Jump to content

ఎంగ్లర్-ప్రాంటల్ విధానము

వికీపీడియా నుండి
కారల్ ప్రాంటల్
అడాల్ఫ్ ఎంగ్లర్

ఎంగ్లర్-ప్రాంటల్ విధానము (Engler-Prantl system) వృక్ష శాస్త్రజ్ఞులను విశేషంగా ఆకర్షించిన మొట్టమొదటి వర్గ వికాస వర్గీకరణ విధానము.

జర్మనీ దేశస్థులైన అడాల్ఫ్ ఎంగ్లర్ (Adolf Engler) (1844-1930), కారల్ ప్రాంటల్ (Karl Prantl) (1849-1893) లు కలిసి వృక్ష సామ్రాజ్యంలోని అన్ని రకాల మొక్కలకు ఒక వర్గవికాస విధానాన్ని ప్రచురించారు. వీరి విధానం 20 సంపుటాలుగా "డి నేచుర్లిచెన్ ప్లాంజెన్ ఫామిలియాన్" (Die Naturtichen Pflanzenfamilien) 1887-1891 మధ్యకాలంలో వివరించారు. వీరి వర్గీకరణకు ఐక్లర్ వర్గీకరణ ఆధారము. విత్తనాలు గల మొక్కలను వివృతబీజాలు, ఆవృతబీజాలుగా గుర్తించారు. ఆవృతబీజాఅలలో ద్విదళబీజాలను ఏకదళబీజాల తరువాత ఉంచారు. ద్విదళబీజాలను ఆర్కిక్లామిడే, మెటాక్లామిడే అనే రెండు తరగతులుగా విభజించారు. వీరి వర్గీకరణలో సరళ నిర్మాణం నుండి సంక్లిష్ట నిర్మాణం చూపే కుటుంబాలను ఒక ఆరోహక క్రమంలో అమర్చారు. క్లిష్ట నిర్మాణం గల పుష్పాలు సరళ పుష్పాల నుండి పరిణామం చెందినట్లుగా భావించారు. ద్విలింగ పుష్పాలు, ఏకలింగ పుష్పాల నుండి, పరిపత్రరహిత పుష్పాల నుండి ఏకపత్రయుత పుష్పాలు, తరువాత ద్విపరిపత్రయుత పుష్పాలు ఉద్భవించినట్లు తెలిపాలు. వాయు పరాగ సంపర్కాన్ని ఆదిమ లక్షణంగా పేర్కొన్నారు.

వీరి వర్గీకరణకు ఐక్లర్ వర్గీకరణ ఆధారము. విత్తనాలు గల మొక్కలను వివృతబీజాలు, ఆవృతబీజాలుగా గుర్తించారు. ఆవృతబీజాఅలలో ద్విదళబీజాలను ఏకదళబీజాల తరువాత ఉంచారు. ద్విదళబీజాలను ఆర్కిక్లామిడే, మెటాక్లామిడే అనే రెండు తరగతులుగా విభజించారు. వీరి వర్గీకరణలో సరళ నిర్మాణం నుండి సంక్లిష్ట నిర్మాణం చూపే కుటుంబాలను ఒక ఆరోహక క్రమంలో అమర్చారు. క్లిష్ట నిర్మాణం గల పుష్పాలు సరళ పుష్పాల నుండి పరిణామం చెందినట్లుగా భావించారు. ద్విలింగ పుష్పాలు, ఏకలింగ పుష్పాల నుండి, పరిపత్రరహిత పుష్పాల నుండి ఏకపత్రయుత పుష్పాలు, తరువాత ద్విపరిపత్రయుత పుష్పాలు ఉద్భవించినట్లు తెలిపాలు. వాయు పరాగ సంపర్కాన్ని ఆదిమ లక్షణంగా పేర్కొన్నారు.