కార్ల్ జంగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కార్ల్ జంగ్
జననంకార్ల్ గుస్తావ్ జంగ్
(1875-07-26)1875 జూలై 26
కెస్విల్, తుర్గౌ, స్విట్జర్లాండ్
మరణం1961 జూన్ 6(1961-06-06) (వయసు 85)
కుస్నాక్ట్, జ్యురిక్, స్విట్జర్లాండ్
రంగములు
  • సైకియాట్రీ
  • సైకాలజీ
వృత్తిసంస్థలు
  • బర్గోజ్లీ
  • స్విస్ ఆర్మీ
    • మొదటి ప్రపంచయుద్ధంలో పనిచేశాడు
చదువుకున్న సంస్థలు
  • బేసెల్ విశ్వవిద్యాలయం
  • జ్యురిక్ విశ్వవిద్యాలయం
పరిశోధనా సలహాదారుడు(లు)యూజీన్ బ్లూలర్
ప్రసిద్ధి
ముఖ్యమైన పురస్కారాలుమూస:Indented plainlist
సంతకం

కార్ల్ గుస్తావ్ జంగ్ (1875 జులై 26 - 1961 జూన్ 6) ఒక స్విస్ మానసిక వైద్యుడు, మానసిక విశ్లేషకుడు. విశ్లేషణాత్మక మానసిక శాస్త్రానికి (అనలిటికల్ సైకాలజీ) ఆద్యుడు.

ఈయన పరిశోధనలు మానసిక శాస్త్రం, మానవ పరిణామ శాస్త్రం, పురావస్తు శాస్త్రం, సాహిత్యం, తత్వశాస్త్రం, మానసిక విశ్లేషణ, ధార్మిక శాస్త్రాలు మొదలైన వాటిమీద ప్రభావం చూపాయి.[1] ఈయన జ్యురిక్ లోని బుర్గోజ్లీ సైకాలజీ ఆసుపత్రిలో యూజీన్ బ్లూలర్ దగ్గర వైద్యుడిగా పనిచేశాడు. మానసిక విశ్లేషణకు ఆద్యుడిగా పిలవబడే సిగ్మండ్ ఫ్రాయిడ్ తో స్నేహం చేసి అతనితో మానసిక శాస్త్రం మీద సుదీర్ఘ కాలం పాటు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు. తర్వాత తనకంటూ ప్రత్యేకమైన పరిశోధన చేసి ప్రభావవంతమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. చరిత్రలో ముఖ్యమైన మానసిక విశ్లేషకులలో ఒకడిగా ఈయనకు పేరుంది.[2][3]

ఫ్రాయిడ్ తనకన్నా చిన్నవాడైన జంగ్ ను తాను ప్రారంభించిన సరికొత్త మనో వైజ్ఞానిక శాస్త్రాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళే వారసుడిగా అనుకున్నాడు. ఫ్రాయిడ్, ఇంకా అతని సమకాలికులు యూదులు. తమ పరిశోధనల వల్ల వారు ఐరోపాలో వివక్ష ఎదుర్కొన్నారు. జంగ్ క్రైస్తవుడు కాబట్టి అతని ద్వారా తమ పరిశోధనలకు చట్టబద్ధతను నిరూపించుకోవాలనుకున్నాడు. ఫ్రాయిడ్ కొత్తగా స్థాపించిన ఇంటర్నేషనల్ సైకోఅనలిటికల్ అసోసియేషన్ కు జంగ్ ను అధ్యక్షుడిగా నియమించాడు. కానీ జంగ్ పరిశోధనలు, వ్యక్తిగత దూరదృష్టి ఫ్రాయిడ్ ఆలోచనలను అనుసరించలేక వారి దారులు వేరయ్యాయి. జంగ్ కి కూడా ఈ ఎడబాటు కష్టంగా అనిపించినా ఫ్రాయిడ్ సిద్ధాంతీకరించిన సైకోఅనాలిసిస్ కాకుండా అనలిటికల్ సైకాలజీ అనే మరో పేరుతో మరింత విస్తృతమైన రంగానికి ఆద్యుడు అయ్యాడు.

జీవితం[మార్చు]

కార్ల్ గుస్తావ్ జంగ్ 1875 జులై 26 న స్విట్జర్లాండ్ లోని తుర్గోవియా ప్రాంతంలోని కెస్విల్ లో ఒక సాంప్రదాయ ప్రొటెస్టెంట్ క్రైస్తవ కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి పాల్ అకిలెస్ జంగ్, తల్లి ఎమిలీ ప్రీస్వెర్క్. ఈయనకంటే ముందు ఈ దంపతులకు ముగ్గురు శిశువులు పుట్టిన వెంటనే మరణించారు. పాల్ జంగ్ తండ్రి పేరు కూడా కార్ల్ గుస్తావ్ జంగ్. ఈయన అప్పట్లో బేసెల్ లో పేరు పొందిన జర్మన్-స్విస్ వైద్యశాస్త్ర ఆచార్యుడు. తన తండ్రి నియంతృత్వ విధానాలకు అప్పుడప్పుడూ ఎదురు తిరిగినా ఆయన మత విశ్వాసాలను మాత్రం ఎప్పుడూ ప్రశ్నించలేదు. యువకుడిగా ఉన్నపుడు భాషా శాస్త్రంతో పాటు విజ్ఞానశాస్త్ర అంశాలకు ఎక్కువగా ఇష్టపడేవాడు. వైద్యం చేయడం అతనికి వారసత్వంగా సంక్రమించింది. తండ్రి కోరిక మేరకు బేసెల్ విశ్వవిద్యాలయంలో వైద్యవిద్యలో చేరాడు. ఇదే విశ్వవిద్యాలయంలో అతని తాత ఆచార్యుడిగా పనిచేశాడు. ఓ పక్క చదువుకుంటూనే మరో పక్క ఆధ్యాత్మిక అన్వేషణ చేస్తూ ఉండేవాడు. డాక్టరేటు కోసం రహస్య తంత్ర విద్యా పరిణామంపై భౌతిక, మానసిక విశ్లేషణ అనే అంశంపై పరిశోధనలు చేశాడు. గుప్త తాంత్రిక విద్యలపైన ఆయన ఆసక్తి కడదాకా కొనసాగింది.

పర్యటనలు[మార్చు]

1937 డిసెంబరు లో కార్ల్ జంగ్ ఫౌలర్ మెక్‌కార్మిక్ తో కలిసి భారతదేశ పర్యటనకు బయలు దేరాడు. అంతకు మునుపు ఎన్నో దేశాలు పర్యటించినా ఇక్కడి సంస్కృతి మాత్రం ఆయనకు మొదటిసారిగా కొత్తదేశపు అనుభూతి కలిగించింది. ఆఫ్రికా లాంటి దేశాల్లో భాషా సమస్యల వలన ఎక్కువగా మాట్లాడే అవకాశం లేకపోయింది కానీ భారత్ లో మాత్రం చాలా విస్తృతంగా చర్చలు జరిపాడు. హిందూ తత్వం ఆయన పరిశోధనల్లో భాగమైంది. రమణ మహర్షిని గురించి అధ్యయనం చేశాడు కానీ ఆయనను కలుసుకోలేదు. రమణ మహర్షిని తనను తాను ఎరిగిన వాడిగా ప్రశంసించాడు. భారతదేశంలో తాను జరిపిన సంభాషణల గురించి తన పుస్తకాల్లో రాశాడు.[4]

మూలాలు[మార్చు]

  1. Darowski, Emily; Darowski, Joseph (1 June 2016). "Carl Jung's Historic Place in Psychology and Continuing Influence in Narrative Studies and American Popular Culture". Swiss American Historical Society Review. 52 (2). ISSN 0883-4814.
  2. "Carl Jung - One of the Most Influential Psychiatrists of All Time". 26 July 2022.
  3. Corbett, Sara (2009-09-16). "The Holy Grail of the Unconscious". The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0362-4331. Retrieved 2023-07-05.
  4. "When I visited the ancient pagoda at Turukalukundram [sic], southern India, a local pundit explained to me that the old temples were purposely covered on the outside, from top to bottom, with obscene sculptures, in order to remind ordinary people of their sexuality. The spirit, he said, was a great danger, because Yama, the god of death, would instantly carry off these people (the "imperfecti") if they trod the spiritual path directly, without preparation. The erotic sculptures were meant to remind them of their dharma (law), which bids them fulfill their ordinary lives. Only when they have fulfilled their dharma can they tread the spiritual path. The obscenities were intended to arouse the erotic curiosity of visitors to the temples, so that they should not forget their dharma; otherwise they would not fulfill it. Only the man who was qualified by his karma (the fate earned through works in previous existences), and who was destined for the life of the spirit, could ignore this injunction with impunity, for to him these obscenities mean nothing. That was also why the two seductresses stood at the entrance of the temple, luring the people to fulfill their dharma, because only in this way could the ordinary man attain to higher spiritual development. And since the temple represented the whole world, all human activities were portrayed in it; and because most people are always thinking of sex anyway, the great majority of the temple sculptures were of an erotic nature. For this reason too, he said, the lingam (phallus) stands in the sacred cavity of the adyton (Holy of Holies), in the garbha griha (house of the womb). This pundit was a Tantrist (scholastic; tantra = 'book')." -- C. G. Jung, from Segal, Rober A. (1992). The Gnostic Jung. New Jersey: Princeton University Press. p. 86. ISBN 978-0-691-01923-9.