రసమయి
రకం | మాసపత్రిక |
---|---|
యాజమాన్యం | నండూరి పబ్లికేషన్స్, హైదరాబాద్ |
ప్రచురణకర్త | నండూరి పార్థసారథి |
సంపాదకులు | నండూరి పార్థసారథి |
స్థాపించినది | అక్టోబర్ 2000 |
భాష | తెలుగు |
ముద్రణ నిలిపివేసినది | 2009 |
కేంద్రం | హైదరాబాద్ |
జాలస్థలి | http://rasamayi.com |
రసమయి ఒక తెలుగు సాంస్కృతిక మాసపత్రిక. దీని సంపాదకులు, ప్రచురణకర్త నండూరి పార్థసారథి. ఇది అక్టోబరు 2000 సంవత్సరంలో ప్రారంభించబడింది. సంగీత సాహిత్య నృత్య నాటక కళలు, జానపద హస్త కళలు సినిమా వీటి కోసం ప్రత్యేకంగా ఈ పత్రిక ప్రారంభించబడింది. సరళ సుందరమైన భాషలో గంభీరమైన విషయాలను వివరించే పరిశోధనాత్మకమైన వ్యాసాలు దీనిలో ప్రకటించి అలనాటి భారతి పత్రికను గుర్తుకు తెచ్చింది. దీనిని నండూరి పబ్లికేషన్స్ హైదరాబాదు నుండి ప్రచురించారు. అంతర్జాలంలో కూడా ఈ పత్రికను చదివే సౌలభ్యం ఉండేది. కేవలము చందాదారులపైనే ఆధారపడిన ఈ పత్రిక 2009లో ఆగిపోయింది. వెలువడిన అన్ని సంచికలు మామూలు చూయింగ్ గమ్, టయిమ్ పాస్ పత్రికల మాదిరిగా కాక సీరియస్ పత్రికగా ఒక స్థాయిని నిలబెట్టుకుంది. ప్రతి సంచికా ఒక ప్రత్యేక సంచికగా వెలువడింది.
రచయితలు
[మార్చు]ఈ పత్రికలో సంపాదకుడు నండూరి పార్థసారథితో పాటు పాలగుమ్మి విశ్వనాథం, న్యాయపతి రాఘవరావు, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, భద్రిరాజు కృష్ణమూర్తి, తాత సత్యనారాయణ, కె.యజ్ఞన్న, జ్వాలాముఖి, కస్తూరి మురళీకృష్ణ, బాలాంత్రపు రజనీకాంతరావు, వేంకట పార్వతీశ్వర కవులు, వైజర్సు బాలసుబ్రహ్మణ్యం, పెన్నా శివరామకృష్ణ, వేటూరి ఆనందమూర్తి, మండపాక పార్వతీశ్వరశాస్త్రి, కోవెల సంపత్కుమారాచార్య మొదలైన వారి రచనలు ప్రచురితమయ్యాయి.
రచనలు
[మార్చు]ఈ పత్రికలో ప్రచురింపబడిన కొన్ని రచనలు:
- శ్రీకృష్ణ కథామృతం
- రేడియో అన్నయ్య - సంగీత కారుడు
- శృంగార శాకుంతలము
- తెలుగు భాషాభివృద్ధికి వ్యూహాలు
- తప్పులతో ప్రచారం ఉన్న త్యాగరాజ రచనలు
- స్వరార్ణవం
- శ్రీ అరవిందుల సావిత్రి
- శరత్ జీవన పునశ్చరణ
- అసలు సిసలు సినిమాకవి మజ్రూహ్
- ఉయ్యాల జంపాల
- హ్యూమరసమయి
- సారంగపాణి పదములు
- ఉర్దూగజల్ - ఛందస్సు
- శేషేంద్ర మేనిఫెస్టో
- శేషేంద్ర సాహితీ జీవన ప్రస్థానం
- జంటకవుల 'ఏకాంతసేవ'
- ముత్తయ్య భాగవతార్
- గజల్ సామ్రాజ్ఞి బేగం అఖ్తర్
- దేవానంద్ ఆత్మకథ
- జెమినీ వారి చంద్రలేఖ