చుక్కా రామయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చుక్కా రామయ్య
Chukka ramayya.jpg
చుక్కా రామయ్య
జననం చుక్కా రామయ్య
20 నవంబర్ 1925
ఇతర పేర్లు ఐ.ఐ.టి రామయ్య
వృత్తి మాజీ శాసన మండలి సభ్యులు
ప్రసిద్ధి ఐ.ఐ.టి.రామయ్య
మతం హిందూ మతము
భార్య / భర్త లక్ష్మీబాయి
తండ్రి అనంత రామయ్య
తల్లి నరసమ్మ,

చుక్కా రామయ్య తెలంగాణకు చెందిన ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు, శాసనండలి సభ్యుడు. ఈయన 1925, నవంబర్ 20 న జనగామ జిల్లా, పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రుల పేర్లు నరసమ్మ, అనంత రామయ్య. రామయ్య పద్నాలుగేళ్ళ వయసులో ఉండగా తండ్రి మరణించాడు. ఈయన ఐఐటి కోచింగ్ లో ప్రసిద్దులు. నల్లకుంటలో శిక్షణా కేంద్రం ఉంది.

బాల్యం, విద్య, ఉద్యోగం[మార్చు]

రామయ్య తన స్వస్థలమైన గూడూరులో మూడవ తరగతి వరకూ చదివాడు. డిగ్రీ, మరియు ఎం.ఎస్.సి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తిచేసాడు. హైదరాబాదు సంస్థానంలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాడు. నిజాముకు,రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళాడు.

వరంగల్ జిల్లా జనగాంలో ఉపాధ్యాయుడిగా చేరి తెలంగాణ లోని అనేక పాఠశాలల్లో పనిచేసాడు. 1983 లో నాగార్జున సాగర్ లోని రెసిడెన్షియల్ కళాశాల ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేసాడు. ఉద్యోగంలో ఉండగా ఉపాధ్యాయ సంఘాల్లో చురుగ్గా ఉండేవాడు.

’ఐఐటీ’ రామయ్య[మార్చు]

1983 లో పదవీ విరమణ తరువాత ప్రభుత్వంచే ఆమోదించబడిన పింఛను, ఇతర ఫలాలు ఆయనకు రాలేదు. దీనివలన ఆయన జీవనభృతికి మార్గములు చూసుకొనవలసి వచ్చింది.

నిర్మల్ జిల్లా, బాసర లోని సరస్వతి ఆలయానికి వెళ్ళి భవిష్యత్తు ఆలోచిస్తూ ఒక వారం పాటు ఉన్నాడు. తిరిగి ప్రయివేటుగా ఉపాధ్యాయ వృత్తినే కొనసాగించాలని అక్కడే నిర్ణయం తీసుకున్నాడు. విరమణానంతరం సాధించిన తన విజయాలను ఆయన బాసర సరస్వతీదేవి ఆలయానికి ఆపాదిస్తాడు.

హైదరాబాదు, నల్లకుంటలో స్థిరపడి, ఐ.ఐ.టి జె.ఇ.ఇ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు గణితము బోధించడం మొదలుపెట్టాడు. ఆ విద్యార్థులు ప్రవేశపరీక్షలో చక్కటి విజయాలను సాధించడంతో ఆయన చాలా ప్రఖ్యాతి పొందాడు. చుక్కా రామయ్య విద్యా సంస్థ బాగా వృద్ధి చెందింది. ఈ సంస్థ నుండి వేలాదిగా విద్యార్థులు ఐ.ఐ.టిలలో ప్రవేశించారు. రామయ్య ఇన్‌స్టిట్యూట్ లో చేరేందుకు ఒక ప్రవేశ పరీక్ష నిర్వహించడం మొదలుపెట్టారు. ఆ పరీక్ష కోసం శికణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా సంస్థలు కూడా స్థాపింబడ్డాయి. ఐఐటీ ప్రవేశ పరీక్షలో తన సంస్థ సాధించిన విజయాల కారణంగా చుక్కా రామయ్య, ’’ఐఐటి రామయ్య’’గా ప్రసిద్ధి చెందాడు.

భారత ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు ఐఐటిని మంజూరు చేసినపుడు చుక్కా రామయ్య దాన్ని బాసరలో స్థాపించాలని కోరి దానికై తీవ్ర ప్రయత్నం చేసాడు. అయితే వివిధ సౌకర్యాల రీత్యా ప్రభుత్వం దాన్ని హైదరాబాదులో నెలకొల్పింది.

ఇతర వ్యాపకాలు[మార్చు]

విద్యా విషయకంగా రామయ్య అనేక పుస్తకాలను రచించాడు. 2007 లో ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్ధిస్తూ ఉద్యమించాడు.

రచనలు[మార్చు]

 • చిన్న పాఠం
 • దేశదేశాల్లో విద్య
 • బడిపంతుళ్ళకు రాజకీయాలా?
 • చదువుల తోవ
 • చదువులో సగం
 • చిట్టి చేతులు (వ్యాస సంపుటి)
 • దర్యాప్తు
 • ఈ మట్టి రుణం తీర్చుకుంటా
 • నడక
 • జ్ఞాన లోగిళ్ళు
 • ఇంటి భాష (వ్యాస సంపుటి)
 • మరో పాఠం
 • సకల
 • లెక్కలతో నా ప్రయోగాలు
 • మన చదువులు
 • ప్రాథమికం
 • లాఠీ ఛార్జ్
 • ప్రపంచీకరణ - విద్య
 • రామయ్య జ్ఞాపకాలు
 • సమత్వం ప్రతిభ
 • సంక్షేమ విద్య
 • సంవాదం
 • తరగతి

సూచికలు[మార్చు]

యితర లింకులు[మార్చు]