ఉస్మానియా విశ్వవిద్యాలయం
![]() | |
| రకం | ప్రభుత్వ |
|---|---|
| స్థాపితం | 1918 |
| వైస్ ఛాన్సలర్ | ప్రొ. కుమార్ మొగ్లారం |
| చిరునామా | ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు, తెలంగాణ - 500 007 భారతదేశం, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం |
| ప్రాంగణం | పట్టణ |
| జాలగూడు | www.osmania.ac.in |
| NAAC ద్వారా ఐదు నక్షత్రాల నాణ్యత గుర్తింపు పొందినది | |
ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని ప్రధాన విశ్వవిద్యాలయం. దీని విస్తీర్ణం 3.90 హెక్టారులు.[1] ఈ విశ్వవిద్యాలయం పరిధిని 2011 భారత జనాభా గణాంకాలలో ఒక జనగణన పట్టణంగా గుర్తించింది.[2][3] ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ 7వ నిజాం ఫత్ జంగ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆసఫ్ జా VII చే 1917లో స్థాపించబడింది. దీని స్థాపనకు సంబంధించిన ఫర్మానాను 1917, ఏప్రిల్ 26న జారీ చేశారు. హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.2011 జనగణన సమాచారం ప్రకారం ఉస్మానియా విశ్వవిద్యాలయం గ్రామ లొకేషన్ కోడ్ లేదా గ్రామం కోడ్ 573968. ఉస్మానియా విశ్వవిద్యాలయం గ్రామం భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ జిల్లాకు చెందిన ముషీరాబాద్ తహసీల్‌లో ఉంది. ముషీరాబాద్ అన్ని ప్రధాన ఆర్థిక కార్యకలాపాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం గ్రామానికి సమీప పట్టణం.
ఎందరో విద్యావేత్తలను, శాస్త్రవేత్తలను, మేధావులను రూపొందించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగునాట ఏర్పాటుచేసిన ప్రప్రథమ విశ్వవిద్యాలయం.[4] హైదరాబాదులోని ప్రస్తుత ఆబిడ్స్ ప్రాంతంలో ఒక అద్దె భవనంలో తరగతులు ప్రారంభించగా, 1939లో ప్రస్తుత ఆర్ట్స్ కళాశాల భవనం నిర్మించబడింది. 1919లో కేవలం ఇంటర్మీడియట్ తరగతులతో ప్రారంభమవగా, 1921 నాటికి డిగ్రీ, 1923 నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమయంలో ఉర్దూ బోధనా భాషగా ఉండగా, స్వాతంత్ర్యానంతరం 1948 నుంచి ఆంగ్లం బోధనా భాషగా మారింది.
హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల భవనం భారతదేశంలో ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ పొందిన మూడవ నిర్మాణంగా నిలిచింది.[5]
చరిత్ర
[మార్చు]
ఆర్ట్స్ కళాశాల భవనం
నిజాం పరిపాలన కాలంలో హైదరాబాదులో స్థాపించిన కొన్ని కళాశాలలు రాజ కుటుంబీకులకు, సంపన్న వర్గాలకు మాత్రమే అందుబాటులో వుండేవి. ఉన్నత విద్యను అన్ని సామాజిక వర్గాలకు అందించాలనే ఉద్దేశంతో బ్రిటిష్ ప్రభుత్వం 1913 లో తమ పాలనలో వున్న ప్రాంతాలలోనే గాక సంస్థానాలలో కూడా విశ్వవిద్యాలయాలను స్థాపించాలని తీర్మానించింది. ఆవిధంగా పాట్నా, బనారస్, మైసూరు, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు స్థాపించ బడ్డాయి. ఆబిడ్స్ గన్‌ఫౌండ్రి దగ్గర తరగతులు ప్రారంభమయ్యాయి.[6] భారతదేశంలో ఉన్నత విద్యాప్రాప్తిలో ఉస్మానియా విశ్వవిద్యాలయం 7వ ప్రాచీన సంస్థగా, దక్షిణ భారతావనిలో 3వ సంస్థగా పేరుగాంచింది. ఇది హైదారాబాదు సంస్థానంలో స్థాపించబడిన మొట్టమొదటి విద్యాసంస్థ. తన తొమ్మిది దశాబ్దాల చరిత్రలో ఈ విశ్వవిద్యాలయము అన్ని విభాగాలలోనూ మంచి పురోగతి సాధించింది.
ఇక్కడ ఉర్దూ ప్రథమ భాషగా మాద్యమంగా ప్రవేశ పెట్టి బ్యూరో ఆఫ్ ట్రాన్స్‍లేషన్ ను ఏర్పాటు చేసారు. మొదట గన్ ఫౌండ్రీ ప్రాంతంలో 25 మంది సిబ్బంది, 225 విద్యార్థులతో ఇంటర్మీడియట్ సాయంకాలం కోర్సులతో ప్రారంభించి క్రమంగా 1921 లో బి.ఏ, 1923 లో ఎం.ఎ.ఎల్.ఎల్.బి 1927 లో మెడిసిన్, 1929 లో ఇంజనీరింగు కోర్సులనూ ప్రవేశ పెట్టారు. అయితే నగరంలో వివిధ ప్రాంతాలలో వున్న కళాశాలలను పరిపాలనా సౌలభ్యం కొరకు ఒకే ప్రాంతంలో వుంటే బాగుంటుందని సంకల్పించి, తార్నాక ప్రాంతంలో 2400 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుత కాంపస్ ను ఏర్పాటు చేసారు.
భవనాల నిర్మాణానికి ఆర్కిటెక్ లుగా సయ్యద్ అలీ, రజా, నవాబ్ జయంత్ సింగ్ బహదూర్ లను నిమమించారు. వారు అమెరికాలోని కాలిఫోర్నియా స్టాన్‍ఫోర్డ్, హార్వర్డ్, కొలంబియా, బ్రిటన్ లోని ఆక్స్ పర్డ్, కేంబ్రిడ్జ్ మొదలైన విశ్వవిద్యాలయాలను సందర్శించి వచ్చారు. బెల్జియానికి చెందిన ఇ.జస్సార్ ను సలహాదారుగా నియమించి లా, ఇంజరీరింగ్, ఆర్ట్స్ కళాశాల లైబ్రరి, సెనేట్ హాలు వంటి భవనాలను నిర్మించారు. ఆర్ట్స్ కాలేజి భవనానికి 1923 జూలై 5న పునాదులు వేసి, 1939 డిసెంబరు నాల్గవ తేదీన పూర్తి చేసారు. అదే రోజున హైదరాబాదు నిజాము దీనిని ప్రారంబించాడు. నైజాంలో విద్యాశాఖ మంత్రిగా ఉండిన అక్బర్ హైదర్ చాన్సెలర్ గా, నవాబ్ మెహదీయార్ జంగ్ బహదూర్ వైస్ ఛాన్సెలర్ గా నియమితులయ్యారు. 1949 లో హైదరాబాదు రాష్ట్రం భారతదేశంలో విలీనం కావడంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అప్పటి వరకు ఉన్న ఉర్దూ మాధ్యమాన్ని రద్దు చేసి ఆంగ్లమాద్యమాన్ని ప్రవేశ పెట్టారు. ఇస్లాం యూనివర్సిటీగా నామకరణం చేయాలని మొదట్లో వచ్చిన ప్రతి పాదనను కాదని ఉస్మానియా యూనివర్సిటీగా పేరు పెట్టారు. ఇండియా టుడే పత్రిక మన దేశంలో వున్న 160 యూనివర్సిటీలపై సర్వే నిర్వహించగా 2010 వ సంవత్సరంలో 10వ స్థానం, 2011లో 7వ స్థానం, 2012 లో ఆరవ స్థానం లభించింది. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీలలో ఉస్మానియా విశ్వవిద్యాలయం మొదటి స్థానంలో నిలిచింది.
స్నాతకోత్సవం
[మార్చు]
2019, జూన్ 17న 80వ స్నాతకోత్సవం జరిగింది. స్నాతకోత్సవానికి అప్పటి గవర్నర్ ఈ.ఎస్.ఎల్.నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరై 292 మందికి బంగారు పతకాలు, 700 మందికిపైగా అభ్యర్థులకు పీహెచ్‌డీ పట్టాలను ప్రదానం చేశారు.[7][8] 1917 నుండి ఇప్పటివరకు 47మందికి గౌరవ డాక్టరేట్లు అందజేయబడ్డాయి.[9]
ప్రతిష్ఠ , బోధించే విషయాలు
[మార్చు]1,600 ఎకరాల (6 చ.కి.మీ.) సువిశాల ప్రాంగణంతో, అద్భుత నిర్మాణ శైలికి ఆలవాలమైన భవంతులతో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని దేశంలోనే అతి పెద్ద ఉన్నత విద్యాసంస్థలకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక్కడి భూగోళ శాస్త్ర విభాగం దక్షిణ భారతావనిలోనే పురాతనమైనది, పెద్దది. ఇది 1942 లో స్థాపించబడింది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ
[మార్చు]ఆర్ట్స్ కళాశాలలో తెలుగు శాఖ చాలా ముఖ్యమైన శాఖ. ఎందుకంటే ఈ కళాశాలలో తెలుగులో బోధించే ఎకైక శాఖ. తెలుగు భాష ఔనత్యాన్ని కాపాడటంలో తనవంతు సహకారాన్ని అందిస్తున్న శాఖ. ఈ శాఖ స్నాతకోత్తర విద్య (ఎం.ఏ) ను అందించడంతో పాటు తెలుగు భాష పై పరిశోధన (పీ.హెచ్.డి) లను అందిస్తుంది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం సంస్కృత విభాగం
[మార్చు]ఈ శాఖ స్నాతకోత్తర విద్య (ఎం.ఏ) ను అందించడంతో పాటు ఎం. ఫిల్, పీహెచ్.డి డిగ్రీ లను అందిస్తుంది.[10]
- వీటితోపాటు ఎన్నో సుందరమైన ఉద్యానవనాలు , క్రీడ ప్రాంగణాలు , అద్భుతమైన లెక్చర్ హాల్స్ , ఇండోర్ అవుట్ డోర్ ఆడిటోరియం లు ఉన్నాయి .
తెలంగాణ ఉద్యమంలో పాత్ర
[మార్చు]ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమైన కేంద్రంగా నిలిచింది. విశ్వవిద్యాలయ విద్యార్థులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌కు మద్దతుగా నిరసనలు, సమ్మెలు, సభలు, ర్యాలీలలో పాల్గొన్నారు. Osmania University యొక్క స్వీయ అధ్యయన నివేదిక (SSR) ప్రకారం, విశ్వవిద్యాలయ విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో సక్రియ పాత్ర పోషించి, ప్రత్యేక రాష్ట్ర సాధనకు దోహదపడ్డారు.[11]
1969 తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనలను విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో క్యాంపస్ రాజకీయ చైతన్యానికి ప్రధాన వేదికగా మారింది. OU centenary కార్యక్రమానికి సంబంధించిన press note లో Arts College ను “the epicenter of the Telangana agitation” అని పేర్కొన్నారు.[12]
1968 చివరలో ప్రారంభమైన ఆందోళనలు 1969లో ఉధృతమయ్యాయి. విద్యార్థి ఉద్యమం మొదట తెలంగాణ safeguards అమలు కోరినప్పటికీ, తరువాత అది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌గా బలపడింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, వారి సంఘాలు ప్రముఖ పాత్ర పోషించారు.[13]
ఈ విధంగా, ఉస్మానియా యూనివర్సిటీని తెలంగాణ ఉద్యమ చరిత్రలో విద్యార్థి రాజకీయ చైతన్యానికి, ప్రజా ఉద్యమానికి ఒక ముఖ్య కేంద్రంగా పరిగణిస్తారు.
భవనాలు
[మార్చు]సెంటెనరీ (శతాబ్ది) పరిపాలనా భవనం
[మార్చు]15 ఎకరాల విస్తీర్ణంలో 33.75 కోట్ల రూపాయలతో జీ ప్లస్ టు అంతస్తులతో నిర్మించనున్న పరిపాలనా భవనానికి 2022 డిసెంబరు 7న శంకుస్థాపన జరిగింది. 123 గదులతో 1,08,020 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యున్నతమైన సకల సౌకర్యాలతో, అందరికీ అందుబాటులో ఉండేలా దీనిని నిర్మిస్తున్నారు. 1960లో నిర్మించిన పరిపాలనా భవనం మరమ్మతుల కోసం అధిక మొత్తంలో నిధులు వెచ్చించాల్సివస్తుండడంతో నూతన పరిపాలనా భవనాన్ని నిర్మిస్తున్నారు.[14][15]
సబ్ క్యాంపస్ లు
[మార్చు]- సికింద్రాబాద్ పీజీ కాలేజ్
- సైఫాబాద్ సైన్స్ కాలేజ్
- నిజాం కాలేజ్
ఇవన్నీ వర్సిటీ సబ్ క్యాంపస్ లు ఇవన్నీ ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోనే ఉన్నాయి.. [16]
చెప్పుకోదగిన పూర్వవిద్యార్ధులు
[మార్చు]ఉస్మానియా వర్సిటీ విద్యార్థి ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన అప్పటి విద్యార్థి నాయకులు, విద్యార్థులు రాజకీయాల్లోనూ తమదైన ముద్ర వేశారు. వారిలో ప్రథముడు పీవీ నరసింహారావు. బీ హాస్టల్ నుంచి ప్రారంభమైన వందేమాతరం ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా దేశానికే ప్రధానిగా సేవలు అందించారు.
- సీహెచ్ విద్యాసాగరరావు (మహారాష్ట్ర గవర్నర్ )
- మహమ్మద్ రజీ-ఉద్దిన్ సిద్దిఖీ. గణిత శాస్త్రవేత్త, నోబెల్ బహుమతికి నామిని చేయబడినవారు.
- పి.వి.నరసింహారావు, పూర్వ భారతదేశ ప్రధానమంత్రి.
- సయ్యద్ అలీ మొహమ్మద్ ఖుస్రో, ఆర్థికవేత్త, మాజీ జర్మనీ రాయబారి
- హరూన్ సిద్ధిఖీ, కెనడాలో భారత పాత్రికేయుడు
- కొమిరెడ్డి రాములు - జర్నలిస్టు, మాజీ ఎమ్మెల్యే
- ఆచార్య అఫ్జల్ మొహమ్మద్ ఉపసంచాలకుడు, బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము, హైదరాబాదు
- శ్యాం బెనగళ్, భారతీయ సినిమా దర్శకుడు
- హర్ష భోగ్లే, క్రికెట్ వ్యాఖ్యాత
- వరవరరావు, విప్లవ కవి
- జైపాల్ రెడ్డి, కాంగ్రెస్
- కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి
- గుంటుపల్లి కల్పలత, ఛాతీవైద్యురాలు. అమెరికా ఛాతీవైద్యుల సంఘం అధ్యక్షురాలు.
- అసదుద్దీన్ ఒవైసీ, రాజకీయుడు, భారత పార్లమెంటు సభ్యుడు.
- ఆనంద శంకర్ జయంత్, భరతనాట్య, కూచిపూడి నృత్య కళాకారిణి. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
- మామిడాల రాములు, మెకానికల్ ఇంజనీరింగ్ ఆచార్యుడు, వాషింగ్టన్ విశ్వవిద్యాలయం.
- సంజీవ్ సిద్ధు, సాఫ్ట్వేర్ రంగ నిపుణుడు. o9 సొల్యూషన్స్, i2 టెక్నాలజీ సంస్థల వ్యవస్థాపకుడు.
- త్యాగరాజు, చలనచిత్ర నటుడు.
- జస్టిస్ సర్దార్ అలీ ఖాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రధాన న్యాయమూర్తి.
- సయ్యద్ అబ్దుల్ రహీమ్, భారతీయ ఫుట్‌బాల్ కోచ్, ఆటగాడు.
- బి. సుదర్శన్ రెడ్డి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి
- మొలుగరం కుమార్,వైస్ ఛాన్సలర్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్
- వెలుదండ నిత్యానందరావు వైస్ ఛాన్సలర్ తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్
- సి.వి.ఆనంద్ ఐపీఎస్ అధికారి.తెలంగాణ క్యాడర్ ప్రస్తుత సైబరాబాద్ పోలీసు కమిషనర్
- ఆచార్య వై ఎల్ శ్రీనివాస్ వైస్ ఛాన్సలర్ సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ములుగు తెలంగాణ
అనుబంధంగా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలు
[మార్చు]- ఉస్మానియా విశ్వవిద్యాలయము ఇంజనీరింగ్ కళాశాల. (స్థా. 1929)
- ఉస్మానియా విశ్వవిద్యాలయ సాంకేతిక కళాశాల
- చైతన్యభారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - (స్తా.1979) (http://cbit.ac.in Archived 2007-12-21 at the Wayback Machine)
- వాసవీ ఇంజనీరింగ్ కళాశాల - (స్తా.1981) (http://www.vce.ac.in)
- విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాల
- ముఫకమ్ ఝా ఇంజనీరింగ్
- సాంకేతిక కళాశాల - (స్తా.1979) (http://mjcollege.ac.in)
- ఎం.వి.ఎస్.ఆర్ ఇంజనీరింగ్ కళాశాల - (స్తా. 1980) (http://www.mvsrec.ac.in/ Archived 2006-10-04 at the Wayback Machine)
- డెక్కన్ ఇంజనీరింగ్ కళాశాల- (స్తా.-1982)
అనుబంధంగా ఉన్న డిగ్రీ కళాశాలలు
[మార్చు]- సర్దార్ పటేల్ కళాశాల, సికిందరాబాదు
- ఆంధ్ర విద్యాలయ కళాశాల, లిబర్టీ, హైదరాబాదు
- ప్రగతి కళాశాల, కోఠి, హైదరాబాదు
ఇతర వివరాలు
[మార్చు]ఉస్మానియి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఉస్మానియా విశ్వవిద్యాలయ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతోంది.
కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయబడిన విద్యార్థినీ విద్యార్థులకు స్కాలర్షిప్స్ తో పాటు రొండు సంవత్సరాల వసతి సదుపాయం కూడా కల్పిస్తారు .
ఐఎస్‌వో గుర్తింపు
[మార్చు]ఆయా విభాగాల్లో అత్యుత్తమ విధానాలు, కార్యకలాపాలు, మౌలిక వసతుల విభాగాలలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ప్రతిష్ఠాత్మక ఐఎస్‌వో ధ్రువీకరణ లభించింది. హెచ్‌వైఎం ఎండీ ఆలపాటి శివయ్య నేతృత్వంలోని బృందాలు 53 విభాగాలు, వివిధ పరిశోధనా కేంద్రాలు, కార్యాలయాల్లో విస్తృతంగా పర్యటించి, ఆడిట్ నిర్వహించగా విద్య, పరిపాలన, పర్యావరణ సుస్థిరత, నాణ్యతా ప్రమాణాల్లో శ్రేష్ఠతను కనబరిచి అంతర్జాతీయ గుర్తింపు దక్కించుకుంది.[17] ఎనర్జీ ఆడిట్-ఐఎస్‌వో 50001:2018, పచ్చదనం, పర్యావరణం ఆడిట్-ఐఎస్‌వో 14001:2015, నాణ్యతా ప్రమాణాలు- ఐఎస్‌వో 9001:2015, అకాడమిక్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆడిట్, జెండర్ సెన్సిటైజేషన్ విభాగాల్లో ఐఎస్‌వో గుర్తింపు ధ్రువీకరణ సర్టిఫికెట్‌ను విశ్వవిద్యాలయ అధికారులు హెచ్‌వైఎం ఎండీ నుంచి స్వీకరించారు.[18]
చిత్రాలు
[మార్చు]
ఇవి కూడా చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Osmania University (Hyderabad, Telangana, India) - Population Statistics, Charts, Map, Location, Weather and Web Information". www.citypopulation.de. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-12-16.
- ↑ https://web.archive.org/web/20040616075334/http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999
- ↑ "Osmania University Population, Caste Data Hyderabad Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in ఇంగ్లీష్). the original నుండి 2022-12-16 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-12-16.
- ↑ ఆదాబ్ హైదరాబాద్, మల్లాది కృష్ణానంద్ రచన, ద్వితీయ ముద్రణ అక్టోబరు 2008, పేజీ సంఖ్య 70
- ↑ "Osmania University Arts College becomes the 3rd registered trademarked building in India" (in Indian English). The Hindu. 20 April 2025. the original నుండి 21 April 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 April 2025.
- ↑ Morampudi, Satish. "ఉస్మానియా...వందేళ్ళ చరిత్ర". eVaarthalu (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-12-16.[permanent dead link]
- ↑ ఈనాడు, ప్రధాన వార్తలు (18 June 2019). "ఇక ఏటా స్నాతకోత్సవం". the original నుండి 18 June 2019 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 June 2019.
- ↑ నమస్తే తెలంగాణ, తాజా వార్తలు (17 June 2019). "ఓయూలో 80వ స్నాతకోత్సవం వేడుకలు.. హాజరైన గవర్నర్". the original నుండి 18 June 2019 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 June 2019.
- ↑ ఈనాడు, ప్రధానాంశాలు (17 June 2019). "80 స్నాతకోత్సవాలు..47 గౌరవ డాక్టరేట్లు". the original నుండి 18 June 2019 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 June 2019.
- ↑ Sakshi (22 May 2021). "TS: పది యూనివర్సిటీలకు వీసీలను నియమించిన ప్రభుత్వం". Sakshi. ఒరిజినల్ నుండి 27 మే 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 May 2021.
- ↑ "Self Study Report, Osmania University" (PDF). Osmania University. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 March 2026.
- ↑ "OU Centenary Run - a huge success (Press Note)" (PDF). Osmania University. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 March 2026.
- ↑ "Role of students in Telangana Movement". Government/CGG material. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 March 2026.[permanent dead link]
- ↑ telugu, NT News (2022-12-07). "ఓయూ పరిపాలన భవనానికి శంకుస్థాపన.. సబితకు, వీసీకి కేటీఆర్ అభినందనలు". www.ntnews.com. the original నుండి 2022-12-07 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-12-08.
- ↑ "ఓయూ పరిపాలన భవనానికి శంకుస్థాపన". NavaTelangana. the original నుండి 2022-12-08 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-12-08.
- ↑ "Constituent Colleges". Osmania University (in ఇంగ్లీష్). Osmania University. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 March 2026.
- ↑ Ashok (2023-09-30). "ఓయూకు ప్రతిష్టాత్మకమైన ఐఎస్‌ఓ గుర్తింపు". Mana Telangana. the original నుండి 2023-09-30 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-10-08.
- ↑ telugu, NT News (2023-10-01). "ఓయూకు ఐఎస్‌వో గుర్తింపు". www.ntnews.com. the original నుండి 2023-10-01 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-10-08.
వెలుపలి లంకెలు
[మార్చు]- Pages using infobox university with unknown parameters
- Articles with dead external links from ఏప్రిల్ 2025
- Articles with dead external links from మే 2026
- తెలంగాణ జనగణన పట్టణాలు
- తెలంగాణ విశ్వవిద్యాలయాలు
- విశ్వవిద్యాలయాలు
- 1918 స్థాపితాలు
- హైదరాబాదు
- ఉస్మానియా విశ్వవిద్యాలయం
- హైదరాబాదు జిల్లా జనగణన పట్టణాలు
- జనగణన పట్టణాలు
