వేదమాతరమ్
వేదమాతరమ్ (Vedamataram) ఒక వేద విజ్ఞాన, సారస్వత, సాంఘిక తెలుగు మాస పత్రిక. వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాల మీద సదవగాహన కలిగించడం ఈ పత్రిక ముఖ్య ఉద్దేశ్యం.
విశేషాలు[మార్చు]
ఈ పత్రిక ప్రధాన సంపాదకుడు విశ్వనాధ శోభనాద్రి. అతను కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ సోదరుని కుమారుడు. ఈ పత్రిక ఏప్రిల్ 2004 సంవత్సరంలో ప్రారంభించబడింది. వేదాలు, వాటి అనుబంధ విషయాల గురించి ప్రజలకు సరళమైన తెలుగు భాషలో అవగాహన కల్పించడం, తెలుగు సాహిత్యం ప్రమాణాలను పాటించడం ఈ పత్రిక ముఖ్య ఉద్దేశ్యం. ఈ పత్రికలోని విషయాల కోసం ప్రముఖ పండితుల నుండి వ్యాసాలను సేకరిస్తారు. ఇది పాఠకులలో అద్భుతమైన ఆసక్తిని కలిగించడమే కాక పుస్తక పఠన అలవాటును అభివృద్ధి చేస్తుంది. దీనికి కారణం అందులోని విషయాలు చాలా ఆసక్తికరంగా ఉండటమే కాక విభిన్న స్వభావం గలిగి ఉండటం. ఈ పత్రిక మన ప్రాచీన సాహిత్యం లోని వేదాల, ఉపనిషత్తుల, ఇతిహాసాల గురించి అవగాహన తెస్తోంది. ప్రజలు ఏ విద్యాసంస్థకు వెళ్లకుండా ఇంటి నుండి సంస్కృతాన్ని చాలా తేలికగా నేర్చుకునేలా సంస్కృత పాఠాలను ప్రారంభించారు.[1]
మూలాలు[మార్చు]
- ↑ "Vedamataram - About Us". web.archive.org. 2010-01-16. Retrieved 2021-06-17.