ఎనుమాముల
ఎనుమాముల | |
---|---|
Coordinates: 17°59′09″N 79°37′29″E / 17.9857°N 79.6248°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వరంగల్ |
భాష | |
• అధికార భాష | తెలుగు |
Time zone | UTC+5:30 |
పిన్‌కోడ్ | 506013 |
Vehicle registration | టిఎస్ |
ఎనుమాముల, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, వరంగల్ మండలం లోని, జనగణన పట్టణం, రెవెన్యూ గ్రామం.[1] ఈ పట్టణం వరంగల్ మహానగరపాలక సంస్థలో ఒక భాగంగా ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన వరంగల్ పట్టణ జిల్లా లోకి చేర్చారు. [2][3] ఆ తరువాత 2021 లో, వరంగల్ గ్రామీణ జిల్లా స్థానంలో వరంగల్ జిల్లాను ఏర్పాటు చేసినపుడు ఈ గ్రామం, మండలంతో పాటు కొత్త జిల్లాలో భాగమైంది.[3]2011 జనగణన సమాచారం ప్రకారం ఎనుమాముల గ్రామ లొకేషన్ కోడ్ (గ్రామం కోడ్) 578155.[4] ఈ గ్రామంలో ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఉంది. దాదాపు 117 ఎకరాల్లో విస్తరించివున్న ఈ మార్కెట్ ఆసియాలోనే రెండవ అతిపెద్ద మార్కెట్.[5]
భౌగోళికం
[మార్చు]ఈ పట్టణం 17°59′09″N 79°37′29″E / 17.9857°N 79.6248°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[6]
జనాభా గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఎనుమాముల పట్టణంలో 13,183 జనాభా ఉంది. ఇక్కడ 3,430 గృహాలు ఉన్నాయి. అందులో 6,628 మంది పురుషులు, 6,555 మంది మహిళలు ఉన్నారు. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 1438 మంది ఉన్నారు. ఎనుమాముల సగటు అక్షరాస్యత రేటు 70.06% కాగా ఇది రాష్ట్ర సగటు 67.02% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత దాదాపు 80.19% కాగా, స్త్రీ అక్షరాస్యత రేటు 59.91%గా ఉంది.[7]
సమీప గ్రామాలు
[మార్చు]ఖిలా వరంగల్, ఉరుసు, అల్లీపూర్, తిమ్మాపూర్, మమ్నూర్, నక్కలపల్లి, వసంతపూర్, బొల్లికుంట, గాదెపల్లి మొదలైన గ్రామాలు ఇక్కడికి సమీపంలో ఉన్నాయి.
రవాణా
[మార్చు]ఇక్కడికి సమీపంలోని వరంగల్, హన్మకొండ ప్రాంతాలలో రైల్వే స్టేషన్లు, రోడ్డు కనెక్టివిటీ ఉంది.
ప్రార్థనా మందిరాలు
[మార్చు]- బ్రాహ్మణ పోచమ్మ దేవాలయం
- హనుమాన్ దేవాలయం
- మైసమ్మ గుడి
- మస్జిద్-ఈ-మహమూదియా
- అఫ్జాలియా జామా మస్జిద్
విద్యాసంస్థలు
[మార్చు]- నోబుల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్
- డాక్టర్ జాకీర్ హుస్సేన్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్
- సికెయం ఆర్ట్స్ & సైన్స్ కళాశాల
- చందా కాంతయ్య మెమోరియల్ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల
- ఉర్దూ ప్రాథమిక పాఠశాల
- ఎడ్-ఫోర్ట్ టెక్నో స్కూల్
- జీనియస్ ఉన్నత పాఠశాల
మూలాలు
[మార్చు]- ↑ "Enumamula Locality". www.onefivenine.com. Archived from the original on 2021-11-11. Retrieved 2021-11-11.
- ↑ "వరంగల్ గ్రామీణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ 3.0 3.1 G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
- ↑ "Enumamula Village in Hanamkonda (Warangal) Telangana | villageinfo.in". villageinfo.in. Archived from the original on 2021-11-11. Retrieved 2021-11-11.
- ↑ "Telangana government's Rs 30 lakh deposit norm stuns agricultural traders". The New Indian Express. Archived from the original on 2020-09-29. Retrieved 2021-11-11.
- ↑ "Enumamula - Village in Hanamkonda Mandal". www.indiagrowing.com. Archived from the original on 2021-11-11. Retrieved 2021-11-11.
- ↑ "Enumamula Census Town City Population Census 2011-2021 | Andhra Pradesh". www.census2011.co.in. Archived from the original on 2021-09-15. Retrieved 2021-11-11.