నెచ్చెలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నెచ్చెలి అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి వెలువడుతున్న తొలి తెలుగు అంతర్జాల వనితా మాసపత్రిక. ఎటువంటి లాభాపేక్ష లేని ఈ పత్రిక 2019 జూలై 10 న ప్రముఖ కవయిత్రి డా.కె.గీత గారిచే ప్రారంభించబడింది. ఇది ప్రతి నెలా 10వ తేదీన క్రమం తప్పకుండా అంతర్జాలంలో వెలువడుతుంది. ఈ పత్రిక అంతర్జాతీయ స్థాయిలో స్త్రీలకు సంబంధించిన సాహిత్యం, సంగీతం, ఇంటర్వ్యూలు, పరిశోధనలు మొ.న అనేక అంశాల్ని పరిచయం చేస్తుంది. ఇది తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రచురింపబడుతూ ఉంది. ఈ పత్రికకు వ్యవస్థాపకులు, సంపాదకులు డా.కె.గీత.

‘నెచ్చెలి’ లో-

[మార్చు]
‘నెచ్చెలి’ లో-
  • స్త్రీలకు సంబంధించిన రచనలు (పురుషులు రాసినవైనా)
  • లబ్ద ప్రతిష్టులతో బాటూ, మంచి వ్యక్తీకరణ ఉన్న కొత్త రచయిత(త్రు)ల రచనలు  
  • ప్రపంచంలోని ఏ భాష నించైనా తెలుగు, ఇంగ్లీషులలో అనువాదాలు  
  • సాహిత్యంతో బాటూ స్త్రీల ఔన్నత్యానికి సంబంధించిన ఏ అంశాన్ని గురించైనా వివరించే రచనలకు సదా ఆహ్వానం!

ప్రచురణా విధానం

[మార్చు]

నెచ్చెలి పత్రిక సంపాదకులు పేర్కొన్నదాన్ని అనుసరించి పత్రిక ప్రచురణా విధానం కింది విధంగా ఉంటుంది:

  • ప్రతి పేజీ నుంచీ నెచ్చెలిలో రచనలని పూర్తిగా తెలుగులో కూడా వెతక గలిగే సౌకర్యం.
  • ప్రతి రచన గురించీ మీ అభిప్రాయం అదే పేజీలో తెలుగులో కూడా తెలియచేయగలిగే సౌకర్యం.
  • ఏ రచయిత రచనలనైనా ఒకే పేజీలో చదవగలిగే సౌకర్యం.
  • ప్రతీ రచనతో బాటూ అదే పేజీలో రచయిత (త్రి) పరిచయం, నెచ్చెలిలో వారి ఇతర రచనలు తెలుసుకోగలిగిన సౌకర్యం.
  • శీర్షికల సూచిక, పాత సంచికల సూచిక, రచయితల సూచిక మొ.వి అదనాలు.

రచనలు

[మార్చు]

నెచ్చెలి పత్రికలో కథలు, కవితలు, వ్యాసాలు, పుస్తక సమీక్షలు, ఇతర ఆసక్తికరమైన రచనలతో బాటు ఆడియో& వీడియోలుగా కూడా రచనల్ని అందించడం నెచ్చెలి ప్రత్యేకత.

శీర్షికలు

[మార్చు]

నెచ్చెలిలో వచ్చే శీర్షికలు - సంపాదకీయం, కథలు, కవితలు, సమీక్షలు, అనువాదాలు, ధారావాహికలు/నవలలు, జీవితచరిత్రలు, ట్రావెలాగ్స్, ఈ-పుస్తకాలు, నారిసారించిన నవలవంటి ఎన్నో విమర్శనాత్మక వ్యాసాలు, ఇంటర్వ్యూలు, ఆడియో& వీడియోలు మొ.వి.

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. నెచ్చెలి గురించి - ఎడిటర్
  2. నారిసారించిన నవల - కాత్యాయనీ విద్మహే
  3. https://www.thehansindia.com/featured/sunday-hans/creative-chip-off-the-silicon-valley-514681
  4. https://www.thehansindia.com/news/cities/bengaluru/webinar-on-telugu-literature-held-at-bangalore-university-667774
"https://te.wikipedia.org/w/index.php?title=నెచ్చెలి&oldid=3320306" నుండి వెలికితీశారు