కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ
Appearance
కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ | |
---|---|
కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ లోగో | |
సంస్థ వివరాలు | |
స్థాపన | 1982 |
Preceding agency | వరంగల్లు మహానగర పాలక సంస్థలో భాగం |
ప్రధానకార్యాలయం | వరంగల్లు, తెలంగాణ, భారతదేశం |
సంబంధిత మంత్రులు | కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, (ముఖ్యమంత్రి) కల్వకుంట్ల తారక రామారావు, (పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి) |
కార్యనిర్వాహకులు | మర్రి యాదవరెడ్డి[1], చైర్మన్ రవికిరణ్, వైస్ చైర్మన్ |
Parent agency | తెలంగాణ ప్రభుత్వం |
వెబ్‌సైటు | |
http://www.kuda.in/ |
కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ (కుడా) తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్లు పట్టణ అభివృద్ధి ప్రణాళిక సంస్థ.[2] వారసత్వ నిర్మాణాలు, పట్టణం, దాని పరిధి ప్రాంతంలో నిర్ధిష్టమైన అభివృద్ధికి ఈ సంస్థ మార్గనిర్దేశం చేస్తుంది.[3]
చరిత్ర
[మార్చు]ఇది 1982 సంవత్సరంలో స్థాపించబడింది.
విధులు - బాధ్యతలు
[మార్చు]ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లోని మౌలిక సదుపాయాల ప్రణాళికను, అభివృద్ధిని వివరించడానికి ఆయా అభివృద్ధి పనులకోసం పట్టణ అభివృద్ధి సంస్థలకు అధికారాలు ఇవ్వబడ్డాయి.
అధికార పరిధి
[మార్చు]1971లో మున్సిపల్ బోర్డు ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు 60 చదరపు కిలోమీటర్ల పరిధితో మొదటి ప్రణాళికను తయారుచేశారు. ప్రస్తుత ప్రణాళికలో 1,803 చదరపు కిలోమీటర్లు పరిధిలోవున్న వరంగల్లు నగరం చుట్టూ ఉన్న 19 మండలాలకు చెందిన 181 గ్రామాలలోని 3.3 లక్షల ఇళ్ళలో ఉన్న 14 లక్షలమందికి ఇది వర్తిస్తుంది.[4]
క్రమసంఖ్య | జిల్లా | మండలాలు | మొత్తం మండలాలు |
---|---|---|---|
1 | హన్మకొండ జిల్లా | హన్మకొండ, కాజీపేట, హసన్‌పర్తి, ఐనవోలు, ధర్మసాగర్, వేలేరు, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్, దామెర, ఆత్మకూర్, | 11 |
2 | వరంగల్ జిల్లా | వరంగల్, ఖిలా వరంగల్, గీసుగొండ, సంగెం, వర్ధన్నపేట | 5 |
3 | జనగామ జిల్లా | చిల్పూర్, స్టేషన్ ఘన్‌పూర్, జాఫర్‌గఢ్ | 3 |
గుర్తింపులు - పురస్కారాలు
[మార్చు]- జిల్లాలో పరిశ్రమ స్థాపనకు క్రియాశీలక పాత్ర పోషించినందుకు కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం లభించింది. హైదరాబాదులోని శిల్పారామంలో జరిగిన పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతులమీదుగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్ ఈ పురస్కారాన్ని అందుకున్నాడు.
ఇవికూడా చూడండి
[మార్చు]- హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ
- నిజామాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ
- శాతవాహన పట్టణ అభివృద్ధి సంస్థ
- ఖమ్మం పట్టణ అభివృద్ధి సంస్థ
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రభూమి, తెలంగాణ (8 November 2019). "భావి అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్లు". www.andhrabhoomi.net. Archived from the original on 8 నవంబరు 2019. Retrieved 17 January 2020.
- ↑ The Hindu, Andhra Pradesh (22 August 2008). "KUDA to auction plots from Sept. 26". Archived from the original on 29 జూన్ 2018. Retrieved 14 January 2020.
- ↑ The Hindu, Andhra Pradesh (12 October 2006). "KUDA plans mega projects". Archived from the original on 29 డిసెంబరు 2019. Retrieved 14 January 2020.
- ↑ The Hindu, Andhra Pradesh (30 March 2006). "Master plan for Warangal on cards". Archived from the original on 29 డిసెంబరు 2019. Retrieved 14 January 2020.
ఇతర లంకెలు
[మార్చు]- కుడా అధికారిక జాలగూడు Archived 2020-01-14 at the Wayback Machine