బాలమిత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాలమిత్ర పత్రిక ముఖచిత్రం.

బాలమిత్ర (Balamitra) తెలుగు బాలల సచిత్ర మాసపత్రిక. ఇది 1940లో మద్రాసు నుండి ప్రారంబించబడింది. చందమామ వలెనే రంగుల బొమ్మలతో, ప్రాచీన సాహిత్యం నుంచి తీసిన కథలతో ఆసక్తికరంగా ఉండేది[1]. దీని వ్యవస్థాపక సంపాదకుడు బి.వి.రాధాకృష్ణ, సహాయ సంపాదకుడు బి.ఆర్.వరదరాజులు. ఇది స్వర్ణోత్సవం జరుపుకున్న పత్రిక. ఇది ప్రస్తుతం తెలుగు, కన్నడం భాషలలో ముద్రించబడుతున్నది.

ప్రస్తుతం ఈ పత్రికలో ఎన్నో నీతిని బోధించే కథలు, ఆసక్తికరమైన విషయాలతో పాటు శ్రీ గురువాఐరోపాప వైభవం, రాజగురువు రహస్యం, గోల్డెన్ గొరిల్లా ధారావాహికలుగా అందిస్తున్నారు. ప్రతి నెల ఒక మినీ నవలను కూడా ఇస్తున్నారు. ఈ నవల ఎంతో ఆసక్తిగా కలిగించే కథా ఇతివృతం ఉండేది. ఉత్కంఠభరితమైన కథనంతో చివరి వరకు చదవరులని కట్టిపడేసేది.

మూలాలు[మార్చు]

  1. "ఇవిగో బుజ్జి కథలు! అవిగో జేజిమామయ్య పాటలు!". www.teluguvelugu.in. Retrieved 2020-09-26.[permanent dead link]

బాహ్య లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=బాలమిత్ర&oldid=3459010" నుండి వెలికితీశారు