Jump to content

మానవసేవ (పత్రిక)

వికీపీడియా నుండి
మానవసేవ
రకంమాసపత్రిక
యాజమాన్యంసత్యవోలు అప్పారావు
ప్రచురణకర్తసత్యవోలు అప్పారావు
సంపాదకులునాళము కృష్ణారావు
స్థాపించినది1910
కేంద్రంరాజమహేంద్రవరము

మానవసేవ పత్రిక 20వ శతాబ్దం మొదటిభాగంలో ప్రచురించబడిన తెలుగు సచిత్ర మాసపత్రిక.[1], [2], [3], [4], [5] ఇది రాజమహేంద్రవరములో శ్రీ కందుల శ్రీమన్నారాయణ గారిచే స్థాపించబడింది. దీని మూడవ సంపుటము 1913లో వెలువడినది కావున ఈ పత్రిక 1910 సంవత్సరంలో స్థాపించబడియుండవచ్చును. దీనికి నాళము కృష్ణారావు, సత్యవోలు అప్పారావు గార్లు సంపాదకులుగా సేవలందించారు.

ఇది సత్యవోలు అప్పారావు గారిచే శ్రీవిద్యానిలయ ముద్రణాశాల యందు ముద్రించబడి ప్రకటించబడింది.

పోషకులు

[మార్చు]

దీనికి శ్రీ రాజా రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు బహద్దూరు గారు, శ్రీ రాజా నాయని వేంకట రంగారావు బహద్దూరు గారు రాజపోషకులుగా విరాళాలందించారు.

శ్రీ కొవ్వూరి చంద్రారెడ్డిగారు (జమీందారు, నిడదవోలు), కలిదిండి వేంకటరామరాజుగారు, తమ్మన మాణిక్యముగారు (ఏలూరు), మోతే గంగిరాజుగారు, (జమీందారు, ఏలూరు), రాజా కాళేపల్లి అచ్యుతరామయ్య బహద్దురువారు, (యాదవోలు), కోటగిరి వేంకట కృష్ణారావు బహద్దరువారు (గంపలగూడెం) పోషకులుగా విరాళాలను సమర్పించారు.

1913 విషయాలు

[మార్చు]
  1. భక్త సంజీవని (భాగవతము) - నాళము కృష్ణారావు
  2. ఆర్య సూక్తిముక్తావళి, నీతిబోధ, శారికాగీతము - సత్యవోలు అప్పారావు
  3. చాణక్య శతకము, మరణము - శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి
  4. దుర్గావతి (నవల) - గోటేటి జగన్నాధరావు
  5. కావ్యము - శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
  6. ధర్మపుత్రుడు (నీతికథ) - కామరాజు హనుమంతరావు
  7. సంఘసంస్కరణము - ఎం.వేంకటరంగయ్య
  8. బ్రాహ్మమతము - పాలపర్తి నరసింహము
  9. బ్రహ్మమతోద్దేశము - వెలిదండ శ్రీనివాసరావు
  10. బ్రహ్మసమాజ చరిత్ర - పులవర్తి వేంకట సుబ్బారావు
  11. కిరసనాయిలు - అయ్యంకి వేంకటరమణయ్య
  12. ఆంధ్ర రఘువంశ విమర్శనము, సృష్టిస్త్రీలపరిణామము - ఉమర్ ఆలీషా
  13. భవిష్యద్గృహస్తుడు - అక్కిరాజు ఉమాకాంతము
  14. స్వతంత్రాంధ్ర సాహిత్యము, ఆంధ్రగీర్వాణాంగ్లవిద్యాశాల - తల్లాప్రగడ సూర్యనారాయణ
  15. అలెగ్జాండరు మనుమరాలిని చంద్రగుప్తుడు పెళ్ళియాడుట - మల్లంపల్లి సోమశేఖరశర్మ
  16. స్వర్గీయ దాంపత్యము - ఇ.సుబ్బుకృష్ణయ్య

మూలాలు

[మార్చు]
Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: