సౌరిస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సౌరిస్ తెలుగు రచయిత్రి. ఈమె గుడిపాటి వెంకట చలం కుమార్తె. సౌరిస్ కథల్ని పుస్తకంగా భీమునిపట్నంలోని స్నేహ ప్రచురణల వారు ఆగస్టు 1997లో ప్రచురించారు.ఈ పుస్తకంలో వున్నవి 8 కథలు. ఉష అనే కథ 1936 లోనూ, సుమిత్ర అనే కథ 1937 లోనూ, స్మృతి కథ 1946-47 లోనూ రాసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం సౌరిస్ పేరిట ఒక ఆశ్రమం విశాఖపట్నంలోని భీమిలి ప్రాంతంలో నెలకొని ఉంది. సౌరిస్ చలం కూతురిగానే కాకుండా, యోగినిగా, రమణ మహర్షి శిష్యురాలిగా కూడా సుపరిచితురాలు. సౌరిస్‌ని చలం ముద్దుగా షౌ అని పిలిచేవారు.

సౌరిస్‌కు పిల్లి పిల్లలన్నా, కుక్క పిల్లాలన్నా ఎంతో ఇష్టం. వాటిని తన స్నేహితులుగా భావించేవారు. అదే అంశాన్ని తీసుకొని 'మా మిత్రులు' అని ఒక పుస్తకం కూడా రాశారు. సౌరిస్‌ సాహిత్యాన్ని విపరీతంగా చదవడమే కాదు, రాసేవారు కూడా. శ్రీశ్రీ కవిత్వమూ.. పాల్ రిబ్సన్ సంగీతమూ ఒకటే అంటుంది ఆమె. ఈ విషయాన్ని చలం స్వయంగా మహాప్రస్థానానికి రాసిన యోగ్యతా పత్రంలో పేర్కొంటారు. చలం తన చివరి కాలంలో, తన కూతురు సౌరిస్‌లో ఈశ్వరుణ్ణి చూసుకున్నాడట. ఏ పనిచేసినా 'ఈశ్వరుడు చెప్పాలి' అనేవాడట. "ఈశ్వరుడు" అంటే అతని దృష్టిలో సౌరిస్. ఆమె ప్రభావంలోనే చలం 1961లో "ప్రళయం" వస్తుందని ప్రచారం చేసాడు. చివరి రోజులలో చలానికి తన కుమార్తె సౌరిస్, ఎంతగానో సేవ చేసింది. అరుణాచలంలో మూడు దశాబ్దాలు జీవించి, 1979 మే 4న అనారోగ్యంతో చలం మరణించాడు. అతని అంత్యక్రియలు కూతురు సౌరిస్ దగ్గరుండి జరిపించింది.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సౌరిస్&oldid=2955330" నుండి వెలికితీశారు