గృహలక్ష్మి మాసపత్రిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గృహలక్ష్మి
గృహలక్ష్మి
రకంమాసపత్రిక
సంపాదకులుకె.ఎన్.కేసరి
స్థాపించినది1928
కేంద్రంమద్రాసు

గృహలక్ష్మి మాసపత్రిక ఒక ప్రత్యేకంగా మహిళల కోసం వైద్యులు కే. ఎన్. కేసరి నడిపించిన మాసపత్రిక. స్త్రీల ఆరోగ్యసౌభాగ్యములను పెంపొందించుట కేర్పడిన సచిత్ర మాసపత్రిక అని ఈ పత్రిక ప్రకటించుకుంది.

గరిమెళ్ల సత్యనారాయణ ఈ పత్రికకు 1930లలో కొంతకాలం సంపాదకునిగా పనిచేశారు. ఈ పత్రిక స్వంత ముద్రణాలయం లోధ్ర ప్రెస్‌లో ముద్రించబడింది.

వ్యవస్థాపకులు

[మార్చు]

కె.ఎన్.కేసరి (జననం-1875. మరణం-1953) గా పేరు పొందిన ఈయన అసలు పేరు కోట నరసింహం. ఔషదశాల 'కేసరి కుటీరం' స్థాపకుడు. కేసరి కోట నరసింహం చేతికి ఎముకలేని దానశీలిగా పేరొందాడు. స్త్రీ జనోద్దరణకై ఈ పత్రికను స్థాపించాడు.

విశేషాలు

[మార్చు]

ఈ పత్రిక తొలి సంచిక మార్చి 1928లో వెలువడింది. ఈ పత్రిక 1942లో అనివార్యమైన యుద్ధపరిస్థితులలో తాత్కాలికంగా నిలిచిపోయి 1946లో తిరిగి ప్రారంభమైంది. ఈ పత్రికలో ప్రతి సంచికలోనూ సి.ఎన్.వెంకటరావు మొదలైన చిత్రకారుల తైలవర్ణ చిత్రాలు ప్రచురించేవారు. కనుపర్తి వరలక్ష్మమ్మ, వావిలికొలను సుబ్బారావు, కల్లూరు అహోబలరావు, విశ్వనాథ కవిరాజు, గంటి కృష్ణవేణమ్మ, వెల్లాల ఉమామహేశ్వరరావు, గుమ్మడిదల దుర్గాబాయమ్మ, అనుముల వెంకటశేషకవి, శివరాజు వెంకట సుబ్బారావు, కవికొండల వెంకటరావు, అంగర వెంకటకృష్ణారావు మొదలైనవారి రచనలు ఉన్నాయి.

మొదటి సంచిక

[మార్చు]

ఈ పత్రిక తొలి సంచిక మార్చి 1928లో వెలువడింది. ఈ సంచికలో ఈ క్రింది అంశాలున్నాయి[1].

 1. స్వవిషయము
 2. ఆశీర్వచనము (ఆదిపూడి సోమనాథకవిగారు)
 3. మాలతీలత
 4. ద్రౌపది గుణశీలములు (మహావాది వెంకటరత్నం గారు)
 5. సువాసన తలనూనెలు
 6. వితరణ - కథ (చిల్లరిగె శ్రీనివాసరావు పంతులుగారు బి.ఏ)
 7. డాక్టర్. బిసెంటు (శ్రీమతి మైదవోలు పద్మావతిగారు)
 8. చనుబాలు
 9. దయార్ద్ర హృదయ (శ్రీమతి కె.లక్ష్మిదేవమ్మగారు)
 10. శిశుపోషణ
 11. శారదలేఖలు (శ్రీమతి కనుపర్తి వరలక్ష్మమ్మగారు)
 12. స్త్రీసాముద్రికము
 13. సౌందర్యపోషణము - శిరోజములు
 14. వస్త్రాభరణములు - నాగరికత (మైదవోలు చెంగయ్య పంతులుగారు బి.ఏ.,బి.యల్.,)
 15. వివిధవిషయములు
 16. ఆలోచన

గృహలక్ష్మి స్వర్ణకంకణము

[మార్చు]

20వ శతాబ్దంలో ఆయుర్వేద వైద్యనిపుణులు కె.యన్. కేసరి 1934లో స్వర్ణకంకణము పురస్కారము ప్రారంభించి సాహిత్య, సాంస్కృతిక, తదితర రంగాలలో విశిష్టసేవ చేసిన స్త్రీలను సత్కరిస్తున్నారు. ఆధునిక యుగంలో స్త్రీలని క్రమపద్ధతిలో ఏటా సత్కరించడం ఈ స్వర్ణకంకణముతో మొదలయింది. ఇంతవరకు సుమారు ఒక 60 మంది మహిళలు గృహలక్ష్మి స్వర్ణకంకణముతో సత్కారం పొందారు.

మూలాలు

[మార్చు]
 1. కె.ఎన్., కేసరి (1923-03-01). "గృహలక్ష్మి". గృహలక్ష్మి. 1 (1): 4. Retrieved 5 February 2015.[permanent dead link]
Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: