వేమూరి వేంకటేశ్వరరావు
This article ఆత్మకథ అయి ఉండవచ్చు. లేదా వ్యాసవిషయమైన వ్యక్తి గాని, వారికి సంబంధించిన సంస్థ గానీ చాలా ఎక్కువ దిద్దుబాటు చేసి ఉండవచ్చు.. |
వేమూరి వేంకటేశ్వరరావు | |
---|---|
జననం | చోడవరం, విశాఖపట్నం జిల్లా | 1938 జనవరి 17
విద్యాసంస్థ |
|
వృత్తి | రచయిత, కంప్యూటర్ సైన్సు ఆచార్యులు |
పిల్లలు | సీత, సునీల్, మైథిలి |
తల్లిదండ్రులు |
|
వేమూరి వేంకటేశ్వరరావు వృత్తిరీత్యా, యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేశాడు. తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందాడు.
జీవిత విశేషాలు
[మార్చు]వేమూరి వేంకటేశ్వరరావు విశాఖ జిల్లా, చోడవరం లో వేమూరి సోమేశ్వరరావు, తెన్నేటి సీతమ్మ దంపతులకు జన్మించాడు. తూర్పుగోదావరి జిల్లా, తుని లో పెరిగాడు.[1] ప్రాథమిక,ఉన్నత విద్యను తుని ఉన్నతపాఠశాలలో పూర్తిచేసి, 1952-54లో బందరు హిందూ కళాశాలనందు ఇంటర్మీడియట్ చదివాడు. 1954-58లో కాకినాడలోని ఇంజనీరింగు కళాశాలలో బి.ఇ ని పూర్తిచేసాడు. తరువాత ఆయన మిచిగన్ లోని " డిట్రోయిట్ విశ్వవిద్యాలయం" [2] లో ఎం.ఎస్ పట్టాను పొందాడు. 1968లో లాస్ ఏంజిల్స్ లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి. చేసాడు. భారతదేశంలో నైవేలీ లిగ్నయిట్ ప్రోజెక్ట్, భిలాయ్ స్టీల్ ప్రోజెక్ట్ లలో ఉద్యోగాలను చేసాడు.
విజ్ఞాన శాస్త్ర రచయితగా
[మార్చు]ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని జనరంజక శైలిలో రాయటంలో సిద్ధహస్తుడు.ఇతను 1967 ప్రాంతాలలో కంప్యూటర్ల మీద మొట్టమొదటి తెలుగు పుస్తకం రాశాడు[ఆధారం చూపాలి]. ఇది తెలుగుభాషాపత్రికలో రెండున్నర ఏళ్ళ పాటు ధారావాహికగా ప్రచురించబడింది.
తెలుగులో రచించిన పుస్తకాలు జాబితా
[మార్చు]- ఈ దిగువ జాబితాలో పుస్తకాలు అన్ని "సైన్సు వ్యాసాలు-పుస్తకాలు, " శీర్షిక కింద http://www.maganti.org/newgen/index1.html ఉచితంగా లభ్యం.
- జీవరహస్యం (ప్రాణం లేని జడ పదార్థం నుండి జీవి ఎలా పుట్టిందో చెప్పే కథ)
- రసగంధాయ రసాయనం (ఇంటింటా, వంటింటా వాడే సాధారణ పదార్ధాల వెనుక ఉన్న రసాయన శాస్త్రం)
- జీవనది (మన శరీరంలో ప్రవహిస్తూ మనకి ప్రాణాన్ని ఇచ్చే రక్తం కథ)
- విశ్వస్వరూపం (ఈ విశ్వం పుట్టుపూర్వోతరాల కథ)
- నిత్యజీవితంలో రసాయనశాస్త్రం, (సాధారణ పదార్ధాల వెనుక ఉన్న రసాయన శాస్త్రం)
- ప్రాణి ఎలా పుట్టింది?, (జడ పదార్థం నుండి జీవి ఎలా పుట్టిందో చెప్పే కథ)
- అలనాటి అమెరికా అనుభవాలు, (1960 దశకంలో అమెరికా ఎలా ఉండేదో చెప్పిన అనుభవాలు)
- కించిత్ భోగో భవిష్యతి, (సైన్సు ప్రాతిపదికగా కల కథలు)
- మహాయానం, (సైన్సు ప్రాతిపదికగా కల కల్పిత కథలు)
- ధర్మసంస్థాపనార్థం, (రకరకాల కల్పిత కథలు)
- రామానుజన్ నుండి ఇటూ అటూ, (రామానుజన్ చేసిన పనిని అందరూ అర్థం చేసుకోడానికి చేసిన ప్రయత్నం)
- ఫెర్మా చివరి సిద్ధాంతం, (పైథాగరోస్ సిద్ధాంతాన్ని సాధారణీకరించడంలో ఇబ్బందులు అందరికీ అర్థం అయే పద్ధతిలో)
- తెలుగులో కొత్త మాటలు, (తెలుగులోకి క్రొంగొత్త మాటలు ప్రవేశపెట్టే విధానాలు), 2016
- చుక్కల్లో చంద్రుడు: చంద్రశేఖర్ కథ, (ప్రఖ్యాత నక్షత్రభౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత జీవిత చరిత్ర), సుజనరంజని, ఆగస్టు 2017, సిలికాన్ ఆంధ్ర ప్రచురణ, 2017
- గుళిక రసాయనం (క్వాంటం కెమెస్ట్రీ), 2018.
- ఒకటి, రెండు, మూడు,..., అనంతం, 2019.
- మన నాయకులకి కాసింత భౌతికశాస్త్రం, 2020.
- గ్రీసుదేశపు పురాణగాథలు, 2022.
- భౌతికశాస్త్ర వ్యాసాలు, 2023
- ఏం? ఎందుకని? సిగ్గెందుకని, http://www.maganti.org/newgen/index1.html
ఈ కాలంలోనే ఈ కథలని రాయటానికి కావలసిన శాస్త్రీయ పదజాలాన్నిఇతను ఒక చోట చేర్చి ఆంగ్లం -తెలుగు, తెలుగు-ఆంగ్లం నిఘంటువు, పర్యాయపదకోశం అనే (English-Telugu and Telugu-English Dictionary and Thesaurus) నిఘంటువుని ప్రచురించాడు. దీనిలో ని ఆంగ్లం-తెలుగు ప్రతిలోని పదాల వెతుకుటకు సాహితీ.ఆర్గ్ లో లభ్యం. మెరుగుపరచిన ఈ నిఘంటువులను వికీబుక్స్ లో చూడవచ్చు.(b:వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు, b:వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు).
బర్‌క్లీలో ఉన్న కేలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో తెలుగు పీఠం నెలకొల్పడానికి 2006 నుండి నిధులు సేకరిస్తున్నాడు.[3] తెలుగు పాఠాల బోధన 2007లో మొదలయింది. [4] ఇప్పటికి (అనగా 2024 కి) శాశ్వత నిధిలో దరిదాపు $750,000 నిల్వ ఉన్నాయి.
ఇతను ఎకో ఫౌండేషన్ అనే స్వచ్చంద సంస్థని స్థాపించి నడిపేడు (2000-2010 వరకు). పర్యావరణ పారిశుధ్యం, గ్రామీణ సంక్షేమం, బీద విద్యార్ధులకి వేతనాలు కల్పించటం, విద్యారంగంలో ప్రతిభావంతులకి పురస్కారాలు, తెలుగు భాషని పునరుద్ధరించటానికి ప్రయత్నాలు ఈ సంస్థ ఆశయాలు.
పురస్కారాలు
[మార్చు]- పబ్లిక్ సర్వీస్ అవార్డు, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, డేవిస్, కేలిఫోర్నియా, అమెరికా
- వంశీ పురస్కారం: త్రిపురనేని గోపీచంద్ అవార్డ్, 2 జూలై 2004, చికాగో (సప్న, సిరి ఫౌండేషన్), అమెరికా
- కొలరావి పురస్కారం, వికీపీడియా, 2013
- తానా అచీవ్‌మెంట్ అవార్డు, 2013, సేన్ హొసే, కేలిఫోర్నియా, అమెరికా
- జీవిత సాఫల్య పురస్కారం, వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికా, 2014, హ్యూస్టన్, టెక్సస్, అమెరికా
- 11 వ రాధికా సాహితీ అవార్డు, 2019, ప్లెజంటన్, కేలిఫోర్నియా, అమెరికా
- జీవిత సాఫల్య పురస్కారం, బే ఏరియా తెలుగు ఎసోసియేషన్ 50 వ వార్షికోత్సవం, ఫ్రీమాంట్,అక్టోబరు 2022, కేలిఫోర్నియా, అమెరికా
- జీవిత సాఫల్య పురస్కారం, వీక్షణం 12 వ వార్షికోత్సవం, సెప్టెంబరు 14, 2024, ప్లెజంటన్, కేలిఫోర్నియా, అమెరికా
వంశ వృక్షం
[మార్చు]వేమూరి భగీరథ భొట్లు --> చల్లయ్య --> బుచ్చన్న --> చల్లయ్య --> భగవాన్లు --> లక్ష్మీనారాయణ & రేగులగడ్డ అప్పలనరసమ్మ --> సోమేశ్వరరావు (1 Dec 1898 - 30 Nov 1984) & తెన్నేటి సీతారామమ్మ (8 Sep 1905 - c.1966) --> వేంకటేశ్వరరావు (17 Jan 1938) & గొల్లపూడి ఉమ --> సీత, సునీల్ (23 June 1969) & లక్ష్మి --> {అర్జున్( 20 Aug 2007), విద్య (22 Feb 2009)}, మైథిలి --> రోహాన్ బ్రోడీ (బుజ్జి) (29 జూన్ 2019)
మూలాలు
[మార్చు]- ↑ "ఆచార్య వేమూరి వేంకటేశ్వరరావు గారితో ముఖాముఖి". maganti.org. Archived from the original on 2016-03-04. Retrieved 2015-08-09.
- ↑ en:https://www.udmercy.edu
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-05-16. Retrieved 2021-05-16.
- ↑ http://guide.berkeley.edu/courses/telugu/
ఇతర లింకులు
[మార్చు]- "వేమూరి వారి పరిచయవివరాల జాలస్థలి". Archived from the original on 2011-12-05. Retrieved 2012-02-23.
- Top-10-Telugu-Living-Legends-In-USA [1]
- Geniuses of Andhra - Vemuri Venkateswara Rao
- కథానిలయం
- Friends of Telugu
- Berkeley South Asia
- అత్మకథ లాంటి వ్యాసాలు
- Pages using infobox person with unknown parameters
- Pages using Infobox person with deprecated parameter home town
- Infobox person using residence
- Infobox person using home town
- మూలాలు చేర్చవలసిన పాఠ్యమున్న వ్యాసాలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with DBLP identifiers
- నిఘంటుకారులు
- 1937 జననాలు
- తెలుగులో సైన్సు రచయితలు
- అమెరికా తెలుగు రచయితలు
- తెలుగు వికీపీడియా సభ్యులు
- ప్రవాస భారతీయులు
- తెలుగువారు
- విదేశాలలోని వికీపీడియనులు
- వికీపీడియనులలో అధ్యాపకులు
- విశాఖపట్నం జిల్లా రచయితలు
- విశాఖపట్నం జిల్లా ఉపాధ్యాయులు
- వాడుకరులు వారిని గురించి వారే సృష్టించిన పేజీలు