హిందూ కళాశాల (బందరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హిందూ కళాశాల
స్థాపితం1928 (1928)
అనుబంధ సంస్థకృష్ణా విశ్వవిద్యాలయము
చిరునామబచ్చుపేట, మచిలీపట్నం, మచిలీపట్నం, భారతదేశం

హిందూ కళాశాల మచిలీపట్నంలోని ప్రముఖమైన, పురాతనమైన కళాశాల. ఇది 1928లో ప్రారంభమైనది.

చరిత్ర[మార్చు]

అమరావతి శేషయ్యశాస్త్రి మచిలీపట్నంలో కలెక్టరు కార్యాలయంలో శిరాస్తాదారుగా పనిచేసేవాడు. ఇతనిది తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం. ఉద్యోగరీత్యా మచిలీపట్నంలో 15 సంవత్సరాలపాటు నివసించాడు. ఆ సమయంలో బందరులో క్రైస్తవ ప్రచారకులైన నోబుల్ దొర, షార్కీ దంపతులు, ఫాక్స్ అనే క్రైస్తవ మిషనరీ మొదలైన వారు హిందువులను మతాంతీకరణకు ప్రోత్సహించడం చూసి శేషయ్యశాస్త్రి కలతచెందాడు. క్రైస్తవులు పాఠశాలలను నెలకొల్పి హిందూ విద్యార్థులను చేర్చుకుని వారికి విద్య, ఉచితభోజనం కల్పించి వారిని తమ మతంవైపుకు ఆకర్షించే ప్రయత్నాన్ని గమనించి ఇతడు హిందూ మతస్థులకు ప్రత్యేకించి ఒక పాఠశాల స్థాపించి విద్యగరపడం వల్ల యువకులను, విద్యార్థీవిద్యార్థినులను హిందూ మతంలోనే కొనసాగేటట్లు చేయవచ్చని భావించాడు. ముంజలూరు పురుషోత్తం అనే యువకునితో కలిసి ఇతడు 1856, జనవరి 1న "హిందూ ఆంగ్లో వెర్నాక్యులర్ స్కూల్" పేరుతో ఒక పాఠశాలను ప్రారంభించి ఇంగ్లీషు, తెలుగు భాషలను బోధించసాగాడు. ఈ స్కూలుకు టేలర్ అనే ఆంగ్లేయుడు మొదటి ప్రధానోపాధ్యాయుడు. 1863లో ఈ పాఠశాల "హిందూ హైస్కూల్"గా రూపాంతరం చెంది మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా చేర్చబడింది. శేషయ్యశాస్త్రికి మచిలీపట్నం నుండి బదిలీ కావడంతో ఈ విద్యాలయ బాధ్యతను ముంగునూరి నరసింహం పంతులు స్వీకరించాడు. 1928లో ఈ విద్యాలయం సెకండరీ గ్రేడ్ కళాశాలగా రూపుదిద్దుకుని 1934లో ఫస్ట్ గ్రేడ్ కళాశాలగా మార్పుచెందింది. 1971 నాటికి హిందూకళాశాల శాఖోపశాఖలుగా విస్తరించింది. ఈ కళాశాలకు అనుబంధంగా పద్మావతి జూనియర్ కళాశాల (1976), పద్మావతి బి.ఎడ్.కళాశాల (1977), పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల (1978), శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల (1981), న్యాయకళాశాల (1982), ఎం.బి.ఎ. కళాశాల (1986) ప్రారంభించబడ్డాయి[1].

పూర్వ విద్యార్థులు[మార్చు]

పూర్వ అధ్యాపకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. మహమ్మద్ సిలార్ (2016). మచిలీపట్నం సర్వస్వం. మచిలీపట్నం. pp. 147–152.{{cite book}}: CS1 maint: location missing publisher (link)