Jump to content

వినోదిని

వికీపీడియా నుండి
వినోదిని
వినోదిని
రకంమాసపత్రిక
రూపం తీరుడెమీ ఆక్టావో
ప్రచురణకర్తపి.ఎస్.వేణుగోపాలస్వామి నాయుడు
సంపాదకులుఆర్.రంగనాయకమ్మ
స్థాపించినది1932
కేంద్రంమద్రాసు

నవ్వుల మాసపత్రిక. ఈ పత్రిక 1932 డిసెంబరు నుండి పి.ఎస్.వేణుగోపాలస్వామి నాయుడు స్వీయ సంపాదకత్వంలో కొన్నినాళ్లు నడిపాడు. ఆ తరువాత ఈ పత్రికకు ఆర్.రంగనాయకమ్మ సంపాదకురాలుగా వ్యవహరించింది.

విషయాలు

[మార్చు]

1934 ఏప్రిల్ సంచిక[1]లో ఈ క్రింది విషయాలు ఉన్నాయి.

  • క్లబ్బు కబుర్లు
  • కిచకిచలు
  • నవ్వు
  • బహుముఖాల అద్దం
  • సనాతన కాఫీ హోటల్
  • లౌ రోగములు
  • కళ్లెత్తి చూడని కారణం
  • ముండా? ముత్తయిదా?
  • ఇన్సూరెన్సు ప్రాయశ్చిత్తము
  • సైకిలు సరదా
  • బ్రహ్మదేవుడు తెల్లబోయాడు
  • ఏనుగబ్బాయి వివాహము
  • అనుమానం ప్రాణసంకటం
  • దయ్యాన్ని కాదంటూంటే
  • సోదె నా కొంప తీసింది
  • బి.వి.టప్పయ్య
  • అమ్మమ్మ
  • పిల్లి
  • ది ప్రణయలత భీమాకంపెనీ
  • పేచీల పెదబాబు

ఈ పత్రికలో హాస్య విషయాలతో పాటు సాముద్రికశాస్త్రము, చదరంగము, గ్రంథసమాలోచన, రాజకీయ వ్యాసాలు కూడా ప్రచురింపబడ్డాయి. రచయిత చలం వ్రాసిన బ్రాహ్మణీకం దీనిలో ధారావాహికగా వెలువడింది.

రచయితలు

[మార్చు]

ఈ పత్రికలో ఆనాటి హేమాహేమీలైన రచయితలందరూ వ్రాశారు. అందులో కొందరి పేర్లు: విశ్వనాథ కవిరాజు, పూడిపెద్ది వేంకటరమణయ్య, చలం, సౌరిస్, కొడవటిగంటి కుటుంబరావు, జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి, భాగవతుల శివశంకర శాస్త్రి

మూలాలు

[మార్చు]
  1. ఎడిటర్ (ఏప్రిల్ 1934). "విషయాలు". వినోదిని. 2 (5): 5. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 23 January 2015.
"https://te.wikipedia.org/w/index.php?title=వినోదిని&oldid=2957167" నుండి వెలికితీశారు