దస్నాపూర్ (అదిలాబాదు)
దస్నాపూర్ | |
— రెవిన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 19°39′23″N 78°31′39″E / 19.656316°N 78.527362°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఆదిలాబాద్ |
మండలం | మావల |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 22,216 |
- పురుషుల సంఖ్య | 11,314 |
- స్త్రీల సంఖ్య | 10,902 |
పిన్ కోడ్ | 504001 |
ఎస్.టి.డి కోడ్ |
దస్నాపూర్,తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాదు జిల్లా, ఆదిలాబాద్ నగరంలో ఒక ప్రాంతం, ఇది ఒక జనగణన పట్టణం, మావల మండలానికి చెందిన రెవెన్యూ గ్రామం.[1] పిన్ కోడ్: 504001. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఆదిలాబాద్ జిల్లా లోని ఆదిలాబాద్ పట్టణ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన మావల మండలం లోకి చేర్చారు.[2]
గణాంక వివరాలు
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం దస్నాపూర్ మొత్తం జనాభా 22216. వారిలో పురుషులు 11314, స్త్రీలు 10902. 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు 2404 మంది ఉన్నారు.ఇక్కడ స్థానిక భాష తెలుగు. వారిలో అక్షరాస్యులు 15914 మంది ఉన్నారు.[3]
2001 భారత జనాభా లెక్కల ప్రకారం 19,962 జనాభా ఉంది. వీరిలో పురుషులు 49%, మహిళలు 51% ఉన్నారు. దస్నాపూర్ సగటు అక్షరాస్యతా రేటు 58%, జాతీయ సగటు 59.5% కంటే తక్కువ. పురుషుల అక్షరాస్యత 68%, స్త్రీ అక్షరాస్యత 48%. దస్నాపూర్ జనాభాలో 14% ఆరు సంవత్సరాల కంటే తక్కువగా ఉన్నారు.
సమీప ప్రాంతాలు
[మార్చు]టీచర్స్ కాలనీ, సంజయ్ నగర్ కాలనీ, చైతన్యపురి, ఖోజా కాలనీ, రిక్షా కాలనీ.
సమీప నగరాలు
[మార్చు]ఆదిలాబాద్, పందరకోడా, ఘటన్జీ, నిర్మల్ సమీపంలోని నగరాలు ఆదిలాబాద్.
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "ఆదిలాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-03-06. Retrieved 2021-01-06.
- ↑ http://censusindia.gov.in/pca/SearchDetails.aspx?Id=642610