శాస్త్రీయ వర్గీకరణ
స్వరూపం
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
శాస్త్రీయ వర్గీకరణ జంతువులకు, మొక్కలకు చాలా ముఖ్యమైనది.
వృక్ష వర్గీకరణ
[మార్చు]వర్గీకరణ ఆవశ్యకత
[మార్చు]- ప్రపంచంలోని మొక్కల జాతులన్నింటి గురించి తెలుసుకోవడం.
- మొక్కల మధ్యగల సహజ బాంధవ్యాలను వ్యక్తీకరించే వర్గీకరణ వ్యవస్థలను రూపొందించడం.
- మొక్కలలోని వైవిధ్యాన్ని బయలు పరచి, పరిణామ శాస్త్రరీత్యా దాన్ని అర్ధవంతంగా అవగాహన చేసుకోవడం.
- వివిధ ప్రాంతాలలోని వృక్ష సంపదకు సంబంధించిన వివరాలను సేకరించడం.
- వృక్షశాస్త్ర విద్యార్థులకు ఈ దిశగా సరియైన అవగాహన కల్పించడం, శిక్షణ ఇవ్వడం.
వర్గీకరణలోని ప్రమాణాలు
[మార్చు]- రాజ్యము (Kingdom)
- విభాగము (Division)
- ఉపవిభాగము (Subdivision)
- తరగతి (Class)
- ఉపతరగతి (Subclass)
- శ్రేణి (Series)
- క్రమము (Order)
- కుటుంబము (Family)
- ఉపకుటుంబము (Subfamily)
- తెగ (Tribe)
- ప్రజాతి (Genus)
- జాతి (Species)
వర్గీకరణలో రకాలు
[మార్చు]- కృతక వర్గీకరణ: మొక్కలను సులువుగా పోల్చుకోదగిన స్థూలమైన లక్షణాల ఆధారంగా మొక్కలను వర్గీకరించడాన్ని కృతక వర్గీకరణ అంటారు. ఉదా1: మొక్కలను గుల్మాలు, పొదలు, వృక్షాలుగా వర్గీకరించుట. ఉదా2: లిన్నేయస్ ప్రతిపాదించిన లైంగిక వర్గీకరణ విధానం.
- సహజ వర్గీకరణ: మొక్కల మధ్యనున్న సహజ సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి మొక్కలను వర్గీకరించడాన్ని సహజ వర్గీకరణ అంటారు. ఉదా: బెంథామ్-హుకర్ వర్గీకరణ.
- వర్గవికాస వర్గీకరణ: మొక్కల పుట్టుక, వాటి పరిణామ రీతులను ఆధారంగా తీసుకొని మొక్కలను వర్గీకరించడాన్ని వర్గవికాస వర్గీకరణ అంటారు. ఉదా: ఎంగ్లర్-ప్రాంటల్ విధానము.
జంతువుల వర్గీకరణ
[మార్చు]ఏనిమేలియా రాజ్యాన్ని కణజాలాల అభివృద్ధిని బట్టి రెండు ఉపరాజ్యాలుగా వర్గీకరించారు.
- ఉపరాజ్యం అ: పేరాజోవా: ఇవి స్పష్టమైన కణజాలాలు లేని బహుకణ జీవులు. ప్రొటొజోవా ఇవి ఎకకణజీవులు. ఉదా:అమీబా. పోరిఫెరా అనే ఒక వర్గం చేరి ఉంది. ఉదా:స్పంజికలు.
- ఉపరాజ్యం ఆ: మెటాజోవా: ఇవి స్పష్టమైన కణజాలాలతో కూడిన బహుకణ జీవులు. దీన్ని రెండు శ్రేణులుగా (Grades) విభజించారు.
- శ్రేణి 1: రేడియేటా లేదా డిప్లోబ్లాస్టికా: ఇవి వలయ సౌష్టవం కలిగిన ద్విస్తరిత (Diploblastic) జీవులు. సిలెంటిరెటా అనే వర్గాన్ని ఈ శ్రేణిలో చేర్చారు.ఉదా: హైడ్రా.
- శ్రేణి 2: బైలటీరియా లేదా ట్రిప్లోబ్లాస్టికా: ఇవి ద్విపార్శ్వ సౌష్టవం కలిగిన త్రిస్తరిత (Triploblastic) జీవులు. ఈ శ్రేణిని రెండు డివిజన్లుగా విభజించారు.
- డివిజన్ ఎ: ప్రోటోస్టోమియా: (ప్రోటో = ముందు; స్టోమం = నోరు) ఇవి ఆది ఆంత్రరంధ్రం ( ) నోరుగా మారిన బహుకణ జీవులు. వీటిలో సర్పిలాకార, నిర్ధారిత విదళనాలు జరుగుతాయి. వీటిని మూడు సబ్ డివిజన్లుగా వర్గీకరించారు.
- సబ్ డివిజన్ 1: ఏసీలోమేటా: ఇవి దేహకుహర రహిత బహుకణ జీవులు. దేహకుడ్యానికి, అంతరంగాలకు మధ్యప్రదేశం మీసెంఖైం లేదా మృదుకణజాలంతో నిండి ఉంటుంది. ఉ. వర్గం.ప్లాటీహెల్మింథిస్.ఉదా:టినియా సొలియం[బద్దెపురుగు].
- సబ్ డివిజన్ 2: మిధ్యాసీలోమేటా: దేహకుడ్యానికి, ఆహారనాళానికి మధ్య కుహరం ఉంటుంది. కానీ ఇది మధ్యస్త్వచం ఉపకళలతో ఆవరించబడి ఉండదు. కాబట్టి ఇది నిజమైన సీలోం కాదు. ఉ. వర్గం. నిమాటిహెల్మింధిస్.
- సబ్ డివిజన్ 3: షైజోసీలోమేటా: దేహకుహరం షైజోసీలిక్ రకానికి చెందిన నిజమైన సీలోం. ఇది మధ్యస్త్వచం చీలడం వల్ల ఏర్పడుతుంది. ఉ. వర్గం. అనెలిడా ఉదా: వానపాము, ఆర్థ్రోపోడా ఉదా:భొద్దింక, కీటకాలు, మొలస్కా ఉదా:నత్త [పైలా].
- డివిజన్ బి: డ్యూటిరోస్టోమియా: (డ్యూటిరో = ద్వితీయ; స్టోమం = నోరు) ఇవి ఆది ఆంత్ర రంధ్రం పాయువుగా లేదా దేహ ఆది ఆంత్ర రంధ్రానికి సమీపంలో పాయువు ఏర్పడిన యూసీలోమేట్లు. తరువాత నోరు ఆది ఆంత్ర రంధ్రానికి దూరంగా వ్యతిరేక దిశలో ఏర్పడుతుంది. వీటిలో వలయ విదళనాలు, అనిర్ధారిత విదళనాలు జరుగుతాయి. దీనిలో ఎంటిరో సీలోమేటా అనే సబ్ డివిజన్ ను చేర్చారు.
- సబ్ డివిజన్: ఎంటిరోసీలోమేటా: వీటిలో దేహ కుహరం నిజమైన సీలోం. ఇది ఆంత్రకుహరికా సీలోం. ఇది ఆది ఆంత్రం నుంచి ఏర్పడుతుంది. ఉ. వర్గాలు.ఎఖైనోడర్మేటా ఉదా: సముధ్ర నక్షత్రము [స్టార్ ఫిష్], హెమికార్డేటా, కార్డేటా
- డివిజన్ ఎ: ప్రోటోస్టోమియా: (ప్రోటో = ముందు; స్టోమం = నోరు) ఇవి ఆది ఆంత్రరంధ్రం ( ) నోరుగా మారిన బహుకణ జీవులు. వీటిలో సర్పిలాకార, నిర్ధారిత విదళనాలు జరుగుతాయి. వీటిని మూడు సబ్ డివిజన్లుగా వర్గీకరించారు.