శివునిపల్లి
శివునిపల్లి | |
— జనగణన పట్టణం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°49′47″N 79°24′10″E / 17.8298402°N 79.4028639°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | జనగామ |
మండలం | స్టేషన్ ఘన్‌పూర్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 6,242 |
- పురుషుల సంఖ్య | 2,960 |
- స్త్రీల సంఖ్య | 3,282 |
- గృహాల సంఖ్య | 1,351 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
శివునిపల్లి, జనగామ జిల్లా, స్టేషన్ ఘన్‌పూర్ మండలానికి చెందిన గ్రామం, జనగణన పట్టణం.[1] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2]
గ్రామ పంచాయితీ
[మార్చు]ఈ గ్రామ పంచాయతీ 1959 జూన్ 13న ఏర్పడింది. ఈ వూరికి సర్పంచిగా మొదట కౌకోటి రంగనాధ్ ఎన్నికైనాడు. అనంతరం వార్డు సభ్యులూ, సర్పంచి అందరూ కలసి గ్రామాభివృద్ధి కోసం ఢిల్లీ వెళ్ళి, దేశ తొలిప్రధాని జవహర్ లాల్ నెహ్రూను కలిసారు. అపుడు వరంగల్ ఎం.పిగా మధుసూదనరావు ఉన్నారు.
విశేషాలు
[మార్చు]ఇక్కడ పండించే ధాన్యానికి మంచి పేరుండేది. ఆ రోజులలోనే ఉడికించిన బియ్యాన్ని చెన్నైకి పంపేవారు.
విద్యా సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాల ఏర్పడి చాలా కాలమైంది. ఈ పాఠశాలలో ప్రస్తుతం కె. విజయ ప్రధానోపాధ్యాయులుగా వ్యవహరిస్తున్నారు.
గ్రామ జనాభా
[మార్చు]2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 6,242 - పురుషుల సంఖ్య 2,960 - స్త్రీల సంఖ్య 3,282 - గృహాల సంఖ్య 1,351
మూలాలు
[మార్చు]- ↑ "Villages & Towns in Ghanpur (Station) Mandal of Warangal, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2022-08-30.
- ↑ "జనగామ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.