వేటూరి ఆనందమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేటూరి ఆనందమూర్తి

వేటూరి ఆనందమూర్తి ప్రఖ్యాత పరిశోధకుడు వేటూరి ప్రభాకరశాస్త్రి కుమారుడు. స్వయంగా పరిశోధకుడు. అన్నమయ్య సాహిత్యంపై అధ్యయనం చేశాడు. ప్రభాకర సంపూర్ణ గ్రంథావళి సంపాదకుడు. మణిమంజరి అనే అర్ధవార్షిక పత్రికకు సంపాదకత్వం వహించి నడిపాడు. హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకు అధ్యక్షుడిగా 1989-1990లలో పనిచేశాడు. సాహిత్య అకాడమీ భాషాసమ్మాన్ పురస్కారం(2006), శ్రీకృష్ణదేవరాయ పురస్కారం,సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్టువారి శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం (2010) మొదలైన అనేక పురస్కారాలు పొందాడు[1].

రచనలు[మార్చు]

  1. తాళ్లపాక కవుల కృతులు వివిధ సాహితీ ప్రక్రియలు
  2. తాళ్లపాకకవుల పదకవితలు భాషా ప్రయోగ విశేషాలు
  3. క్షేత్రజ్ఞులు పదసాహితి
  4. మన వాగ్గేయకారులు-తొలి సంకీర్తన కవులు

2017,ఫిబ్రవరి-7న, కీ.శే.వేటూరి ప్రభాకరశాస్త్రి 130వ జయంతి ఉత్సవాల సందర్భంగా, పెదకళ్ళేపల్లి గ్రామములో, వీరు రచించిన ఆంధ్ర సాహిత్యంపై విష్ణు మత ప్రభావం - తాళ్ళపాక కవులు అను గ్రంధావిష్కరణ జరిగినది. [ఈనాడు అమరావతి; 2017,ఫిబ్రవరి-7; 2వపేజీ]

మూలాలు[మార్చు]