Jump to content

ప్రతిభ (వారపత్రిక)

వికీపీడియా నుండి
ప్రతిభ సచిత్ర వారపత్రిక
ముఖచిత్రం (నలుపు-తెలుపు)
సంపాదకులుకాట్రగడ్డ రాజగోపాలరావు
తరచుదనంవారం
ముద్రణకర్తకాట్రగడ్డ రాజగోపాలరావు
మొదటి సంచికఏప్రిల్ 1, 1968 (1968-04-01)
దేశంభారతదేశం
భాషతెలుగు

ప్రతిభ సచిత్ర వార పత్రిక 1968లో ప్రారంభమై విజయవాడ నుండి వెలువడింది. కాట్రగడ్డ రాజగోపాలరావు ఈ పత్రికకు సంపాదకుడు, ప్రచురణకర్త. బొల్లిముంత శివరామకృష్ణ ఈ పత్రికకు సహాయ సంపాదకునిగా వ్యవహరించాడు.

శీర్షికలు

[మార్చు]

ఈ పత్రికలో సంపాదకీయం, నవలలు, నాటకాలు, (ధారావాహికలు), కథలు, గల్పికలు, కవితలు, వ్యాసాలు, కార్టూన్లు, జోకులు, జాబులు-జవాబులు, సినిమాలోకం, చిన్నారిలోకం, విజ్ఞానప్రతిభ, ఇదీ భారతం, మీ ఆరోగ్యం, వింతలు-విశేషాలు, అసలు విలువ-అదనపు విలువ, ఆమెతలు - సామెతలు, పెద్దల సుద్దులు, అగ్నానుడి విగ్నానం, ఛలోక్తులు, హైదరాబాద్ లేఖ, ఉత్తరాలు, గ్రంథపరిచయాలు మొదలైన అంశాలు ఉన్నాయి.

రచయితలు

[మార్చు]

ఈ వారపత్రికలో రచనలు చేసిన వారిలో ఆచార్య ఆత్రేయ, చందు సుబ్బారావు, మహీధర నళినీమోహన్, ముప్పాళ్ళ రంగనాయకమ్మ, ఆరుద్ర, కోడూరి శ్రీరామమూర్తి, అక్కిరాజు జనార్ధనరావు, గజ్జెల మల్లారెడ్డి, చలసాని ప్రసాదరావు, అట్లూరి పిచ్చేశ్వరరావు, ఎమ్‌.కె.సుగమ్‌బాబు, కె.రామలక్ష్మి, రాంభట్ల కృష్ణమూర్తి, గుమ్మడి వెంకటేశ్వరరావు, దోనేపూడి రాజారావు, కొండముది శ్రీరామచంద్రమూర్తి, చాగంటి సోమయాజులు, యర్రంశెట్టి సాయి - చందు సోంబాబు, అనిశెట్టి సుబ్బారావు, [[దూపాటి సంపత్కుమారాచార్య]], ముద్దుకృష్ణ, నాగభైరవ కోటేశ్వరరావు, సుధామ, ద్విభాష్యం రాజేశ్వరరావు, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, మాధవపెద్ది గోఖలే, గుత్తికొండ సుబ్బారావు, నంబూరి పరిపూర్ణ మొదలైనవారున్నారు.

మూలాలు

[మార్చు]