కోడూరి శ్రీరామమూర్తి
Appearance
కోడూరి శ్రీరామమూర్తి రచయితగా, సాహిత్య విమర్శకుడుగా, గాంధేయతత్వ పరిశోధకుడుగా, జీవిత చరిత్రకారుడుగా, బహుముఖంగా కృషి చేశాడు.
జీవిత విశేషాలు
[మార్చు]ఇతడు 1941, సెప్టెంబరు 29వ తేదీన రాజమండ్రిలో జన్మించాడు. ఆర్థికశాస్త్రంలో ఎం.ఎ. చదివాడు. బొబ్బిలిలోని రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు కళాశాలలో ఆర్థికశాస్త్ర విభాగంలో అధ్యాపకుడిగా పనిచేసి హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్‌గా పదవీవిరమణ చేశాడు[1].
పురస్కారాలు
[మార్చు]- ఆంధ్రపదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం
- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం
- ఆంధ్రప్రదేశ్ రవీంద్ర శతాబ్ది పురస్కారం
- పులికంటి కృష్ణారెడ్డి స్మారక పురస్కారం
రచనలు
[మార్చు]- రవికవి (రవీంద్రనాథ్ టాగూర్ జీవిత చరిత్ర) - కోడూరి లీలావతితో కలిసి
- తెలుగు నవలా సాహిత్యంలో మనో విశ్లేషణ
- వెలుగు-వెన్నెల (సాహిత్య వ్యాస సంపుటి)
- అందాల తెలుగు కథ
- ఉన్నవ లక్ష్మీనారాయణగారి మాలపల్లి
- కొడవటిగంటి కుటుంబరావు సాహిత్య సమాలోచన
- ఆలోచన (వ్యాసాలు)
- సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ జీవితం - సందేశం
- మనకు తెలియని మహాత్ముడు
- మరో కోణంలోంచి మహాత్ముడు
- మా మంచి తెలుగు కథ (కథా పరిచయ వ్యాసాలు)
- సాహిత్యానుభూతి (విశ్లేషణా వ్యాసాలు)
- భారతదేశంలో లౌకికవాదం
- మన సంస్కర్తల జీవిత కథలు
- మహాత్ముడు పర్యావరణము
- మహాత్ముని సత్యాగ్రహాలు
- సుప్రసిద్ధ వ్యక్తుల జీవితాల్లో అప్రసిద్ధ గాథలు
- అవిశ్రాంత అన్వేషి ఎం.ఎన్.రాయ్
- ఉన్నవ లక్ష్మీనారాయణ గారి మాలపల్లి (సంపాదకత్వం)
- బాపూ నడిచిన బాట (కథలు)
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Who is Who of Indian Writers". SAHITYA ACADEMI. sahitya academy. Retrieved 17 May 2020.[permanent dead link]