సాక్షి (దినపత్రిక)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సాక్షి
Sakshi Main page.jpg
రకము ప్రతిదినం
ఫార్మాటు బ్రాడ్షీట్

యాజమాన్యం: జగతి పబ్లికేషన్స్‌ లిమిటెడ్,
ప్రచురణకర్త: జగతి పబ్లికేషన్స్‌ లిమిటెడ్,
సంపాదకులు: వై.యస్.జగన్
స్థాపన 2008-03-24
హైదరాబాదు,
వెల భారతదేశం రూపాయలు:4.00 సోమ వారం-శని వారం
రూ.5.00 ఆది వారం (2014-పిభ్రవరిలో)
ప్రధాన కేంద్రము హైదరాబాద్,ఆంధ్రప్రదేశ్

వెబ్‌సైటు: http://www.sakshi.com

సాక్షి తెలుగు దిన పత్రిక మార్చి 24, 2008న 23 ఎడిషనులుగా ప్రారంబించబడింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి కుమారుడు వై.యస్.జగన్ ప్రధాన సంపాదకుడు. అమెరికాకు చెందిన మారియో గార్సియా ఈ పత్రిక రూపకల్పన చేసాడు. జగతి పబ్లికేషన్స్ లో భాగంగా ఈ పత్రిక పనిచేస్తుంది. తెలుగు దినపత్రికారంగంలో మొదటిసారిగా అన్ని పేజీలూ రంగులలో ముద్రణ చేయబడుతోంది. ఇతర దినపత్రికల ప్రాంతీయ ఎడిషన్లు చిన్న సైజులో వస్తుంటే, దీనిలో పెద్ద సైజులో వెలువడుతున్నది. ఆదివారం అనుబంధం ఫన్‌డే పేరుతో విడుదల అవుతూ కథలు, సీరియళ్లు, హాస్య శీర్షికలు ఉంటాయి.

సజ్జల రామకృష్ణారెడ్డి సంపాదకీయ సంచాలకునిగా, కె.ఎన్.వై.పతంజలి వ్యవస్థాపక సంపాదకునిగా మొదలైంది. పతంజలి అకాల మరణంతో వర్ధెల్లి మురళి సంపాదకునిగా బాధ్యతలు చేపట్టాడు [1] ప్రస్తుతం ఎడిటోరియల్ డైరెక్టర్ గా రామచంద్రమూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

‌విమర్శలు[మార్చు]

right సాక్షి చిహ్నం

ముఖ్యమంత్రి కుమారుడిగా అధికార బలంతో, అవినీతి సొమ్ముతో స్థాపించిన సంస్థగా ప్రతిపక్ష పార్టీలే గాక, స్వంత కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆరోపించడం ఒక ప్రత్యేకత. అంతే కాకుండా స్వంత పార్టీ గురించి ఎటువంటి విమర్శనాత్మక వార్తలూ ప్రచురించకపోవడం కూడా పత్రిక విలువను అనుమానాస్పదం చేస్తోంది.[2].

మూలాలు[మార్చు]

  1. గోవిందరాజు, చక్రధర్ (2014). మీడియా సంగతులు. Media House Publications. p. 79. 
  2. "సాక్షి పేపర్‌, చానళ్లది అవినీతి పుట్టుక". ఆంధ్రప్రభ. 2010-11-22. Retrieved 2014-03-17. 

బయటి లింకులు[మార్చు]