విపుల
Jump to navigation
Jump to search
![]() విపుల 2007 పత్రిక ముఖచిత్రం | |
ముద్రణకర్త | రామోజీ ఫౌండేషన్ |
---|---|
మొదటి సంచిక | 1978 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
వెబ్సైటు | vipula |
విపుల విశ్వ కథా వేదిక తెలుగు మాసపత్రిక. దీనిని 1978లో ప్రారంభించారు. దీనికి అధిపతి ఈనాడు రామోజీరావు[1]. ఈ పత్రిక కథలు మాత్రమే ప్రచురిస్తుంది. వీటిలో కొన్ని ప్రపంచ భాషల, భారతీయ భాషల కథలకు తెలుగు అనువాదాలుతో పాటు నేరు తెలుగు కథలు ఉంటాయి. జూన్ 2020 నుండి రామోజీ ఫౌండేషన్ నిర్వహించే పత్రికలలో చేర్చబడి అంతర్జాలంలో ఉచితంగా అందజేయబడుతున్నది.
శీర్షికలు[మార్చు]
- బ్రహ్మకేశాలు : మేనకా గాంధీ, యాస్మిన్ సింగ్ రచించిన 'బ్రహ్మాస్ హెయిర్' కు తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి అనువాదం.
- సింగినాదం కథలు : ఆదివిష్ణు
- కథా ముత్యం : సేకరణ, వివరణ: డా.అక్కిరాజు రమాపతిరావు. తెలుగు సాహితీవనంలో గుబాళించే మేలిమి ముత్యాల వంటి నిన్న మొన్నటి కథలను పాఠకుల కోసం సాహితీ విశేషాలతో సహా అందించే శీర్షిక.