నమస్తే తెలంగాణ
నమస్తే తెలంగాణ మన రాష్ట్రం - మన పత్రిక | |
---|---|
![]() మన రాష్ట్రం - మన పత్రిక | |
రకము | దిన పత్రిక |
ఫార్మాటు | బ్రాడ్ షీట్ |
యాజమాన్యం: | |
సంపాదకులు: | తిగుళ్ల కృష్ణమూర్తి |
స్థాపన | జూన్ 6,2011 |
వెల | రూ 5.00 సోమ వారం-శని వారం రూ.6.50 ఆదివారం |
ప్రధాన కేంద్రము | హైదరాబాద్ |
| |
వెబ్‌సైటు: [1] |
నమస్తే తెలంగాణ[1] జూన్ 6, 2011 నాడు[2] ప్రారంభించబడిన తెలుగు పత్రిక. తెలంగాణ ప్రాంతంలోని 7 జిల్లాల నుండి ఇది ప్రచురించబడుతోంది. ఈ పత్రిక తెలంగాణ ప్రాంతపు సమస్యలపై ప్రధానంగా దృష్టిసారిస్తోంది. తెలంగాణ ప్రత్యేక ఉద్యమానికి ఈ పత్రిక మద్దతు ఇస్తుంది. జర్నలిస్టు తిగుళ్ల కృష్ణమూర్తి ఈ పత్రికకు ఎడిటర్. ప్రాణహిత శీర్షికన 4వ పేజీలో సంపాదకీయం ప్రచురించబడుతుంది.
శీర్షికలు[మార్చు]
శీర్షిక | విషయం | రోజూ/వారం |
---|---|---|
తెలంగాణ | తెలంగాణ వార్తలు | ప్రతి దినం |
దునియా | అంతర్జాతీయ వార్తలు | ప్రతి దినం |
ఖేల్ | క్రీడలు | ప్రతి దినం |
జిందగీ | తెలంగాణపై ప్రత్యేక కథనం | రోజూ విభిన్నం |
బిజీమార్కెట్ | వాణిజ్య వార్తలు | ప్రతి దినం |
టాకీస్ | సినిమా వార్తలు | ప్రతి దినం |
ఆవాజ్ | విద్య, ఉద్యోగ సమాచారం | ప్రతి దినం |
అల్లరి | చిన్నారుల శీర్షిక | ఆదివారం |
జీవనరేఖ | ఆరోగ్య సమాచారం | సోమవారం |
బడి | విద్యార్థుల సమాచారం | మంగళవారం |
సలహా | వైద్య సమాచారం | బుధవారం |
విజేత | పోటీపరీక్షల సమాచారం | గురువారం |
ఆడబిడ్డ | మహిళల సమాచారం | శుక్రవారం |
భూమి | ఆర్థిక సమాచారం | శనివారం |
బతుకమ్మ[మార్చు]
ప్రతి ఆదివారం పత్రికకు అనుబంధంగా 32 పేజీల బతుకమ్మ చిరుపుస్తకం అందించబడుతుంది. ఇందులో రెండవ పేజీలో సిర్ఫ్ హమారా శీర్షికతో తెలంగాణాలోని ప్రత్యేకతలు ఇవ్వబడుతుంది. మూడవ పేజీలో "మన ట్యాంక్‌బండ్" శీర్షికలో తెలంగాణా ప్రముఖులపై చిరు పరిచయం తెలియజేయబడుతుంది. ఐదవ పేజీలో సంపాదకులు అల్లం నారాయణ పాఠకుల ప్రశ్నలకు సమాధానం ఇస్తారు. రాజాధిరాజ శీర్షికన కార్టూనులు, జోక్సు ప్రచురించబడతాయి. మధ్యపేజీలలో బొడ్డెమ్మ శీర్షికన చిన్నారులకు ఉద్దేశించిన విషయాలు ఉంటాయి. మైదాకు శీర్షికన మహిళలకు ప్రత్యేక పేజీ ఉంది. కవర్ పేజీ కథనం, రాశి-వాసి, సాహిత్య పరామర్శ, మన కథ, సెక్సాలజీ తదితర శీర్షికలు అదనం.
అంతర్జాలంలో నమస్తే తెలంగాణ[మార్చు]
అంతర్జాలంలో యూనికోడ్ అక్షర రూపంలోనూ, ఈ-పేపర్ రూపంలోనూ ఈ పత్రిక www.ntnews.com అనే యూఆర్‌ఎల్‌లో అందుబాటులో ఉంది. పాత సంచికలు కూడా అందుబాటులో ఉంచబడుతుంది. అంతర్జాలం ద్వారా ఈ పత్రికను భారతదేశం, యునైటెడ్ కింగ్‌డం, అమెరికాలలో అధికంగా వీక్షిస్తున్నారు. డిసెంబరు 29, 2019 నాటికి ఈ పత్రిక అలెక్సా ప్రపంచ ర్యాంకు మూడు నెలల సగటు 4395 ఉండగా, భారత ర్యాంకు 394 గా ఉంది.[3]