దేహ కుహరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Picture of Human body cavities — dorsal body cavity to the left and ventral body cavity to the right.

దేహ కుహరం లేదా సీలోం (ఆంగ్లం: Body cavity or Coelom) కొన్ని జంతువుల దేహంలోని కుహరాలు.

విభజన[మార్చు]

  • ఏసీలోమేటా (Acoelomata) : ఇవి దేహకుహర రహిత బహుకణ జీవులు. దేహకుడ్యానికి, అంతరంగాలకు మధ్యప్రదేశం మీసెంఖైం లేదా మృదుకణజాలంతో నిండి ఉంటుంది. ఉ. వర్గం. ప్లాటీహెల్మింథిస్
  • మిధ్యాసీలోమేటా (Pseudocoelomata) : దేహకుడ్యానికి, ఆహారనాళానికి మధ్య కుహరం ఉంటుంది. కానీ ఇది మధ్యస్త్వచం ఉపకళలతో ఆవరించబడి ఉండదు. కాబట్టి ఇది నిజమైన సీలోం కాదు. ఉ. వర్గం. నెమటోడ
  • షైజోసీలోమేటా (Schizocoelomata) : దేహకుహరం షైజోసీలిక్ రకానికి చెందిన నిజమైన సీలోం. ఇది మధ్యస్త్వచం చీలడం వల్ల ఏర్పడుతుంది. ఉ. వర్గం. అనెలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా
  • ఎంటిరోసీలోమేటా (Enterocoelomata): వీటిలో దేహకుహరం నిజమైన సీలోం. ఇది ఆంత్రకుహరికా సీలోం. ఇది ఆది ఆంత్రం నుంచి ఏర్పడుతుంది. ఉ. వర్గాలు. ఎఖైనోడర్మేటా, హెమికార్డేటా, కార్డేటా
"https://te.wikipedia.org/w/index.php?title=దేహ_కుహరం&oldid=3045140" నుండి వెలికితీశారు