పువ్వాడ శేషగిరిరావు
పువ్వాడ శేషగిరిరావు | |
---|---|
జననం | జూలై 12, 1906 |
మరణం | జనవరి 24, 1981 |
వృత్తి | ఉపన్యాసకులు, |
పిల్లలు | 2 |
తల్లిదండ్రులు |
|
పువ్వాడ శేషగిరిరావు (జూలై 12, 1906 - జనవరి 24, 1981) ప్రముఖ తెలుగు కవి, పండితులు. వీరు కవి పాదుషా బిరుదాంకితులు.
జీవిత సంగ్రహం
[మార్చు]ఇతను 12 జూలై, 1906 తేదీన దివి తాలూకా మొవ్వ గ్రామంలో సుందరరామయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు. వీరు ఉభయ భాషా ప్రవీణ పరీక్షలో ఉత్తీర్ణులై అధ్యాపక వృత్తిలో విశేషంగా రాణించారు.విజయవాడ హిందూ కళాశాలలోను, విజయనగరం మహారాజా కళాశాలలోను, బందరు హిందూ కళాశాలలోను, నేషనల్ కాలేజీ (ఆంధ్రజాతీయ కళాశాల) లలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేసారు. వీరు చాలా పద్య, గద్య కావ్యాలు, నాటకాలను రచించారు. వీరి రచనలు కొన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం, నాగార్జున విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఉత్కళ విశ్వవిద్యాలయాలలో ఇంటర్మీడియట్, డిగ్రీ, భాషా ప్రవీణ విద్యార్థులకు పాఠ్యగ్రంథాలుగా నిర్ణయం చేసారు.
ఇతని పెద తాతగారు పువ్వాడ రామదాసు మొవ్వ వేణుగోపాలస్వామి పై కీర్తనలు రచించి గానం చేశారు. వీరి రెండవ కుమారుడు పువ్వాడ తిక్కన సోమయాజి దుందుభి, జిగీష, సువర్ణ సౌరభం మొదలైన రచనలతో ప్రముఖుల ప్రశంసలందుకున్నారు.
పువ్వాడ శేషగిరిరావు జనవరి 24, 1981 తేదీన బందరులో పరమపదించారు.
రచనలు
[మార్చు]పద్య కావ్యాలు
[మార్చు]గద్య కృతులు
[మార్చు]- మధుకలశము
- తెలుగు వెలుగులు
- దీపకళికలు
- పరశురాముడు
- ఆంధ్ర తేజం (1934) [4] : ఇది 1934 సంవత్సరంలో మారుతీ రాం అండ్ కో, బెజవాడ వారిచే ముద్రించబడింది. ఆంధ్రతేజాలైన తిక్కన, పోతన, శ్రీకృష్ణదేవరాయలు, తిమ్మరుసు, పల్నాటి పులి వంటివారి జీవితాలను ఆధారం చేసుకుని రాసిన కథలివి. ఐతే ఆంధ్రులు కాని పద్మిని గురించిన కథ కూడా చేర్చారు. ఇవి విద్యార్థుల కోసం కవి సంకలనం చేసిన జీవితచరిత్రలు.
- ఏరువాక
- ఔరా, ఎవరు?
- ఉత్తరములు
బుర్రకథ
[మార్చు]- రక్త తర్పణం
నాటకాలు
[మార్చు]- పృథ్వీ పుత్రి
- ప్రతాపరుద్రమదేవి
- సహపంక్తి
- నందనారీ
- బిల్హణీయం
- చదరంగం
- సత్యప్రభ
- లక్ష్మీ స్వయంవరం
- తిస్సా పరిష్కారం
- ఢిల్లీ దర్బార్
గౌరవ సత్కారాలు
[మార్చు]- 1956 సంవత్సరంలో రిపబ్లిక్ దినోత్సవం నాడు జరిగిన జాతీయ కవి సమ్మేళానికి ఆహ్వానింపబడి సన్మానం పొందారు.
- 1975లో జరిగిన ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలు వేదిక మీద ఘనంగా సన్మానం అందుకున్నారు.
- ' కవి పాదుషా ' బిరుదు పొందారు.
మూలాలు
[మార్చు]- ↑ భారత డిజిటల్ లైబ్రరీలో తాజమహలు పుస్తక ప్రతి లింకు.
- ↑ భారత డిజిటల్ లైబ్రరీలో దారా పుస్తక ప్రతి లింకు.
- ↑ భారత డిజిటల్ లైబ్రరీలో శతపత్రము పుస్తక ప్రతి లింకు.
- ↑ భారత డిజిటల్ లైబ్రరీలో పుస్తక ప్రతి.
- శేషగిరిరావు, పువ్వాడ, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, రెండవ భాగము, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005, పేజీలు: 832-3.