స్వర్ణపుష్పం
రకం | మాసపత్రిక |
---|---|
యాజమాన్యం | మక్కపాటి మంగళ |
ప్రచురణకర్త | మక్కపాటి మంగళ |
సంపాదకులు | మక్కపాటి మంగళ |
Staff writers | రమాదేవి కులకర్ణి, ఎం పూజిత రావు- సహ సంపాదకుడు |
స్థాపించినది | 2012 |
కేంద్రం | హైదరాబాద్ |
ISSN | 2394-2193 |
జాలస్థలి | https://swarnapushpammonthly.blogspot.in// |
స్వర్ణపుష్పం 2012లో ప్రారంభించబడిన తెలుగు మాసపత్రిక. ఈ ప్రతిక సంస్థాపక ముఖ్య సంపాదకులు, ప్రచురణకర్త మక్కపాటి మంగళ. ఈ మాసపత్రిక యొక్క ఐఎస్ఎస్ఎన్ నెంబర్ ISSN 2394-2193[1].
శీర్షికలు-అంశాలు
[మార్చు]ఈ పత్రికలోని రచనలు తెలుగు భాషను, సంస్కృతిని సుసంపన్నం చేసే కోణంలో ఉంటాయి. ఇందులో ప్రధానంగా కథలు కథానికలు, కవితలు, పాటలు, సామాజిక స్పందనలు, స్థల చరిత్రలు, మన సంప్రదాయాలు, మన దేవాలయాలు, యక్ష ప్రశ్నలు, మన చరిత్ర, గృహదేవత, స్వర్ణ చిత్ర సినిమా కబుర్లు, మన వీరులు, చరిత్రకు తెలియని కవి, పరిశోధక వ్యాసాలు, పండుగలు, జాతీయ దినోత్సవాలు, సూక్తులు, మన ఆటలు, గ్రహం అనుగ్రహం, రాశి ఫలితాలు, మొదలైన శీర్షికలతో మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతూ మానవజాతి ఘనతను చాటి చెపుతూ "భాష, సాహిత్యం, సంస్కృతి, చరిత్ర, రాజకీయ సామాజిక", అంశాలతో కూడిన వ్యాసాలతో ప్రతి నెల పాఠకుల ముందుకు వస్తుంది. ఈ మాసపత్రికకు ఎందరో భాషాభిమానులు, విశ్వవిద్యాలయ ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు, భాషా పండితులు, విలువైన వ్యాసాలు రాస్తూ ఈ పత్రికను ముందుకు నడిపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని విశ్వవిద్యాలయాల తెలుగు శాఖలు స్వర్ణపుష్పం మాసపత్రికను పరిశోధన మాసపత్రికగా గుర్తించాయి.
ప్రధాన సంపాదకులు
[మార్చు]- డాక్టర్ మంగళ మక్కపాటి
సంపాదకులు
[మార్చు]- రమాదేవి కులకర్ణి
- ఎం పూజిత రావు
గౌరవ సలహాదారులు
[మార్చు]- చుక్కా రామయ్య, మాజీ ఎమ్ ఎల్ సి, విద్యావేత్త
- ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి - జాతీయ సాహిత్య పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు
- కె రామాచారి గాయకులు - సంగీత దర్శకులు
- డాక్టర్ కావూరి శ్రీనివాస్ - విద్వన్మణి, కవి, శాసన పరిశోధకులు.
- న్యాయ సలహాదారులు - గోపాలకృష్ణ కళానిధి
- మార్కెటింగ్ - సద్గురు మార్కెటింగ్
- ప్రతినిధులు - మూర్తి శ్రీదేవ, వి. సంపత్ కుమార్, జె.శ్రీనివాస మూర్తి, వై. సత్యం, ఎం.మధుసూదన శర్మ, బి.అశోక్ కుమార్.
బాహ్య లింకులు
[మార్చు]- ఐఎస్ఎస్ఎన్ {ISSN} వారి వెబ్సైట్లో స్వర్ణపుష్పం మాసపత్రిక ఐఎస్ఎస్ఎన్ వివరాలు
- స్వర్ణపుష్పం మాసపత్రిక వెబ్సైటు[permanent dead link]
- స్వర్ణపుష్పం మాసపత్రిక పేస్ బుక్ పేజి
మూలాలు
[మార్చు]- ↑ ఐఎస్ఎస్ఎన్ {ISSN} వారి వెబ్సైట్లో స్వర్ణపుష్పం మాసపత్రిక ఐఎస్ఎస్ఎన్ వివరాలు