వరంగల్లు మహానగర పాలక సంస్థ
వరంగల్ మహానగర పాలక సంస్థ | |
---|---|
![]() | |
రకం | |
రకం | నగర పాలక సంస్థ |
నాయకత్వం | |
మేయర్ | నన్నపనేని నరేందర్, తెలంగాణ రాష్ట్ర సమితి |
డిప్యూటి మేయర్ | ఖాజా సిరాజుద్దీన్, తెలంగాణ రాష్ట్ర సమితి |
మున్సిపల్ కమీషనర్ | సర్ఫరాజ్ అహ్మద్ |
నిర్మాణం | |
రాజకీయ వర్గాలు | తెలంగాణ రాష్ట్ర సమితి (44) భారతీయ జాతీయ కాంగ్రెస్ (04) భారతీయ జనతా పార్టీ (01) కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) (01) ఇతరులు (08) |
సమావేశ స్థలం | |
వరంగల్ మహానగర పాలక సంస్థ భవనం | |
వెబ్‌సైటు | |
అధికారిక వెబ్ సైట్ |
వరంగల్ మహానగర పాలక సంస్థ (జి.డబ్ల్యూ.ఎం.సి.) వరంగల్ పట్టణంలోని ప్రజల అవసరాలను తీర్చడం కోసం ఏర్పడిన సంస్థ.[1] ఇది 2015 వరకు వరంగల్ నగర పాలక సంస్థగా పిలువబడింది.[2] దీనిని కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ నిర్వహిస్తుంది.[3]వరంగల్ మహానగర పాలక సంస్థ ప్రస్తుత మేయర్ నన్నపనేని నరేందర్.
చరిత్ర[మార్చు]
1934లోనే వరంగల్ మున్సిపాలిటీ పురాతన మున్సిపాలిటీల్లో ఒకటిగా ఉండేది. 1952లో హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం వరంగల్లు మున్సిపాలిటీకి మొదటిసారిగా ఎన్నికలు నిర్వహించింది. 1959 జూలైలో, 1960 జూలైలో ఇది ప్రత్యేక తరగతి మున్సిపాలిటీగా మార్చబడింది. ఆ తరువాత ఆపై 1994, ఆగష్టు 18న నగర పాలక సంస్థగా ప్రకటించబడింది.[4] 2015 జనవరిలో తెలంగాణ ప్రభుత్వం 42 గ్రామపంచాయతీలను కలిపి "గ్రేటర్" స్థాయిని కలిపించి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ గా మార్చింది.[5]
స్మార్ట్ సిటీ[మార్చు]
కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన స్మార్ట్ సిటీలలో వరంగల్ ఒకటి. స్మార్ట్ సిటీ అయితే వరంగల్ పౌరులు మంచి సౌకర్యాలు పొందే అవకాశం ఉంది.[6]
కార్పొరేషన్ ఎన్నికలు[మార్చు]
2016లో జరిగిన ఎన్నికల ఫలితాలు[7]
క్రమసంఖ్య | పార్టీపేరు | పార్టీ జండా | కార్పొరేటర్ల సంఖ్య |
---|---|---|---|
01 | తెలంగాణ రాష్ట్ర సమితి | ![]() |
44 |
02 | భారత జాతీయ కాంగ్రెస్ | 04 | |
03 | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా | ![]() |
01 |
04 | భారతీయ జనతా పార్టీ | 01 | |
05 | ఇతరులు | ![]() |
08 |
మూలాలు[మార్చు]
- ↑ "Greater Warangal Municipal Corporation GWMC". Telangana State. Archived from the original on 2016-03-04. Retrieved 2017-01-10.
- ↑ "'Greater' tag to Warangal Corporation". Deccan Chronicle.
- ↑ Warangal set to become greater
- ↑ http://gwmc.gov.in/Default.aspx?desk=site
- ↑ http://www.deccanchronicle.com/150129/nation-current-affairs/article/%E2%80%98greater%E2%80%99-tag-warangal-corporation
- ↑ "Warangal to become 'Smart City' soon". Telangana State.
- ↑ http://infoelections.com/infoelection/index.php/telangana-news/7202-gwmc-elections-notification.html