పాల్ బ్రంటన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పాల్ బ్రంటన్ చిత్రపటం

పాల్ బ్రంటన్ (1898 అక్టోబరు 21 – 27 జూలై 1981) ఒక ఆంగ్ల తత్వవేత్త, సన్యాసి మరియు యాత్రికుడు.ఆయన చేస్తున్న పాత్రికేయ వృత్తిని వదిలేసి యోగులతో, సన్యాసులతో గడిపి ప్రాచ్య, పాశ్చాత్య దేశాల నిగూఢ తత్వాలను అధ్యయనం చేశాడు.

జీవిత చరిత్ర[మార్చు]

బ్రంటన్ 1898 లో లండన్‌లో జన్మించాడు. ఆయన జన్మనామం రఫెల్ హర్స్ట్. మొదట్లో పుస్తక విక్రేత మరియి పాత్రికేయుడుగా పనిచేసాడు. పాత్రికేయుడిగా వ్యాసాలు రాసేటపుడు అనేక మారు పేర్లతో రాసేవాడు. పాల్ బ్రంటన్ అనే పేరు అలా సృష్టించుకున్నదే. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ట్యాంక్ విభాగంలో పనిచేశాడు. తరువాత రహస్య శాస్త్రాల అధ్యయనం మీద ఆసక్తి కలిగింది. అందులో భాగంగా 1930 లో బ్రంటన్ భారతదేశానికి వచ్చాడు. మెహెర్ బాబా, చంద్రశేఖరేంద్ర సరస్వతి, రమణ మహర్షి లాంటి యోగులని కలిశాడు. మొదట కంచి శంకరాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతిని కలవగా ఆయన రమణ మహర్షిని కలవమని సూచించాడు. 1931 లో బ్రంటన్ మొట్టమొదటి సారిగా రమణ మహర్షిని కలిశాడు.

బ్రంటన్ రమణ మహర్షిని 'భగవంతుని తెలుసుకోవడం ఎలా?' లాంటి ప్రశ్నలు అడిగాడు. అందుకు రమణులు 'విచారణ ద్వారా నువ్వెవరో తెలుసుకో' అని సమాధానమిచ్చాడు.[1]

మూలాలు[మార్చు]