బొమ్మరిల్లు (పత్రిక)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బొమ్మరిల్లు పిల్లల మాసపత్రిక, సినీ నిర్మాత, దర్శకుడు అయిన, శ్రీ విజయ బాపినీడు 1971లో స్థాపించారు. దాదాపు, చందమామ వరవడిలోనే కథలు ధరావాహికలు వచ్చేవి కాని భాష, కథా కథనం, కథల ఎంపిక చాలా వేరుగా ఉండేది. ఇందులో మొట్టమొదటి ధారావాహిక 'మృత్యులోయ'. బేతాళ కథలలాగున 'కరాళ కథలు' అని ఒక ధారావాహిక కూడా ప్రవేశపెట్టారు. పత్రికతో బాటు ఒక అనుబంధం కూడా ఇచ్చే పద్ధతి ఈ పత్రికే మొదలు పెట్టింది. కొంతకాలం ఒక రిబ్బనులాంటి వెడల్పుగా చాలా బారుగా ఉన్న ఒక ప్రతిని ఇచ్చేవారు. తరువాత, ఒక చిన్న పుస్తకం ఇవ్వటం మొదలు పెట్టారు. ఆ చిన్న పుస్తకంలో ఓ కథ బొమ్మలతో వేసేవారు. శ్రీమతి గుత్తా విజయలక్ష్మి గారు 'కుందేలు కథలు' అనేకం (ఆంగ్ల కథలకు స్వేఛ్ఛానువాదం) ఈ చిన్న పుస్తకానుబంధం కోసం వ్రాసారు. చందమామకు దీటయిన పోటీనిచ్చింది ఈ పత్రిక.