కుమారిల భట్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కుమరిల భట్టు చాళుక్య యుగములోని దక్షిణ భారతదేశములో ప్రసిద్ధి చందిన మీమాంసకారుడు.

జైనకవి జనవిజయుని వ్రాతల ప్రకారం కుమరిల భట్టు ఆంధ్రుడు. ఈయన ఆంధ్ర, కళింగ సరిహద్దులలోని జయమంగళం అను గ్రామములో జన్మించాడు. ఒక సిద్ధాంతం ప్రకారం ఈయన మొదట బౌద్ధ మతస్తుడు. తరువాత వైదిక మతస్థునిగా మారాడు. కుమరిల భట్టు యజ్ఞయాగాదుల స్వభావం, వాటి ఉపయోగాలు క్షుణ్ణంగా చదివి దాని సారాంశాన్నంతటిని శ్లోక వార్తిక, తంత్రవార్తిక, తుప్తిక అను మూడు గ్రంథాలుగా వ్రాశాడు. ఇవి మూడు, క్రీ.పూ 4వ శతాబ్దానికి చెందిన జైమిని రాసిన మీమాంస శాస్త్రాన్ని, గుప్తులకాలంలో శబరస్వామి అని పేరుగల్గిన పండితుడు తిరగవ్రాసిన మీమాంస శాస్త్రానికి భాష్యాలు అని చెప్పవచ్చు.

కుమరిలుడు దేశమంతటా తిరిగి తన సిద్ధాంతాలను ప్రచారం చేశాడు. దానిని వ్యతిరేకించిన వారిని వాదంలో ఓడించాడు. ముఖ్యంగా బౌద్ధమతాన్ని ఖండించాడు. కుమరిల భట్టు వైదిక కర్మకాండ యందు గొప్ప నమ్మకం కలవాడు. అందువలన వైదిక కర్మకాండను పునరుద్ధరించవలెనని తీవ్రమైన కృషి చేశాడు. అతడు జైమినీ మీమాంస తత్వాన్ని అభిమానించినప్పటికీ తన సమకాలిక మతాలు చెప్పే మోక్ష సిద్దాంతాన్ని గూడా అంగీకరించాడు. మంచి కర్మల వలన మోక్షం వస్తుందనిగాని, సంతోషం కల్గుతుందనిగాని మీమాంసశాస్త్రం అంగీకరించదు.

మూలాలు

[మార్చు]
  • సమగ్ర ఆంధ్రదేశ చరిత్ర - సంస్కృతి రెండవ భాగం రచన: ముప్పాళ్ల హనుమంతరావు పేజీ.537