మాగంటి అంకినీడు
మాగంటి అంకినీడు | |
---|---|
దస్త్రం:Maganti Ankinidu 1.png గుడివాడలో అంకినీడు కాంశ్య విగ్రహం | |
జననం | 1915 జనవరి 1 కృష్ణా జిల్లా నందివాడ మండలం తమిరిశ గ్రామం |
మరణం | 2008 సెప్టెంబరు 8 |
పదవి పేరు | పార్లమెంట్ సభ్యుడు - లోకసభ |
పదవీ కాలం | 1962 - 1984 |
ముందు వారు | దుగ్గిరాల బలరామకృష్ణయ్య |
తర్వాత వారు | కావూరి సాంబశివరావు |
రాజకీయ పార్టీ | జాతీయ కాంగ్రెస్ పార్టీ |
మతం | హిందువు |
భార్య / భర్త | శారదాంబ |
తండ్రి | మాగంటి వేంకట రామదాసు |
మాగంటి అంకినీడు, (1915 - 2008) స్వాతంత్ర్య సమర యోధులు, సుదీర్ఘ కాలం పార్లమెంట్ సభ్యునిగా (1962-1984) పనిచేసాడు.కృష్ణా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గా, ఆంధ్రా బ్యాంకు డైరెక్టరుగా తిరుమల తిరుపతి ట్రస్టు బోర్డు సభ్యునిగా పనిచేసాడు.
జననం, విద్య[మార్చు]
మాగంటి అంకినీడు 1915 జనవరి 1 న కృష్ణా జిల్లా, నందివాడ మండలం, తమిరిశ గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో మాగంటి వేంకట రామదాసు దంపతులకు జన్మించాడు. మచిలీపట్నం హిందూ కాళాశాలలో చదివాడు. ఇతను ధర్మపత్ని శారదాంబ.[1]
స్వాతంత్ర పోరాటం[మార్చు]
గాంధీజీ పిలుపు అందుకొని అంకినీడు చిన్నతనంలోనే స్వాతంత్ర్య పోరాటంలో పాల్గోన్నాడు. ఉప్పు సత్యాగ్రం సమయంలోనూ, క్విట్ ఇండియా ఉద్యమ సమయంలోనూ రెండుసార్లు జైలు శిక్ష అనుభవించాడు[1].
రాజకీయ జీవితం[మార్చు]
అంకినీడు గుడివాడ తాలుకా కాంగ్రెస్ అధ్యక్షునిగా, కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ అద్యక్షునిగా, కృష్ణాజిల్లా పరిషత్ అధ్యక్షునిగా పనిచేసాడు.
మొదటసారి 1962లో గుడివాడ లోకసభ నియోజక వర్గం నుండి జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా 3వ లోక సభకు ఏన్నికైనాడు. ఆ తరువాత 1967లోనూ, 1972 లోనూ వరుసగా గుడివాడ నుండి ఏన్నికై 4వ, 5వ లోకసభలలో సభ్యునిగా కొనసాగాడు. 1977 లోనూ, 1980 లోనూ మచిలీపట్నం లోకసభ నియోజకవర్గం నుండి ఏన్నికైనాడు.
ఆంధ్రా బ్యాంకు డైరెక్టరుగా, తిరుమల తిరుపతి ట్రస్టు బోర్డు సభ్యునిగా పనిచేసాడు.
మరణం[మార్చు]
మాగంటి అంకినీడు 2008 సెప్టెంబరు 8న మరణించాడు.
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 "Maganti Ankineedu Biodata at Lok Sabha website". Archived from the original on 3 జూలై 2011. Retrieved 2 September 2021.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)