రమణ మహర్షి
రమణ మహర్షి | |
---|---|
![]() రమణ మహర్షి అరవై వయసులో. | |
జననం | వెంకటరామన్ అయ్యర్ 1879 డిసెంబరు 30 తిరుచుళి, విరుధు నగర్ |
నిర్యాణము | 1950 ఏప్రిల్ 14 శ్రీ రమణాశ్రమం, తిరువణ్ణామలై, తమిళనాడు | (వయసు 70)
జాతీయత | భారతీయుడు |
గురువు | అరుణాచల |
తత్వం | అద్వైతం |
సాహిత్య రచనలు | Nān Yār? ("Who am I?") Five Hymns to Arunachala |
శ్రీ రమణ మహర్షి (తమిళం : ரமண மஹரிஷி) (డిసెంబరు 30, 1879 – ఏప్రిల్ 14, 1950), ఒక భారతీయ ఋషి. బాల్య నామం వెంకట్రామన్ అయ్యర్, ఇతను తమిళనాడు తిరుచ్చుళి లో ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. 16 సంవత్సరాల వయస్సులో మోక్షజ్ఞానం పొంది తిరువణ్ణామలైలోని అరుణాచల పర్వతాలపై స్థిరపడ్డాడు.[1] బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిననూ మోక్షజ్ఞానం పొందిన తరువాత తనను "అతియాశ్రమి"గా ప్రకటించుకున్నాడు.[2]
రమణ మహర్షి బోధనలలో ప్రధానమైంది "మౌనం" లేదా "మౌనముద్ర". ఇతను చాలా తక్కువగా ప్రసంగించేవాడు.తన మౌనంతో సందేశం పొందలేని వారికి మాత్రమే మాటల ద్వారా మార్గం చూపేవాడు.[3] ఇతని బోధనలలో విశ్వజనీయమైన ఆత్మజ్ఞానం ప్రధానాంశంగా వుండేది.[4] ఎవరైనా ఉపదేశించమని కోరితే, "స్వీయ శోధన" ఉత్తమమని, ఇది సూటి మార్గమని తద్వారా మోక్షం సులభ సాధ్యమని బోధించేవాడు.అతని అనుభవం అద్వైతం, జ్ఞానయోగాలతో ముడిపడి ఉన్నా కూడా అడిగినవారి మనస్థితిని బట్టి వారికి భక్తి మార్గాలని బోధించేవాడు.[5] రమణ మహర్షిని గూర్చిన ఒక వాసాన్ని ప్రసిద్ధ ఫ్రెంచ్ రచయిత సోమర్ సెట్ మామ్ రాసాడు.
కుటుంబ నేపథ్యం[మార్చు]
శ్రీ రమణ మహర్షిగా ప్రఖ్యాతి గాంచిన ఇతనికి తల్లి తండ్రులు పెట్టిన పేరు వెంకట్రామన్ అయ్యర్. ఇతనిని భక్తులు భగవాన్ అని కూడా సంభోదిస్తారు.ఇతను భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లాలోని తిరుచ్చుళిలో 1879 డిశంబరు 30వ తేదీ 'ఆరుద్ర దర్శనం (పునర్వసు నక్షత్రం) ' నాడు అళగమ్మాళ్, సుందరేశం అయ్యర్లు దంపతులకు జన్మించాడు.ఇతనికి ఇద్దరు సోదరులు (నాగస్వామి, నాగ సుందరం) ఒక సోదరి (అలమేలు). సుందరేశ అయ్యర్ అక్కడ ప్లీడరుగా (వకీలు లేదా లాయరు) గా పనిచేసేవాడు.
బాల్యం[మార్చు]
పూర్వాశ్రమంలో రమణ మహర్షి అందరు పిల్లల లాగే సాధారణంగా ఉండేవాడు.అపారమైన దేహదారుఢ్యం కలిగి ఉండేవాడు. బాల్యంలో చదువు మీద ఆసక్తి చూపించేవాడు కాదు. తిరుచ్చుళిలో సరైన విద్యాసౌకర్యం లేకపోవడం వలన వాళ్ళ చిన్నాన్న (సుబ్బాయ్యర్) వద్దకు వెళ్ళాడు. రమణులు చిన్నతనంలో బాగా నిద్ర పోయేవాడు. ఎలాంటి నిద్ర అంటే ఇతను నిద్రపోయినప్పుడు తోటి పిల్లలు ఇతన్ని నడిపించి దూరంగా తీసుకువెళ్ళి బాదినా తెలిసేదికాదు. ఇతని అసలు పేరు వేంకటేశ్వర. ఒకసారి పాఠశాలలో వేంకటేశ్వర అని రాయమంటే వెంకట్రామన్ అని రాయడం చేత వెంకట్రామన్ అని పిలవడం ప్రారంభం అయింది. రమణ తండ్రి చనిపోవడం వల్ల చిన్నాన్న సుబ్బయ్యర్ రమణ అన్నయ్య నాగస్వామిని, రమణను మధురై తీసుకుని వెళ్ళిపోయాడు. రామస్వామి అయ్యర్ అనే అతను అరుణాచలం వెళ్ళివస్తుండగా రమణులు పలకరించి ఎక్కడ నుంచి వస్తున్నారు అని అడిగాడు. అతను అరుణాచలం నుంచి వస్తున్నాను అని చెప్పగా, ఆమాట విన్న తరువాత అతనిలో ఏదో తెలియని గొప్ప అనుభూతి కలిగింది. అప్పటి నుంచి అల్లరిచేయండం, రుచుల కోసం ప్రాకులాడటం మానేశాడు.
బోధనలు[మార్చు]
స్వీయ - శోధన ద్వారా మాత్రమే "జ్ఞాన మార్గం". వీరి బోధనలలో హిందూమత సిద్ధాంతాల ప్రకారం ఉపనిషత్తులు, అద్వైత వేదాంతంలనే కాకుండా, అనేక మత సారాంశాల మార్గాలను తన బోధనలలో బోధించేవాడు.[5]
- ఏ స్థితిలో ఐతే ప్రశాంతమైన మనసు నిలకడగా ఉన్న అనుభూతిని కలిగి ఉంటుందో, అదే సమాధి. ఆ నిలకడగా ప్రశాంతంగా ఉన్న మనసే దేవుడి నిజరూపాన్ని దర్శించగల్గుతుంది.
- అదే సహజమైన సమాధి. ఇక్కడ బాహ్యప్రపంచంలో పని చేస్తున్నా కూడా మనసు నిలకడగా, ప్రశాంతంగా ఉంటుంది.అంతరాంతరాలలో నిన్ను ఎదో సత్యం కదిలిస్తున్నట్టు అనిపిస్తుంది. నీకు ఏ బాధ , కోరిక , ఆవేదన ఉండవు. ఏది నీది కాదని తెలుసుకుంటావు. ఎవరైతే ఈ సమస్తాన్ని తానై నడిపిస్తున్నారో ఆ సత్యాన్ని తెలుసుకున్న నువ్వు వారితో ఎప్పుడూ అంతర్లీనమయ్యే ఉంటావు
- ఈ సమాధి మాత్రమే శాశ్వతమైన ప్రశాంతం. ఈ సమాధి స్థితిలో అంత్య దశలో పరమానందాన్ని పొందుతావు. భక్తిలో పరమానందం ముందుగా వస్తుంది. ఇది అశ్రుధారలాగా, రోమాలు నిక్కబొడుచుకుని, గొంతు తడబడుతూ బయటకు ప్రజ్వలిస్తుంది. అహం నశించాక, ఈ సమాధి స్థితి చేరుకున్నాక ముందు చెప్పిన లక్షణాలు అవే నశిస్తాయి.
భగవాన్ గురించి చలం[మార్చు]
- భగవాన్ బోధించే వేదాంతమూ, ఆయన 'ప్రిస్క్రిప్షన్లూ' నాకు సమ్మతం కావు. ఆయన గంభీరత్వంలోనూ, లోకం మీద ఆయనకి వున్న సంపూర్ణ నిర్లక్ష్యం మీదా గౌరవం నాకు. ఆయన ఆత్మ సౌందర్యం ఆయన ప్రేమా నేను వొప్పుకుంటాను. నాకు స్త్రీ ఉంది. మీకు దేవుడున్నాడు.స్త్రీ తప్ప నన్ను గట్టిగా కదిలించగలది ఏదీ లేదు. స్త్రీ కోసం జీవితాల్ని ధ్వంసం చేసుకున్న వాళ్లని, అంటే కీర్తీ, డబ్బూ కాదు- అంతకన్న శ్రేష్టమైనవి -జీవితం మీద ఆసక్తినీ-శక్తినీ-బతకడంలో ఆనందాన్నీ, (Grip on Life and Joy of Living) పోగొట్టుకున్న వాళ్లని చూస్తే నేను చాలా వివేకవంతుణ్ణిగా తోస్తాను.
- చెలం 1950 లో తిరువణ్ణామలై వెళ్ళిపోయారు. అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొన్నాడు. రమణ మహర్షి ఆశ్రమానికి ఎదురుగా వున్న 'మహాస్థాన్ ' ఆవరణ ఇంట్లో అద్దెకి ఉన్నారు. ఆ తరువాత అక్కడ ఒక ఇంటిని కొన్నాడు. దాని పేరే రమణస్థాన్.ఈ ప్రదేశమంతా యోగులమయం. దొంగయోగులు లేరు. ఏమీలేని బోలుయోగులూ, ఏదో కొంతవరకు సాధించి స్థిమితపడ్డ మహనీయులూ కనపడేవారు. చాలామంది కనపడరు. భగవాన్ మరణించాక ఆశ్రమంలో తగాదాలు మొదలయ్యాయి. బ్రాహ్మణ, అబ్రాహ్మణ, అరవ, ఆంధ్ర, పరదేశీయులు ఒక జట్టు ఐనారు. లేచిపోతున్నారు.రౌడీలు, పోలీసు కాపలాలు - ఒక్క ఆత్మ మౌనమైన రూపుతో ఇన్నేళ్ళు పరిపాలించిన ఆశ్రమం. కృష్ణుడు పోగానే అర్జునుడు ఏడ్చిన ఏడుపు జ్ఙాపకం వొస్తోంది. ద్వారక ఏమయిందో - ఆనాడు - నిజంగానో, కవి హృదయంలోనో, అట్లావుంది లోకం నాకు!ఇప్పుడు ఆశ్రమం పిశాచం మల్లే, ఒక కలమల్లే ఉంది. ఎక్కడివాళ్ళక్కడ లేచిపోయినారు. చాలా వొంటరితనం. మా వాళ్ళు 15 రోజులకిందటే వెళ్ళిపోయినారు. అదో చిత్రమైన వ్యవహారం 'చే ' బొంబాయిలో, 'షౌ ' మద్రాసులో, 'చిత్ర ' పశుమలైలో తక్కినవాళ్ళెక్కడ వున్నారో తెలీదు. ఎప్పుడు వస్తారో రారో తెలీదు. ఎవరైనా నన్ను గుర్తించి పలకరిస్తే చాలునన్నంత దీనావస్థలో! నీవు ఒకవేళ తిరువణ్ణామలై లో ఉంటే గిరి ప్రదక్షిణ చెయ్యి. ఈ గిరి తేజోలింగం. ఎప్పుడూ శక్తితో ప్రకాశిస్తుంది. జగద్గురు శంకరాచార్యులు ఇక్కడే ధ్యానం చేసాడు.
శ్రీ రమణ మహర్షి శిష్యులు[మార్చు]
చిత్రమాలిక[మార్చు]
Sri Ramana Maharshi in 1902.jpg 1902 లో రమణమహర్షి
Sri-Ramana-Sramam.jpg రమణాశ్రమం
మూలాలు[మార్చు]
- ↑ "Ramana Maharshi and the Path of Self-Knowledge". Archived from the original on 2008-12-14. Retrieved 2009-02-03.
- ↑ Bhagavan Sri Ramana Maharshi the Atiasrami, p.1
- ↑ "Talks with Sri Ramana Maharshi". Archived from the original on 2012-12-27. Retrieved 2009-02-03.
- ↑ Be As You Are Introduction
- ↑ 5.0 5.1 Sri Ramana's approval of other practices
బయటి లింకులు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to Ramana Maharshi. |
- The official Bhagavan Sri Ramana Maharshi website
- David Godman - Author - contains many articles and translated works of or about Ramana Maharshi
- Bhagavan-Ramana.org Site (Comprehensive, extensively sourced information on Ramana Maharshi)
- Kheper article, information on Sri Ramana Maharshi
- The Ramana Maharshi Centre for Learning(RMCL) - established to create greater awareness of the timeless heritage and culture of India, with particular focus on the life and teachings of Bhagavan Sri Ramana Maharshi
- రమణ మహర్షి వ్రాసిన ఉన్నది నలుబది సద్విద్య గ్రంథపు అనువవాదం
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with SELIBR identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with SNAC-ID identifiers
- 1879 జననాలు
- 1950 మరణాలు
- అద్వైతం
- ఆధ్యాత్మిక గురువులు