జాతి
(జాతులు నుండి దారిమార్పు చెందింది)

జాతి (ఆంగ్లం Species) అనేది జీవుల శాస్త్రీయ వర్గీకరణ పద్ధతిలో ఒక వర్గం. జీవ శాస్త్రంలో ఒక ప్రాథమిక ప్రమాణం. ఒక జాతిలోని జనాభాలో అధిక సారూప్యం కనిపిస్తుంది. ఒక జనాభాకు చెందిన జీవులు అవయవ నిర్మాణంలో అత్యంత సారూప్యం ఉండి, వాటిలో అవి సంపర్కావకాశం కలిగి, ఫలవంతమయిన సంతానాన్ని పొందగలిగినప్పుడు, ఆ జనాభాను ఒక జాతిగా పేర్కొంటాము. వేరు వేరు జాతుల జనాభాలలో భిన్నత్వం ఉండి సంపర్కావకాశాలు ఉండవు.
జాతి పేరు[మార్చు]
- ఒక జాతి పేరు ఆ మొక్కలోని ఒక ముఖ్య లక్షణానికి సంబంధించిన విశేషక రూపమై (Adjective) ఉంటుంది. దీనిని ఎల్లప్పుడు చిన్న అక్షరము (Small letter) తో ప్రారంభిస్తారు. ఉదాహరణ :
- పాలియాల్తియా లాంగిఫోలియా (పొడవైన పత్రాలు)
- ఐపోమియా బిలోబా (రెండు తమ్మెలుగా చీలిన పత్రాలు)
- స్ట్రీగా ల్యూటియా (తెలుపు వర్ణము)
కొన్ని జాతుల పేర్లు వాటి నుండి లభించే పదార్థాలను తెలియజేస్తాయి. ఉదాహరణ :
కొన్ని జాతుల పేర్లు ఆ మొక్కల జన్మస్థానాన్ని తెలియజేస్తాయి. ఉదాహరణ :
కొన్ని జాతుల పేర్లు శాస్త్రవేత్తల గౌరవసూచకంగా ఇవ్వబడ్డాయి. ఉదాహరణ :
- డిల్లినై - డిల్లాన్
- విల్డినోవై - విల్డినోవో
- ముల్లరియానా - ముల్లర్
జీవులలో జాతుల సంఖ్య[మార్చు]

- 287,655 మొక్కలు, వీటిలో:
- 15,000 నాచు మొక్కలు,
- 13,025 అడవి మొక్కలు,
- 980 నగ్న బీజాలు,
- 199,350 ద్విదళ బీజాలు,
- 59,300 ఏకదళ బీజాలు;
- 74,000-120,000 పుట్ట గొడుగులు[1];
- 10,000 లైకెన్లు;
- 1,250,000 జంతువులు, వీటిలో:
- 1,190,200 అకశేరుకాలు (వెన్నెముకలేని జీవులు) :
- 950,000 కీటకాలు,
- 70,000 మొలస్కా,
- 40,000 గుల్ల పెంకుగలజాతులు,
- 130,200 ఇతరములు;
- 58,808 సకశేరుకాలు (వెన్నెముకగల జీవులు) :
- 1,190,200 అకశేరుకాలు (వెన్నెముకలేని జీవులు) :
మూలాలు[మార్చు]
- జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.