాటు, ఫోటోగ్రఫిక్ కాగితం, ఫిలిం ఫోటోగ్రఫీకి కావలసిన రసాయనాలను కూడా అడాక్స్ తయారు చేస్తుంది.

అడాక్స్ 66 కెమెరా (1950)

చరిత్ర[మార్చు]

స్థాపన[మార్చు]

1860 లో ఫోటోకెమికల్ రసాయనాలు ఉత్పత్తి చేయటానికి స్థాపించబడిన ADOX Dr.C. Schleussner GmbH తమ అతి పలుచని ఫిలిం లు KB 14, KB 17 లతో సర్వత్రా వ్యాపిస్తూ వేనోళ్ళ పొగడబడింది.[1] అమెరికా వారు సైతం వీటిని "the German wonderfilm" అని సంభోధించుకొనేవారు.

కెమెరాలు[మార్చు]

20వ దశకం నుండి 60వ దశకం వరకు అడాక్స్ పలు కెమెరాలను తయారు చేసింది.

ఉత్పత్తులు[మార్చు]

1956 లో అడాక్స్ మొట్టమొదటి కలర్ నెగిటివ్ ఫిలిం ను ప్రవేశపెట్టింది. రెండేళ్ళ తర్వాత వివిధ రకాల స్లైడ్ ఫిలిం లను తయారు చేసింది.

డుపాంట్ కు విక్రయం[మార్చు]

1962 లో Schleussner తమ ఫిలిం తయారీని అమెరికాకు చెందిన డుపాంట్ కు విక్రయించారు. అడాక్స్ బ్రాండు ఫిలిం ను డుపాంట్ అమెరికాలో రిజిష్టరు చేసింది.

తయారీ విభాగం ఫోటోకెమికా వశం[మార్చు]

డుపాంట్, తమ అడాక్స్ ట్రేడ్ మార్కును మినహా తమ ఫిలిం తయారీ సర్వస్వాన్ని క్రొయేషియా (అప్పటి యుగోస్లావియా) లోని సామోబోర్ కు చెందిన ఫోటోకెమికా (ఎఫ్కే) కు విక్రయించింది. అడాక్స్ ఫార్ములాను కొనసాగిస్తూ ఎఫ్కే సంస్థ తయరు చేసే ఫిలిం ఫోటోలను చిత్రీకరించే పలు సాంకేతిక అంశాలలో నిపుణుల మన్ననలను పొందింది. అయితే జూన్ 2012 లో ఎఫ్కే తమ ఫిలిం తయారీని శాశ్వతంగా ఆపివేసింది.

ట్రేడ్ మార్కు ఆగ్ఫా వశం[మార్చు]

డుపాంట్ తమ ట్రేడ్ మార్కును స్టెర్లింగ్ డయాగ్నాస్టిక్ ఇమేజింగ్ కు ఎక్స్-రే ఫిలిం ను తయారు చేసేందుకు విక్రయించింది. 1999 లో స్టెర్లింగ్ డయాగ్నాస్టిక్ ఇమేజింగ్ ను ఆగ్ఫా సొంతపరచుకొంది. అయితే ఆగ్ఫా అడాక్స్ ట్రేడ్ మార్కును వాడలేదు.

ఫోటోఇంపెక్స్[మార్చు]

2003 లో జర్మనీ కి చెందిన ఫోటో ఇంపెక్స్ సంస్థ అడాక్స్ ట్రేడ్ మార్క్ ను సొంతం చేసుకొంది. 1992 లో బెర్లిన్ లో నెలకొల్పబడ్డ ఈ సంస్థ ముఖ్యంగా ఫిలిం ను దిగుమతి చేసుకొనేది. ఎఫ్కే ఫిలిం ను దిగుమతి చేసుకొని దానిని ADOX CHS Art అనే పేరుతో విక్రయించేది.

ఫిలిం అమ్మకాలు/తయారీని పున:ప్రారంభించిన అడాక్స్[మార్చు]

పలు చేతులు మారిన ఆగ్ఫాఫోటోను అడాక్స్ కొన్నది. ఆగ్ఫా ఫిలింలో ఉన్న పలు లోపాలను సరిదిద్దింది. ADOX PAN 400 పేరు పెట్టి 2010 సెప్టెంబరులో ఈ ఫిలిం ను విడుదల చేసి ఫిలిం అమ్మకాలు పున:ప్రారంభించింది. [2] ఆగష్టు 2016 లో స్విట్జర్ ల్యాండ్ లో ఫిలిం తయారీ యంత్రాలను సొంతపరచుకొంది.[3] ఫిబ్రవరి 2017లో జర్మనీ లోని బాద్ సారొ అనే ప్రాంతంలో ఫిలిం/సంబంధిత రసాయనాలు ఉత్పత్తి చేయటానికి సరక్రొత్త ఫ్యాక్టరీ నిర్మించటం మొదలు పెట్టింది. అడాక్స్, ఆగ్ఫా ఫిలిం లను ఫోటో ఇంపెక్స్ తయారు చేయటం మొదలు పెట్టింది.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. అడాక్స్ స్థాపన
  2. ఫిలిం అమ్మకాలు పున:ప్రారంభించిన అడాక్స్
  3. ఫిలిం తయారీ యంత్రాలను సొంతం చేసుకొన్న అడాక్స్
"https://te.wikipedia.org/w/index.php?title=అడాక్స్&oldid=3848530" నుండి వెలికితీశారు