కంప్యూటర్ ఎరా

కంప్యూటర్ ఎరా[1] 2001 అక్టోబరులో ప్రారంభించబడిన తెలుగు కంప్యూటర్ పత్రిక. దీని సంపాదకులు నల్లమోతు శ్రీధర్. కంప్యూటర్ చిట్కాలు, కంప్యూటర్ సంబంధిత సమస్యలకు పరిష్కారాలు,ఫోన్ల రూటింగ్ మొదలుకుని ఇంట్రెస్టింగ్ ఫోన్/ టాబ్లెట్ అప్లికేషన్ల వంటివి పరిచయం చేయడం, సెల్ ఫోన్ల పెర్‌ఫార్మెన్స్ వేగంగా ఉండేలా తీసుకోవలసిన జాగ్రత్తలు, సెక్యూరిటీ పరమైన విషయాలూ,వెబ్ టెక్నాలజీస్, ఫొటోషాప్, ఆఫీస్ అప్లికేషన్లు, ఆసక్తికరమైన వెబ్ సైట్లు, సాఫ్ట్ వేర్ ఉపకరణాలు వంటి వాటిని పరిచయం చేస్తూ సగటు కంప్యూటర్ వాడుకదారునికి ఉపయోగపడేలా సమాచారం ఇందులో పొందుపరచబడి ఉంటుంది. ఇది బండ్ల పబ్లికేషన్స్ వారి చే ప్రచురించబడుతున్నది. తెలుగు రాష్ట్రాలలో కంప్యూటర్ సాంకేతికతలను పెంపొందించడానికి కృషి చేసిన అతి కొద్ది పత్రికలలో ఇది ఒకటి. 2007-08 ప్రాంతాలలో పత్రిక చదువరుల సమావేశాలు నిర్వహించి, చదువరుల అభీష్టాలకు అనుగుణంగా పత్రికను రూపొందించడానికి కృషి చేసింది.