ఇస్నాపూర్ (పటాన్‌చెరు మండలం)
ఇస్నాపూర్ | |
---|---|
రెవెన్యూ గ్రామం | |
Coordinates: 17°32′55″N 78°12′37″E / 17.54861°N 78.21028°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సంగారెడ్డి |
Government | |
• Type | తెరాస |
విస్తీర్ణం | |
• Total | 9.02 కి.మీ2 (3.48 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 8,276 |
• జనసాంద్రత | 920/కి.మీ2 (2,400/చ. మై.) |
భాషలు | |
• అధికార | తెలుగు |
Time zone | UTC+5:30 |
Vehicle registration | TS |
ఇస్నాపూర్, భారతదేశం, తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు మండలం లోని గ్రామం.ఇది ఒక జనగణన పట్టణం.[1] ఇస్నాపూర్ సెన్సస్ టౌన్ మొత్తం 2082 ఇళ్లకు పైగా పరిపాలనను కలిగి ఉంది. దీనికి నీరు, మురుగునీటి వంటి ప్రాథమిక సౌకర్యాలను సంబంధిత స్థానిక స్వపరిపాలన సంస్థ అందిస్తుంది. సెన్సస్ టౌన్ పరిధిలోని రహదారులను నిర్మించడానికి,నిర్వహించటానికి దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి స్థానిక స్వపరిపాల సంస్థకు అధికారం ఉంది.2016లో తెలంగాణ రాష్ట్రంలోజిల్లాల, మండలాల పునర్య్వస్థీకరణ జరగక ముందు ఈ పట్టణం మెదక్ జిల్లా,పటాన్‌చెరు మండల పరిధిలో ఉంది. పునర్య్వస్థీకరణ భాగంగా కొత్తగా ఏర్పడిన సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు మండల పరిధిలో చేరింది.[1]
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
[మార్చు]2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మెదక్ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]
జనాభా
[మార్చు]ఇస్నాపూర్ మొత్తం జనాభా 8,276, అందులో 4,378 మంది పురుషులు, 3,898 మంది మహిళలు.దీనినిబట్టి ఇస్నాపూర్ సగటు సెక్స్ నిష్పత్తి 890గా ఉంది.ఇస్నాపూర్ పట్టణ పరిధిలో 0-6 సంవత్సరాల వయస్సులోపు గల పిల్లల జనాభా 1100, ఇది మొత్తం జనాభాలో 13%గా ఉంది. 0-6 సంవత్సరాల మధ్య 583 మంది మగ పిల్లలు ఉండగా, ఆడ పిల్లలు 517 మంది ఉన్నారు. బాలల లైంగిక నిష్పత్తి 887, ఇది సగటు సెక్స్ నిష్పత్తి (890) కన్నా తక్కువ. అక్షరాస్యత 74.8%. పురుషుల అక్షరాస్యత రేటు 82.19%, స్త్రీ అక్షరాస్యత రేటు 66.55%గా ఉంది.[3]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 https://www.census2011.co.in/data/town/573946-isnapur-andhra-pradesh.html
- ↑ "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2022-08-15.
- ↑ "Isnapur Population, Caste Data Medak Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Retrieved 2020-10-05.[permanent dead link]