Jump to content

అట్లూరి పిచ్చేశ్వరరావు

వికీపీడియా నుండి
అట్లూరి పిచ్చేశ్వరరావు
జననం(1925-04-12)1925 ఏప్రిల్ 12
మరణం1966 సెప్టెంబరు 26(1966-09-26) (వయసు 41)
మరణ కారణంగుండెపోటు
వృత్తికథకుడు, అనువాదకుడు, నవలా రచయిత, సాహిత్యవేత్త
జీవిత భాగస్వామిఅట్లూరి చౌదరాణి
పిల్లలుఅనిల్ అట్లూరి
తల్లిదండ్రులు
  • సీతారామస్వామి (తండ్రి)
  • శేషారత్నం (తల్లి)

అట్లూరి పిచ్చేశ్వరరావు (1925 ఏప్రిల్ 12 - 1966 సెప్టెంబర్ 26) తెలుగు కథకుడు, అనువాదకుడు, నవలా రచయిత, స్క్రీన్ ప్లే రచయిత. పిచ్చేశ్వరరావు భారత నౌకాదళంలో మెకానికల్ ఇంజనీరుగా, విశాలాంధ్ర పత్రికలో సహాయ సంపాదకునిగా, తెలుగు సినిమా రంగంలో స్క్రిప్టు రచయితగా పనిచేశాడు. సాహిత్య రంగంలో అనేక కథలు, రేడియో నాటికలు, సినిమా స్క్రిప్టులు, వెండితెర నవలలు రాసిన ఇతనికి తెలుగు సాహిత్య రంగంలో హిందీ సాహిత్య అనువాదకునిగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రేమ్‌చంద్, కిషన్ చంద్ వంటి సుప్రసిద్ధ హిందీ రచయితల నవలలు ఇతను తెలుగులోకి అనువదించాడు. ఇతని అనువాదాల్లో రష్యన్ నవలలు కూడా ఉన్నాయి. పిచ్చేశ్వరరావు స్క్రిప్ట్ రచయితగా పనిచేసిన సినిమాల్లో చివరకు మిగిలేది (1960), భార్యాభర్తలు (1960) సినిమాలు ఉన్నాయి. ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, రచయిత త్రిపురనేని రామస్వామి చిన్న కూతురు చౌదరాణి ఇతని భార్య. రచయితగా సినిమా, సాహిత్య రంగాల్లో రాణిస్తుండగానే 41 ఏళ్ళ వయసులో ఇతను గుండెపోటుతో మరణించాడు.

జీవితం

[మార్చు]

పిచ్చేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా యందు చౌటపల్లి గ్రామంలో ఏప్రిల్ 12, 1925 న జన్మించాడు. ఆ తర్వాత ఆయన కుటుంబం సమీప గ్రామమైన పులపర్రు గ్రామానికి వలస పోయింది. చౌటపల్లి గ్రామంలోనూ, కైకలూరు పాఠశాలలయందు విద్యాభ్యాసం చేశాడు. హిందీ విశారద పరీక్షలలో ప్రథముడుగా నిలిచాడు. తన ఇంటర్మీడియట్ విద్యను హిందూ కళాశాల (బందరు)లో పూర్తి చేశాడు. తన విద్య పూర్తయిన తరువాత 1945 నుండి 1953 దాక భారత నౌకా దళంలో మెకానికల్ ఇంజనీరుగా పనిచేశాడు.[1] అతను అక్కడ పనిచేస్తున్న సమయంలోనే బ్రిటీష్ ప్రభుత్వంపై రాయల్ ఇండియన్ నేవీ జరిపిన తిరుగుబాటు జరిగింది.[2]

తరువాత కొన్నేళ్ళ పాటు విశాలాంధ్ర పత్రికలో సహాయ సంపాదకుడిగా పనిచేసి, 1962 లో మద్రాసుకి వెళ్ళి కొన్నేళ్ళపాటు తెలుగు సినిమాలలో స్క్రిప్టు రచయితగా ఇల్లరికం, చివరకు మిగిలేది, వాగ్దానం వంటి సినిమాలకు పనిచేశాడు. ఈ సమయంలోనే కథకుడిగా, అనువాదకుడిగా, నాటక రచయితగా పేరుపొందాడు. ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘంలో ప్రధానపాత్ర పోషించారు. 1966లో గుండెపోటుతో మద్రాసులో మరణించాడు.[2]

పిచ్చేశ్వరరావు, ప్రముఖ కవి, సంఘ సంస్కర్త అయిన త్రిపురనేని రామస్వామి గారి చిన్న కూతురు చౌదరాణిని వివాహం చేసుకున్నాడు.[3] ఆమె కూడా కథా రచయిత్రి, నవలా రచయిత్రి. ఆమె తెలుగు పుస్తక శాలను మద్రాసులో ప్రారంభించింది. ఆమె 1996 లో మరణించింది.

రచనా జీవితం

[మార్చు]

పిచ్చేశ్వరరావు అనేక కథలు, రేడియో నాటికలు వంటివి రాసాడు. "గౌతమ బుద్ద", "వీరేశ లింగం" అనే స్క్రిప్టులు పిచ్చేశ్వరరావు రచనా ప్రతిభకు తార్కాణాలుగా నిలిచాయి. హిందీ భాషలో గల సాహిత్యాన్ని తెలుగులో అనువాదం చేయుటకు కృషి చేశాడు. చిత్ర పరిశ్రమలో ప్రముఖ స్క్రీన్ రైటర్ గా ప్రసిద్ధి పొందాడు.

కథలు, గల్పికలు, నాటికలు

  1. విన్నవి - కన్నవి
  2. మనసులో మనిషి
  3. కథాసాగరం
  4. పిచ్చేశ్వరరావు కథలు
  5. విముక్తి అభ్యుదయ (1946) 01-మే-1948 ఎ. పిచ్చేశ్వరరావు
  6. వింత మరణం (1956) - జనవరి - అభ్యుదయ - మాసపత్రిక
  7. పనిమనిషి అభ్యుదయ (1946) 01-మే-1956
  8. వసుంధర అభ్యుదయ (1946) 01-ఏప్రిల్-1957
  9. మరపే మెరుగు అభ్యుదయ (1946) 01-ఆగస్టు-1957
  10. ఒక అనుభవం పుస్తకం 01-జనవరి-1960 అంచనా తేది
  11. జీవచ్ఛవాలు పుస్తకం 01-జనవరి-1960 అంచనా తేది
  12. నెత్తరు కథ పుస్తకం 01-జనవరి-1960 అంచనా తేది
  13. గడవని నిన్న పుస్తకం 01-జనవరి-1960 అంచనా తేది
  14. కోరిన వరం పుస్తకం 01-జనవరి-1960 అంచనా తేది
  15. ఆగస్టు 15న పుస్తకం 01-జనవరి-1960 అంచనా తేది
  16. వెర్రికాదు, వేదాంతం పుస్తకం 01-జనవరి-1960 అంచనా తేది
  17. డొంకల వంకల మనసులు పుస్తకం 01-జనవరి-1960 అంచనా తేది
  18. శాస్త్రి పుస్తకం 01-జనవరి-1960 అంచనా తేది
  19. సబద్ధము పుస్తకం 01-జనవరి-1960 అంచనా తేది
  20. కథకుడు పుస్తకం 01-జనవరి-1960 అంచనా తేది
  21. విముక్తి పుస్తకం 01-జనవరి-1960 అంచనా తేది
  22. బ్రతకటం తెలియనివాడు పుస్తకం 01-జనవరి-1960 అంచనా తేది
  23. పరిచయం పుస్తకం 01-జనవరి-1960 అంచనా తేది
  24. పులి-మేక ఆట పుస్తకం 01-జనవరి-1960 అంచనా తేది
  25. గర్బస్రావం పుస్తకం 01-జనవరి-1960 అంచనా తేది
  26. తీరనికోరిక పుస్తకం 01-జనవరి-1960 అంచనా తేది
  27. ఇదిప్పుడు మనదేశమే పుస్తకం 01-జనవరి-1960 అంచనా తేది
  28. ఎదురీత పుస్తకం 01-జనవరి-1960 అంచనా తేది
  29. గడచిన దినాలు పుస్తకం 01-జనవరి-1960 అంచనా తేది
  30. వసుంధర వసుధ 01-అక్టోబరు-1971
  31. చిరంజీవి
  32. విముక్తి ప్రజాసాహితి 01-ఏప్రిల్-1981
  33. నెత్తురు ప్రజాసాహితి 01-సెప్టెంబరు-1997
  34. ఒక అనుభవం

హింది నుండి తెలుగులోకి అనువాదాలు

  1. గోదాన్ - ప్రేమచంద్
  2. ఒకానొక గాడిద ఆత్మ కథ - కిషన్ చందర్
  3. నేఫాలో గాడిద - కిషన్ చందర్
  4. పేకముక్కలు - అరికెపూడి రమేష్ చౌదరి

రష్యన్ నుండి తెలుగులోకి అనువాదాలు

  1. పారిస్ పతనం - ఇల్యా ఎహ్రెన్ బెర్గ్
  2. బాగోగులు - ఇల్యా ఎహ్రెన్ బెర్గ్
  3. ఆదర్శ జీవులు - ఆంతోనినా కోప్తాయేవా - 1959
  4. అపరిచిత -గలీనా నికోలాయేవా

వెండితెర నవలలు

  1. కృష్ణలీలలు -1959
  2. ఇల్లరికం -1, మే, 1959
  3. నమ్మినబంటు -జనవరి, 1960
  4. చివరకు మిగిలేది -1960
  5. భార్యాభర్తలు -1961
  6. వాగ్దానం -1961
  7. బాటసారి -30, June 1961
  8. ఆత్మబంధువు -1962, డిసెంబరు 14
  9. కొడుకులు కోడళ్ళు -1963
  10. అనుబంధాలు -1963

చలనచిత్రాలకు కథనం - సంభాషణలు

  1. చివరకు మిగిలేది -1960
  2. భార్యాభర్తలు -1961
  3. వివాహబంధం -1964
  4. కాంభోజరాజు కథ -1967

లఘు చిత్రాలు

  1. గౌతమ బుద్ధ
  2. కందుకూరి వీరేశలింగం

మూలాలు

[మార్చు]
  1. Saccidānandan (1961). Who's who of Indian Writers (Print ed.). New Delhi, India: Sahitya Akademi. p. 260.
  2. 2.0 2.1 విశాలాంధ్ర (27 September 1966). "అభ్యుదయ రచయిత అట్లూరి పిచ్చేశ్వరరావు గారి హఠాన్మరణం" (PDF). No. విశాలాంధ్ర దినపత్రిక. విశాలాంధ్ర. Retrieved 6 September 2022.[permanent dead link]
  3. Sinha, Madhubala (2009). Encyclopaedia of South Indian Literature: Volume 2 (Print ed.). Anmol Publications. p. 110. ISBN 978-81-261-3740-4.