భీమదేవరపల్లి మండలం
స్వరూపం
భీమదేవరపల్లి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో హన్మకొండ జిల్లా, భీమదేవరపల్లి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°06′41″N 79°19′26″E / 18.111266°N 79.323921°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హన్మకొండ జిల్లా |
మండల కేంద్రం | భీమదేవరపల్లి |
గ్రామాలు | 12 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 55,886 |
- పురుషులు | 27,899 |
- స్త్రీలు | 27,987 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 52.52% |
- పురుషులు | 65.06% |
- స్త్రీలు | 39.75% |
పిన్‌కోడ్ | 505497 |
భీమదేవరపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా లోని ఒక మండలం.[1] 2016 పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో వరంగల్ పట్టణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు హన్మకొండ జిల్లాలో భాగమైంది. [2] [3] ప్రస్తుతం ఈ మండలం హన్మకొండ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కరీంనగర్ డివిజనులో ఉండేది. ఈ మండలంలో 12 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.
మండల జనాభా
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 55,886 - పురుషులు 27,899- స్త్రీలు 27,987. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 148 చ.కి.మీ. కాగా, జనాభా 46,924. జనాభాలో పురుషులు 23,409 కాగా, స్త్రీల సంఖ్య 23,515. మండలంలో 12,099 గృహాలున్నాయి.[4]
మండలం లోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- వంగర
- భీమదేవరపల్లి
- రత్నగిరి
- మాణిక్యాపూర్
- కొప్పూర్
- కొత్తపల్లి
- ములుకనూర్
- ముత్తారం (పి.కె)
- గట్లనర్సింగాపూర్
- కొత్తకొండ
- మల్లారం
- ముస్తఫాపూర్
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 231 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
- ↑ "వరంగల్ పట్టణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.