బ్రెజిల్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
República Federativa do Brasil  (Portuguese)
ఫెడరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ బ్రెజిల్
Flag of బ్రిజిల్ బ్రిజిల్ యొక్క Coat of arms
నినాదం
  • "Ordem e Progresso" (Portuguese)
  • "Order and Progress"
జాతీయగీతం

జాతీయ చిహ్నము
బ్రిజిల్ యొక్క స్థానం
రాజధాని బ్రెజిలియా
15°47′S, 47°52′W
Largest city సావోపాలో
అధికార భాషలు పోర్చుగీసు[1]
జాతులు (2010[2])
ప్రజానామము బ్రెజిలియన్
ప్రభుత్వం Federal presidential constitutional republic
 -  అధ్యక్షుడు constitutional republic (PT)
 -  ఉపాధ్యక్షుడు మిచెల్ టెమెర్ (PMDB)
 -  డిప్యూటీస్ చాంబర్ అధ్యక్షుడు Henrique Eduardo Alves (PMDB)
 -  సెనేట్ అధ్యక్షుడు Renan Calheiros (PMDB)
 -  సుప్రీం ఫెడరల్ కోర్ట్ యొక్క అధ్యక్షుడు Joaquim Barbosa
స్వాతంత్ర్యం యునైటెడ్ కింగ్డం ఆఫ్ పోర్చుగల్, బ్రెజిల్ మరియు అల్గ్రేవ్స్ నుండి 
 -  డిక్లేర్డ్ 7 సెప్టెంబరు 1822 
 -  గుర్తింపు 29 ఆగస్టు1825 
 -  Republic 15 నవంబరు1889 
 -  Current constitution 5 అక్టోబరు1988 
 -  జలాలు (%) 0.65
జనాభా
 -  2012[4] అంచనా 193,946,886 
 -  2010 జన గణన 190,732,694[3] <--then:-->(5th)
జీడీపీ (PPP) 2012 అంచనా
 -  మొత్తం $2.356 trillion[5] (7th)
 -  తలసరి $11,875[5] (77th)
జీడీపీ (nominal) 2012 అంచనా
 -  మొత్తం $2.396 trillion[5] (7th)
 -  తలసరి $12,079[5] (58th)
Gini? (2012) 51.9 
మా.సూ (హెచ్.డి.ఐ) (2012) 0.730 (85th)
కరెన్సీ Real (R$) (BRL)
కాలాంశం BRT (UTC−2 to −4)
 -  వేసవి (DST) BRST (UTC−2 to −4)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .br
కాలింగ్ కోడ్ ++55

బ్రెజిల్ (అధికార నామము: ఫెడరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ బ్రెజిల్) దక్షిణ అమెరికాలోని ఒక దేశము. వైశాల్యం రీత్యా ప్రపంచములోనే ఐదవ అతిపెద్ద దేశమైన బ్రెజిల్, దక్షిణ అమెరికా భూభాగములో దాదాపు సగం విస్తీర్ణాన్ని కైలిగి ఉంటుంది. జనాభా లెక్కల రీత్యా కూడా ప్రపంచములోనే ఐదవ అతిపెద్ద దేశమైన బ్రెజిల్, నాల్గవ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉంది. తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం ఉన్న బ్రెజిల్ సముద్ర తీరం పొడవు 7,491 కిలోమీటర్ల పైబడి ఉంది.

1500 సంవత్సరము నుండి 1822లో స్వాతంత్ర్యము పొందేవరకు బ్రెజిల్ పోర్చుగల్ పరిపాలనలో ఉంది. బ్రెజిల్ ఐక్య రాజ్య సమితి స్థాపక దేశాలలో ఒకటి.

చరిత్ర[మార్చు]

బ్రెజిల్... దక్షిణ అమెరికా ఖండంలోని ఈ దేశం విస్తీర్ణపరంగా ప్రపంచంలో ఐదో అతి పెద్ద దేశం. భారతదేశం కన్నా దాదాపు మూడు రెట్లు పెద్దది. అయినా జనాభా 20 కోట్ల పై చిలుకు మాత్రమే. దేశంలో అధికార భాష పోర్చుగీసు. జనాభాలో 99 శాతం మంది ఆ భాష మాట్లాడతారు. పదిహేనో శతాబ్దంలో ఐరోపా వలసలు మొదలవటానికి ముందు.. ఇప్పటి బ్రెజిల్‌లో దాదాపు 2,000 వరకూ స్థానిక ఆదివాసీ జాతులు నివసించేవి. వారంతా పాక్షిక సంచార జాతులుగా ఉంటూ వేట, చేపలు పట్టడం, ఆహార సేకరణ, సంచార వ్యవసాయం ఆధారంగా జీవించేవారు.

ఐరోపా నుంచి.. ప్రత్యేకించి పోర్చుగీస్ నుంచి వలసల వెల్లువ రాకముందు ఈ ఆదివాసీ జనాభా సుమారు 24 లక్షల మందిగా ఉన్నట్లు అంచనా. కానీ ఇప్పుడా సంఖ్య కేవలం ఎనిమిది లక్షల చిల్లరకు కుదించుకుపోయింది. జాతుల సంఖ్య కూడా సుమారు 200కు తగ్గిపోయింది. ఐరోపా నుంచి వచ్చిన వ్యాధులు బారిన పడి లక్షలాది మంది చనిపోగా.. చాలా మంది ‘బ్రెజిల్ జనాభా’లో కలిసిపోయారు.

తొలుత పోర్చుగీస్ వలసదారులు, ఆఫ్రికా నుంచి బానిసలుగా తెచ్చిన నల్లవారు అధికంగా ఉండగా.. అనంతర కాలంలో ఐరోపా, అరబ్, జపాన్ దేశాల నుంచీ వలసలు వచ్చి స్థిరపడ్డారు. వీరందరి సమ్మేళనంతో బ్రెజిల్ విలక్షణ సాంస్కృతికతను, జాతీయతను సంతరించుకుంది. 1533 నుంచి పోర్చుగీసు సామ్రాజ్య వలస పాలనలో ఉన్న బ్రెజిల్ అనేక రాజకీయాల పరిణామాల అనంతరం 1889లో గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. అనేక పరిణామాల అనంతరం గణతంత్రం నిలదొక్కుకుంది.[6]

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Demographics". Brazilian Government. 2011. Retrieved 2011-10-08. 
  2. "Caracteristicas da População e dos Domicílios do Censo Demográfico 2010 — Cor ou raça" (PDF). Retrieved 2012-04-07. 
  3. IBGE. Censo 2010: população do Brasil é de 190.732.694 pessoas.
  4. IBGE. 2011 Population Projection
  5. 5.0 5.1 5.2 5.3 "Brazil". International Monetary Fund. Retrieved 2013-04-17. 
  6. "" రియో.. వెలుగుల్లో చీకట్లు "". www.sakshi.com. సాక్షి (దినపత్రిక). 7 ఆగస్టు 2016. Retrieved 7 ఆగస్టు 2016.  Check date values in: |access-date=, |date= (help)

వనరులు[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=బ్రెజిల్&oldid=2092410" నుండి వెలికితీశారు