సిల్బెర్రా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిల్బెర్రా
తరహా
స్థాపన2017
ప్రధానకేంద్రముసెయింట్ పీటర్స్‌బర్గ్, రష్యా
పరిశ్రమరసాయనాలు, తయారీ
ఉత్పత్తులుఫిలిం, ఫోటోగ్రఫిక్ కాగితం, ఫిలిం ఫోటోగ్రఫీకి కావలసిన రసాయనాలు
వెబ్ సైటుhttps://silberra.com/
సిల్బెర్రా ఫిలిం చుట్టలు

సిల్బెర్రా (ఆంగ్లం: Silberra) రష్యా లోని సెయింట్ పీటర్స్‌బర్గ్ కేంద్రంగా పని చేస్తున్న ఒక ఫిలిం తయారీదారు. [1]

చరిత్ర[మార్చు]

2009 వ సంవత్సరం నుండి ఫిలిం ఫోటోగ్రఫీకి కావలసిన రసాయనాలను విక్రయిస్తున్ననూ, సిల్బెర్రా అనే బ్రాండు 2017 లో స్థాపించబడింది [2]. జర్గ్మన్ లో Silber అనగా వెండి [3] వ్లాడిమిర్ విష్నెవ్స్కీ అనే ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రఫర్ కాన్స్టాంటిన్ షబనోవ్ అనే ఒక ప్రొఫెషనల్ మేనేజర్ దీనిని స్థాపించారు. చిన్నతనం నుండి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం ఉండటం వలన వారి అభిరుచినే (Hobby) వ్యాపారం (Business)గా మలచుకొని Hobbusiness అనే పదం సృష్టించారు.

సిల్బెర్రా ఉద్యోగులు మొత్తం ఫోటోగ్రఫర్లే. వీరిలో కొందరు నిపుణులు కాగా, కొందరు కేవలం ఔత్సాహికులు. అయితే అందరినీ కలిపి ఉంచే ఏకైక అంశం, ఫిలిం ఫోటోగ్రఫీ. అందుకే సిల్బెర్రా తమను తాము అనుభవంగల, అదే సమయంలో యువరక్తం గల సంస్థగా అభివర్ణించుకొంటుంది. సిల్బెర్రా జట్టులో వేర్వేరు ఫోటోగ్రఫర్ లకు వేర్వేరు అనుభవాల స్థాయిలు, వేర్వేరు అభిరుచులు కలవు.

ఫిబ్రవరి 2017 నుండి రష్యాలో 80 ఏళ్ళుగా ఫిలింను తయారు చేస్తోన్న మైక్రాన్ అనే ల్యాబ్ నుండి సిల్బెర్రా వివిధ రకాల ఫిలింలను తయారు చేసి పరీక్షలకు విడుదల చేస్తోంది. ఈ పరీక్షలలో వచ్చిన ఫలితాలపై అభిప్రాయ సేకరణ చేసి, దాని ప్రకారం ఫిలిం తయారీలో మెరుగులు దిద్దుకొంటోంది.

అక్టోబరు 2017 లో బ్లాక్ అండ్ వైట్ ఫిలిం ను రూపొందించటానికి సిల్బెర్రా ఫిలిం ప్రేమికుల నుండి విరాళాలు కోరింది [4]. $1,15,000 ల లక్షానికి గాను, డిసెంబరు 2017 వరకు $35,257 పోగు అయ్యాయి. [5]

ఉత్పత్తులు[మార్చు]

సిల్బెర్రా ఈ క్రింది ఉత్పత్తులను తయారు చేస్తుంది.

  • డెవలపర్లు
  • ఫిక్సర్లు
  • టోనర్లు
  • ఫిలిం
  • ఫోటోగ్రఫిక్ కాగితం

ఇతర వ్యాపారాలు[మార్చు]

ఫోటోఆప్టెకా అనే ఆన్లైను స్టోరును ను నడిపేది సిల్బెర్రా యే. ఫోమా, ఇల్ఫోర్డ్ ఫిలిం లకు ఇదే అధికృత డీలరు. రెండేళ్ళ, ఐదేళ్ళ ఫోటోగ్రఫీ కోర్సులను నేర్పే ఏకైక విద్యాసంస్థ సెయింట్ పీటర్స్బర్గ్ ఆర్ట్ స్కూల్ ను నెలకొల్పింది కూడా సిల్బెర్రాయే.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. సిల్బెర్రా వెబ్ సైటు - Contact Us లంకె
  2. సిల్బెర్రా చరిత్ర
  3. సిల్బెర్రా అర్థం
  4. ఫిలిం కోసం విరాళాలు కోరిన సిల్బెర్రా
  5. పోగు అయిన విరాళాలు